ఆర్ఎంపీ డాక్టర్లు అధిక ఫీజులు వసూలు చేస్తే కఠిన చర్యలు మెడికల్ ఆఫీసర్ వెంకట ప్రకాష్

Submitted by veerabhadram on Sat, 01/10/2022 - 17:23
rmp doctor

 

 ప్రజా జ్యోతి అక్టోబర్ 1 చంద్రుగొండ:

 గ్రామీణ వైద్యులు అధిక ఫీజులు వసూలు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని మెడికల్ ఆఫీసర్ వెంకట ప్రకాష్ అన్నారు. శనివారం స్థానిక ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో నిర్వహించిన మండల గ్రామీణ వైద్యుల  సమీక్ష సమావేశంలో ఆయన పాల్గొని అవగాహన కల్పించారు. గ్రామీణ వైద్యులు వృత్తిపరమైన సర్టిఫికెట్లు ప్రాథమిక చికిత్స కేంద్రాల్లో ఉంచుకోవాలన్నారు. గ్రామాల్లో రెండు రోజుల కంటే ఎక్కువ జ్వరం వచ్చే పేషెంట్లు వివరాలు ఏఎన్ఎం, ఇతర వైద్య సిబ్బందికి తెలియజేయాలన్నారు. పేషంట్ల వివరాలు ఎప్పటికప్పుడు నమోదు చేసుకోవాలని, ఉన్నతాధికారులు తనిఖీలకు వచ్చే సమయంలో అన్ని రికార్డులు, వివరాలు ఉండాలని లేకుంటే చర్యలు తప్పవని హెచ్చరించారు. పరిమితికి మించి వైద్యం చేసినా, అబార్షన్ చేసినా, చట్టరీత్యా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ సమావేశంలో గ్రామీణ వైద్యులు దయాకర్, ఆనంద్ రావు, నరసింహారావు, షాబీర్ ఫాషా, నరసింహారావుతదితరులు పాల్గొన్నారు.