మినీ టెక్స్ టైల్ పార్క్ ఏర్పాట్లను పరిశీలించిన జిల్లా కలెక్టర్ సిహెచ్ శివలింగయ్య

Submitted by narmeta srinivas on Thu, 10/11/2022 - 18:20
మినీ టెక్స్ టైల్ పార్క్ ఏర్పాట్లను పరిశీలించిన జిల్లా కలెక్టర్ సిహెచ్ శివలింగయ్య

 టెక్స్ టైల్ పార్కు శంకుస్థాపనకు సిద్దంగా ఉండాలి : కలెక్టర్

పాలకుర్తి / కొడకండ్ల నవంబర్ 10 :  కొడకండ్ల మండల కేంద్రంలో ఏర్పాటు చేయబోయే మినీ టెక్స్ టైల్ పార్క్ ప్రాంతంలో గురువారం జిల్లా కలెక్టర్ సిహెచ్.శివలింగయ్య, అదనపు కలెక్టర్ ప్రపుల్ దేశాయ్, తెలంగాణ పారిశ్రామిక సంస్థ జోనల్ మేనేజర్, సంతోష్ కుమార్ లతో కలిసి పర్యటించారు.ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ త్వరలోనే టెక్స్ టైల్ పార్కుకు శంకుస్థాపన ఉంటుందని అందుకు సిద్దంగా ఉండాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.అనంతరం తొలిమెట్టు కార్యక్రమంలో భాగంగా కోడకండ్ల మండల కేంద్రంలో ఎస్సి బాలుర వసతి గృహం సందర్శించి తొలి మెట్టు కార్యక్రమలో పిల్లలకు అందుతున్న విద్య బోధనల గురించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో రెవెన్యూ డివిజనల్ అధికారి క్రిష్ణ వేణి, ఏడీ సర్వే ల్యాండ్, కొండల్ రెడ్డి, డిఈఓ రాము, ఎస్సి కార్పొరేషన్ ఈడి వెంకన్న, డిసీఎస్ఓ రోజా రాణీ, డి ఎం. సంధ్యా రాణీ, డిసిఓ కిరణ్ కుమార్,తహశీల్దార్ చంద్ర మోహన్, ఎంపిడివో సురేంద్ర నాయక్ , ఎంపిపి ధరావత్ జ్యోతి, సర్పంచ్ పసునూరి మధుసూధన్, ఎం‌పి‌టి‌సి కుందూరు విజయలక్ష్మి అమరేందర్ రెడ్డి,మాజీఉప సర్పంచ్ లు వెంకట నారాయణ,రమేశ్,దూలం సతీష్,శన్న, మండల అధికారులు ,నాయకులు తదితరులు పాల్గొన్నారు