ప్రజల కులమతాలకు వ్యతిరేకంగా ఉద్యమించాలి. న్యూ డెమోక్రసీ

Submitted by veerabhadram on Fri, 30/09/2022 - 13:17
Cast

 

 

 ప్రజా జ్యోతి సెప్టెంబర్ 30 చండ్రుగొండ

 

 చండ్రుగొండ మండలంలోని బెండలపాడు గ్రామంలో సిపిఐ(ఎంఎల్ ) న్యూ డెమోక్రసీ అఖిల భారత రైతు కూలీ సంఘం రాష్ట్ర కమిటీ పిలుపుమేరకు సబ్ డివిజన్ కార్యదర్శి వరుకూటి వెంకట్రావు అధ్యక్షతన కుల నిర్మూలన అవగాహన కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో సిపిఐ( ఎంఎల్ )న్యూ డెమోక్రసీ కొత్తగూడెం జిల్లా కార్యవర్గ సభ్యులు ఎస్ కే ఉమర్ ప్రసంగిస్తూ 149 సంవత్సరాల క్రితం జ్యోతిరావు బాపూజీ సత్యశోధన సమాజం సంఘం స్థాపించి ఈ దేశం కుల రక్కసి ఉండవద్దని, కులాలు మనం ఏర్పాటు చేసుకున్నాం మానవులందరూ ఒక్కటే దోపిడీ కోసం కుల విభజనలో జరిగాయి. ఈరోజు భూమి మీద ఉన్నంతకాలం మానవులు అందరూ సమానంగా సమాజంలో జీవించాలని కులం పేరుతో మతం పేరుతో మారన హోమం జరుగుతున్నాయని కులరక్కసి, కులమత రాజకీయాలకు వ్యతిరేకంగా, దేశవ్యాప్తంగా ప్రజలు పోరాడాలని పిలుపునిచ్చారు.

 కులం ఉంటే కుళ్ళురో,మతం అంటే మత్తురో,కుల మతాల ఎత్తులు దోపిడీగాల ఎత్తులు అని కులరక్కసిని ప్రజలు దూరంగా, సమ సమాజ స్థాపన కోసం పోరాడాలన్నారు. ఈ కార్యక్రమంలో భద్రు, రాంబాబు, భీముడు, నాగులు, వీరస్వామి, బాబురావు, కోదెం భద్రమ్మ, లక్ష్మ, సరోజినీ, లక్ష్మితదితరులు పాల్గొన్నారు.