కొడకండ్ల పురాతన శివాలయాన్ని చేరుకున్న అన్నమయ్య గృహ సాధన చైతన్య రథయాత్ర

Submitted by narmeta srinivas on Wed, 09/11/2022 - 15:26
కొడకండ్ల పురాతన శివాలయాన్ని చేరుకున్న అన్నమయ్య గృహ సాధన చైతన్య రథయాత్ర

పూర్ణకుంభంతో ఆలయంలోకి స్వాగతం పలికిన వేదపండితులు

తిరుమల కొండపై కూల్చేసిన అన్నమయ్య గృహాన్ని వెంటనే నిర్మించాలి : 

పదకొండు లక్షల యాభై వేల సంతకాల సేకరణలో జైభారత్ కార్యకర్తల కృషి అపూర్వం : శ్రీ విజయ శంకర స్వామి

పాలకుర్తి / కొడకండ్ల (ప్రజాజ్యోతి) నవంబర్ 09 :  తిరుమల కొండపై సమతా ఆధ్యాత్మిక మూర్తి అన్నమయ్య గృహాన్ని, ఆంజనేయస్వామి విగ్రహాన్ని, అన్నమయ్య విగ్రహ ప్రాంగణాన్నీ పున:ప్రతిష్ఠ చేయాలని కోరుతూ జైభారత్, అన్నమయ్య గృహ సాధన సమితి అధ్వర్యంలో సంయుక్తంగా గత నెల రోజుల నుండి రెండు తెలుగు రాష్ట్రాల్లో జరుగుతున్న అన్నమయ్య గృహ సాధన చైతన్య రథయాత్ర బుధవారం ఉదయం కొడకండ్ల మండలంలోని పురాతనమైన శివాలయాన్ని చేరుకుంది.ఈ సందర్బంగా అన్నమయ్య గృహ సాధన సమితి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి భూక్యా శ్రీను నాయక్, జైభారత్ ఎస్సీ పోరాట వేదిక జిల్లా అధ్యక్షుడు వల్లూరి మధు మాదిగ  అధ్వర్యంలో అన్నమయ్య గృహ సాధన సమితి జాతీయ అధ్యక్షులు విజయ శంకర స్వామిని  భారీ ర్యాలీతో, పుష్పాంజలితో ఘన స్వాగతం పలికారు.అనంతరం స్థానిక శివాలయ వేద పండితులు పిండిపొలు నాగదక్షిణామూర్తి, మౌర్య శర్మ పూర్ణకుంభంతో ఆలయంలోకి స్వాగతం పలికారు.అన్నమయ్య గృహ సాధన సమితి, జై భారత్ సేకరించిన 11 లక్షల యాబై వేల సంతకాలకు పూజలు నిర్వహించారు. ఈ సందర్బంగా టిఎస్ఈజి‌సి డైరెక్టర్ అందె యాకయ్య,  సర్పంచుల పోరం మండల అధ్యక్షుడు పసునూరి మధుసూధన్, బహుజన న్యూస్ స్టేట్ చైర్మన్ జిలకర కృష్ణాకర్,మాజీ ఉప సర్పంచ్ మసురం వెంకటనారాయణ, ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రిన్సిపల్ ధర్మేంద్ర, టిఆర్ఎఎస్ పార్టీ ఎస్టీ సెల్ మండల అధ్యక్షుడు మంగ్యా నాయక్, భీమనాయక్, మాజీ మార్కెట్ కమిటీ డైరెక్టర్ దూలం సతీష్,  శ్రీ విజయ శంకర స్వామిని శాలువాలతో సన్మానించారు.ఈ సందర్భంగా అన్నమయ్య గృహ సాధన సమితి జాతీయ అధ్యక్షులు శ్రీ విజయ శంకర స్వామి మాట్లాడుతూ 2003లో తిరుమలకొండపై కూల్చేసిన సమతా ఆధ్యాత్మిక మూర్తి అన్నమయ్య గృహాన్ని, ఆంజనేయ విగ్రహాన్ని యథాస్థానంలో టీటీడీ బోర్డు వెంటనే నిర్మించాలనీ  డిమాండ్ చేశారు. అన్నమయ్య గృహ సాధన సమితి, జై భారత్ చేపట్టిన పదకొండు లక్షల యాభై వేల సంతకాల సేకరణలో జైభారత్ కార్యకర్తల కృషి అపూర్వం అని అన్నారు.తెలుగు భాషకు ప్రాణం పోసిన తొలి వాగ్గేయకారులు తాళ్ళపాక అన్నమాచార్యులు అని  అన్నమయ్య గృహ సాధన సమితి జాతీయ ప్రధాన కార్యదర్శి ఖదిజ్ఞాసి దున్న లక్ష్మేశ్వర్ తెలిపారు. తిరుమల కొండపై అన్నమయ్య కు జరిగిన అన్యాయంపై ప్రతి ఒక్కరూ ప్రశ్నించాలన్నారు.తిరుమల కొండపై అన్నమయ్య గృహాన్ని, ఆంజనేయ విగ్రహాన్ని ప్రతిష్ఠించే వరకు రాష్ట్రంలో అన్నమయ్య గృహ సాధన సమితి  తరపున ఉద్యమాన్ని గ్రామ గ్రామాన తీసుకెళ్లేందుకు అన్నమయ్య గృహ సాధన సమితి కృషి చేస్తుందని అన్నమయ్య గృహ సాధన సమితి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి భూక్యా శ్రీను నాయక్ అన్నారు. ఈ కార్యక్రమంలో  అన్నమయ్య గృహ సాధన సమితి రాష్ట్ర ఉపాధ్యక్షులు వీరన్న, జైభారత్ జాతీయ కార్యదర్శి సత్యనారాయణ గోల, జైభారత్ బిసి పోరాట వేదిక రాష్ట్ర అధ్యక్షులు గుండు వెంకన్న, జైభారత్ ఎస్సీ పోరాట వేదిక రాష్ట్ర  కార్యదర్శి ఇమ్మయ్య, జైభారత్ రాష్ట్ర నాయకులు రాఘవదాస్ , భక్తులు , గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.