పద్మశాలి సంఘం ఆద్వర్యంలో ఘనంగా నల్ల నర్సింహులు వర్దంతి

Submitted by narmeta srinivas on Sat, 05/11/2022 - 18:22
పద్మశాలి సంఘం ఆద్వర్యంలో ఘనంగా నల్ల నర్సింహులు వర్దంతి

నల్ల నర్సింహులు ఆశయాలు కొనసాగించాలి : పసునూరి నవీన్ కుమార్

పాలకుర్తి / కొడకండ్ల  (ప్రజాజ్యోతి) నవంబర్ 05 :తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట వీరుడు నల్ల నర్సింహులు 29 వ వర్దంతి సందర్బంగా శనివారం కొడకండ్ల మండల కేంద్రంలోని పద్మశాలి సంఘ భవనంలో సంఘం అధ్యక్షుడు పసునూరి నవీన్ కుమార్ ఆధ్వర్యంలో నల్లనర్సింహులు చిత్ర పటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు.ఈ సందర్భంగా పసునూరి నవీన్ కుమార్ మాట్లాడుతూ పద్మశాలి ముద్దుబిడ్డ,స్వతంత్ర సమర యోధుడు,తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో కీలక పాత్ర పోషించిన వీరుడు, బి.సి.కులాల అభివృద్ధి కోసం పాటుపడిన వ్యక్తి,వారి అభివృద్ధి కోసం ప్రపంచ వేదికల్లో పాల్గొని ప్రసంగించిన వ్యక్తి నల్ల.నర్సింహులు అని, వారి ఆశయాలను కొనసాగించాలని కోరుతూ ఘనంగా నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిధులుగా పాల్గొన్న సీనియర్ నాయకుడు కుందూరు అమరేందర్ రెడ్డి, మార్కెట్ కమిటీ ఛైర్మన్ పేరం రాము, గ్రామ సర్పంచ్ పసునూరి మధుసూదన్ లు మాట్లాడుతూ నల్ల నర్సింహులు నేటి తరం యువతకు ఆదర్శ ప్రాయుడని అన్నారు.. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ బోయిని రమేష్, సంఘ సబ్యులు దోర్ణం ప్రభాకర్,మసురం మోహన్,మసురం వెంకటనారాయణ,పసునూరి రాజు,వనం ఉప్పలయ్య,మసురం రమేష్,చెన్న ఉపేందర్,పొన్నం వెంకన్న,దాసరి ఉపేందర్,యెన్నం సత్తయ్య,బి.వెంకన్న, తదితరులు పాల్గొన్నారు.