పాలకుర్తి

గ్రామీణ క్రీడా ప్రాంగణాలు వారం రోజుల్లో పూర్తి చేయాలి

Submitted by narmeta srinivas on Fri, 18/11/2022 - 20:05

ఎంపీడీవో : సురేంద్ర నాయక్

పాలకుర్తి / కొడకండ్ల (ప్రజాజ్యోతి) నవంబర్ 18 : గ్రామీణ క్రీడా ప్రాంగణాల నిర్మాణాలలో భాగంగా నిర్మిస్తున్న క్రీడా ప్రాంగణాలు, జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు వారం రోజుల్లోగా పూర్తి చేయాలని గ్రామ కార్యదర్శులను ,సర్పంచ్ లను ఎంపీడీవో సురేంద్రనాయక్ ఆదేశించారు. శుక్రవారం మండలంలోని పెద్దబాయి తండా, లక్ష్మక్క పల్లి, రామేశ్వరం క్రీడా ప్రాంగణాల సైట్, నర్సరీ లను ఎంపీడీవో సురేంద్రనాయక్ సందర్శించారు.

బదిలీపై వెళ్లిన ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ ధర్మేంద్ర

Submitted by narmeta srinivas on Fri, 18/11/2022 - 19:55

సమర్థవంతంగా పనిచేసిన ధర్మేంద్ర : జనగామ డిఐఈఓ బైరి శ్రీనివాస్

పాలకుర్తి / కొడకండ్ల (ప్రజా జ్యోతి) నవంబర్ 18 : కొడకండ్ల మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో గత ఐదున్నర సంవత్సరాల కాలం పాటు ప్రిన్సిపాల్ గా విధులు నిర్వహించిన శ్రీధర్ల ధర్మేంద్ర బదిలీపై హన్మకొండ జూనియర్ కళాశాలకు వెళ్లిపోయారు. ఈ సందర్భంగా కళాశాలలో ప్రిన్సిపాల్ ధర్మేంద్రకు శుక్రవారం వీడ్కోలు సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న జిల్లా డిఐఇఓ బైరి శ్రీనివాస్ మాట్లాడుతూ ధర్మేంద్ర కొడకండ్ల లోనే కాకుండా జనగామ జిల్లా ఇంటర్ విద్యలో కీలక పాత్ర పోషించారని అన్నారు.

పలు అనారోగ్య బాధిత కుటుంబాలను పరామర్శించిన డిసిసిబి వైస్ చైర్మన్ కుందూరు వెంకటేశ్వర్ రెడ్డి

Submitted by narmeta srinivas on Thu, 17/11/2022 - 18:19

పాలకుర్తి / కొడకండ్ల ( ప్రజాజ్యోతి) నవంబర్ 17 :  కొడకండ్ల మండలంలోని పలు అనారోగ్య బాధిత కుటుంబాలను డిసిసిబి వైస్ చైర్మన్ కుందూరు వెంకటేశ్వర్ రెడ్డి గురువారం పరామర్శించారు. మండల రైతు బంధు అద్యక్షుడు దీకొండ వెంకటేశ్వరరావు ఇటీవల శస్త్ర చికిత్స చేయించుకోగా విషయం తెలుసుకుని టిఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షుడు సిందె రామోజీ తో కలిసి మొoడ్రాయి గ్రామంలోని ఆయన నివాసానికి వెళ్ళి పరామర్శించారు. మండల కేంద్రానికి చెందిన గ్రామ రైతుబంధు అధ్యక్షుడు గార్లపాటి ఉపేందర్ రెడ్డి తల్లి ఇటీవల మరణించగా వారి కుటుంబాన్ని పరామర్శించారు.

గోవుల సంరక్షణ అందరి బాధ్యత

Submitted by narmeta srinivas on Tue, 15/11/2022 - 18:21

గోశాల ఫెడరేషన్ రాష్ట్ర గౌరవ అధ్యక్షుడు : మహేష్ అగర్వాల్

పాలకుర్తి / కొడకండ్ల ( ప్రజాజ్యోతి) నవంబర్ 15 : గోవుల సంరక్షణ అందరి బాధ్యత అని,గోవుల సంరక్షణను ప్రతి ఒక్కరు బాధ్యతగా భావించి సంరక్షించాలని గోవుల సంరక్షణతోనే రైతుల మనుగడ సాధ్యమవుతుందని తెలంగాణ గోశాల ఫెడరేషన్ రాష్ట్ర గౌరవ అధ్యక్షుడు మహేష్ అగర్వాల్ అన్నారు. మంగళవారం కొడకండ్ల మండలంలోని నర్సింగాపురం గ్రామంలో యాకన్న గోశాల ఆధ్వర్యంలో సర్పంచ్ దండెంపెళ్లి శ్రీలతతో కలిసి రైతులకు గోవులను పంపిణీ చేశారు.

ప్రాథమిక పాఠశాల లో ఘనంగా బాలల దినోత్సవం

Submitted by narmeta srinivas on Mon, 14/11/2022 - 16:24

పాలకుర్తి / కొడకండ్ల ( ప్రజాజ్యోతి) నవంబర్ 14 : భారత దేశ మొట్ట మొదటి ప్రధానమంత్రి పండిట్ జవహర్ లాల్ నెహ్రూ జన్మదినం సందర్భంగా సోమవారం కొడకండ్ల మండల కేంద్రం ఎస్సీ కాలనిలోని ప్రాధమిక పాఠశాలలో బాలల దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. పలువురు విద్యార్థులు ఆకర్షణీయమైన దుస్తులు ధరించి వేడుకలు ఘనంగా నిర్వహించారు.ఈ కార్యక్రమంలో నెహ్రు వేషధారణలో ఎ.అమ్జత్, ఎదపై ఎర్రటి గులాబీలు ధరించి తెల్లటి టోపితో పాల్గొని ఆకర్షణ గా నిలిచాడు. ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయుడు దొర్ణం ప్రభాకర్ మాట్లాడుతూ చాచా నెహ్రు గొప్ప నాయకుడని పిల్లలను ప్రేమించి ఆభిమానించే మహోన్నత వ్యక్తి అని కొనియాడారు.

మంత్రి సమక్షంలో టిఆర్ఎస్ పార్టీ లో చేరిన రామవరం, రామేశ్వరం గ్రామాల కాంగ్రెస్ ,బీజేపీ కార్యకర్తలు

Submitted by narmeta srinivas on Sun, 13/11/2022 - 17:31

కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన మంత్రి ఎర్రబెల్లి దయాకరరావు

పాలకుర్తి /కొడకండ్ల (ప్రజాజ్యోతి) నవంబర్ 13 : :కొడకండ్ల మండలంలోని రామవరం, రామేశ్వరం,గ్రామాలకు చెందిన 15 మంది కాంగ్రెస్,బిజెపి పార్టీ కార్యకర్తలు డీసీసీబీ వైస్ చైర్మన్ కుందురు వెంకటేశ్వరరెడ్డి,టిఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షుడు సిందే రామోజీ ఆధ్వర్యంలో ఆదివారం హన్నంకొండ లోని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు క్యాంపు కార్యాలయంలోమంత్రి దయాకర్ రావు సమక్షంలో టిఆర్ఎస్ పార్టీలో చేరారు.ఈ సందర్బంగా మంత్రి వారికి టిఆర్ఎస్ పార్టీ కండువా కప్పి పార్టీ లోకి ఆహ్వానించారు.

శరీర అవయవ దానం మహాదానం. రచయిత్రి సొన్నాయిల కృష్ణవేణి

Submitted by lenin guduru on Sat, 12/11/2022 - 15:55

శరీర అవయవ దానం మహాదానం.

  • మనిషి మరణం తర్వాత మట్టిగానో,బూడిదగానో మిగలొద్దు

  • మరణానంతరం కూడా మరికొంత మందికి బ్రతుకును ఇవ్వొచ్చు

  • రచయిత్రి సొన్నాయిల కృష్ణవేణి


పాలకుర్తి: నవంబర్ 11, ప్రజాజ్యోతి
అవయవ దానం మహాదానం అని శరీర,అవయవ, నేత్ర, దానం వలన ఇతరుల ప్రాణాలు కాపాడవచ్చు అని,

జర్నలిస్ట్ కుటుంబాన్ని పరామర్శించిన మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు

Submitted by narmeta srinivas on Fri, 11/11/2022 - 21:10

పాలకుర్తి / కొడకండ్ల (ప్రజాజ్యోతి)  నవంబర్ 11 : కొడకండ్ల మండల కేంద్రానికి చెందిన మెట్రో ఈవినింగ్స్ జర్నలిస్ట్ దూదిగాని నాగరాజు తండ్రి దూదిగాని గురువయ్య టీఆర్ఎస్ నాయకుడు కొద్ది రోజుల క్రితం మరణించగా బాధిత కుటుంబాన్నిశుక్రవారం మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు పరామర్శించారు.

పాము కాటుకు గురైన సర్పంచ్ తొ పాటు పలువురిని పరామర్శించిన మంత్రి ఎర్రబెల్లి

Submitted by narmeta srinivas on Fri, 11/11/2022 - 20:12

పలువురు కార్యకర్తల కుటుంబాలకు పరామర్శ

కొడకండ్ల / పాలకుర్తి (ప్రజాజ్యోతి) నవంబర్ 11 : చెరువు ముందు తండా గ్రామపంచాయతీ సర్పంచ్ సునీత యాకూబ్ ఇటీవల పాముకాటుకు గురై అస్వస్థతకు గురికాగా శుక్రవారం సర్పంచ్ సునీతను మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు పరామర్శించారు. టిఆర్ఎస్ సీనియర్ నాయకులు నర్మెట రాము, నర్మెట శ్రీనుల తల్లి నర్మెట రాములమ్మ ఇటీవల అకాల మరణం చెందగా వారి కుటుంబాన్ని పరామర్శించారు.గ్రామ రైతు బంధు అధ్యక్షుడు గార్లపాటి ఉపేందర్ రెడ్డి తల్లి. ఇటీవల మృతిచెందగా ఉపేందర్  రెడ్డి కుటుంబాన్ని పరామర్శించారు.

డిసెంబర్ లో మంత్రి కే‌టి‌ఆర్ చేతుల మీదుగా మినీ టెక్స్ టైల్ పార్కు శంకుస్థాపన

Submitted by narmeta srinivas on Fri, 11/11/2022 - 18:46

ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభం సందర్భంగా మంత్రి ఎర్రబెల్లి వెళ్లడి

రైతు పండించిన ప్రతి గింజను కొంటాం

తెలంగాణ వచ్చాకే రైతుల జీవితాలలో వెలుగులు

రైతు సంక్షేమం ,అభివృద్ధి తెలంగాణ ప్రభుత్వ ధ్యేయం 

పాలకుర్తి / కొడకండ్ల (ప్రజాజ్యోతి ) నవంబర్ 11 : కొడకండ్ల కేంద్రంగా మినీ టెక్స్ టైల్ పార్క్ ఏర్పాటు చేయబోతున్నామని డిసెంబర్ నెల మొదటి వారంలో మంత్రి కేటీఆర్ చేతుల మీదుగా పార్కు ఏర్పాటుకు శంకుస్థాపన చేస్తామని రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణ అభివృద్ధి ,గ్రామీణ మంచి నీటిసరఫరాల శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు..