గాయపడిన ప్రైవేట్ ఎలక్ట్రిషన్ కి యూనియన్ అండ

Submitted by veerabhadram on Sat, 01/10/2022 - 17:28
elacricals

 ప్రజా జ్యోతి  అక్టోబర్ 1 చంద్రుగొండ:

 చండ్రుగొండ మండలం అయ్యన్న పాలెం గ్రామానికి చెందిన చాపలమడుగు సతీష్ అనే ప్రైవేట్ ఎలక్ట్రిషియన్ కి 5 ఎచ్ పి మోటర్ ఒక చోట నుంచి తరలించే క్రమంలో ప్రమాదవశాత్తు కాలు మీద పడి తీవ్ర గాయం అవటంతో, యూనియన్ సభ్యులు సతీష్ ఇంటి వద్దకు వెళ్లి పరామర్శించి,  ఆర్థిక సాయం అందించి భరోసా కల్పించారు. ఈ సందర్భంగా యూనియన్ అధ్యక్షులు ఎస్ కె ఆసిఫ్ మాట్లాడుతూ, ప్రైవేట్ ఎలక్ట్రిషన్ యూనియన్ సభ్యులకు అండగా ఉంటుందని, సభ్యత్వం లేని ప్రవేట్ ఎలక్షన్లు సభ్యత్వం కట్టి యూనియన్ లో చేరాలని  యూనియన్ కి సంబంధించిన ప్రతి ఒక్క కార్యక్రమంలో పాల్గొనాలని, లేబర్ ఇన్సూరెన్స్, ఈశ్రమ్ ఇన్సూరెన్స్ చేయించుకోవాలని  తెలిపారు. ఈ కార్యక్రమంలో కార్యదర్శి వీరేంద్ర, గౌరవాధ్యక్షులు లక్ష్మణ్, కోశాధికారి నజీర్, కోర్ కమిటీ మెంబర్ పాషా, హబీబ్,శ్రీను,బాబురావు, వెంకటాచారి తదితరులు పాల్గొన్నారు