కొడకండ్ల.

పద్మశాలి సంఘం ఆద్వర్యంలో ఘనంగా నల్ల నర్సింహులు వర్దంతి

Submitted by narmeta srinivas on Sat, 05/11/2022 - 18:22

నల్ల నర్సింహులు ఆశయాలు కొనసాగించాలి : పసునూరి నవీన్ కుమార్

పాలకుర్తి / కొడకండ్ల  (ప్రజాజ్యోతి) నవంబర్ 05 :తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట వీరుడు నల్ల నర్సింహులు 29 వ వర్దంతి సందర్బంగా శనివారం కొడకండ్ల మండల కేంద్రంలోని పద్మశాలి సంఘ భవనంలో సంఘం అధ్యక్షుడు పసునూరి నవీన్ కుమార్ ఆధ్వర్యంలో నల్లనర్సింహులు చిత్ర పటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు.ఈ సందర్భంగా పసునూరి నవీన్ కుమార్ మాట్లాడుతూ పద్మశాలి ముద్దుబిడ్డ,స్వతంత్ర సమర యోధుడు,తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో కీలక పాత్ర పోషించిన వీరుడు, బి.సి.కులాల అభివృద్ధి కోసం పాటుపడిన వ్యక్తి,వారి అభివృద్ధి కోసం ప్రపంచ వేదికల్లో పాల్గొని

నరక ప్రాయంగా మొండ్రాయి పాలకుర్తి రోడ్డు

Submitted by narmeta srinivas on Mon, 24/10/2022 - 18:55
  • భారీ గుంతలతో ప్రమాదాలకు గురవుతున్న వాహనదారులు

  • పట్టించుకోని అధికారులు

పాలకుర్తి / కొడకండ్ల (ప్రజా జ్యోతి) అక్టోబర్ 24 : కొడకండ్ల మండలంలోని మొండ్రాయి ఎక్స్ రోడ్డు నుండి రామన్నగూడెం, లక్ష్మక్క పల్లి, చెన్నూరు మీదుగా పాలకుర్తి కి వెళ్లే ప్రధాన రహదారి వాహనదారులకు నరకప్రాయంగా మారింది. రోడ్డుపై భారీ గుంతలు ఏర్పడి వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు రోడ్డు కుంగిపోయి పెద్ద పెద్ద గుంతలు ఏర్పడ్డాయి.

మండలంలో ఘనంగా సద్దుల బతుకమ్మ పండుగ

Submitted by narmeta srinivas on Mon, 03/10/2022 - 21:41

కొడకండ్ల (ప్రజా జ్యోతి) అక్టోబర్ 03 : తెలంగాణ ఆడబిడ్డలు ఎంతో ఇష్టంగా ఘనంగా జరుపుకునే తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ చివరి రోజు సోమవారం సద్దుల బతుకమ్మను మండలంలో మహిళలు ఘనంగా జరుపుకున్నారు. రంగురంగుల పూలతో బతుకమ్మలను పేర్చిన మహిళలు గౌరమ్మ ను పూజించి ఆటపాటలతో బతుకమ్మలను ఆడి సంతోషంగా గడిపారు. బతుకమ్మల వద్ద చిన్ననాటి స్నేహితులు బంధువులతో, చిన్న ,పెద్ద అంతా కలిసి బతుకమ్మ ,డీజే పాటలతో నృత్యాలు చేశారు.