శరీర అవయవ దానం మహాదానం. రచయిత్రి సొన్నాయిల కృష్ణవేణి

Submitted by lenin guduru on Sat, 12/11/2022 - 15:55
Book Release

శరీర అవయవ దానం మహాదానం.

  • మనిషి మరణం తర్వాత మట్టిగానో,బూడిదగానో మిగలొద్దు

  • మరణానంతరం కూడా మరికొంత మందికి బ్రతుకును ఇవ్వొచ్చు

  • రచయిత్రి సొన్నాయిల కృష్ణవేణి


పాలకుర్తి: నవంబర్ 11, ప్రజాజ్యోతి
అవయవ దానం మహాదానం అని శరీర,అవయవ, నేత్ర, దానం వలన ఇతరుల ప్రాణాలు కాపాడవచ్చు అని,
మరణం తర్వాత మనిషి మట్టిగానో,బూడిదగానో మిగలకుండా అవయవాలు అవసరం ఉన్న మరికొంత మందికి బ్రతుకును ఇవ్వొచ్చు అని, శరీరాన్ని వైద్య కళాశాల లకు అందివ్వడం ద్వారా వైద్య వృత్తి కి ఉపయోగపడుతుందని కవయిత్రి, రచయిత్రి, తెలుగు ఉపాధ్యాయురాలు సొన్నాయిల కృష్ణవేణి అన్నారు.
శుక్రవారం  ప్రముఖ కవయిత్రి కరుణశ్రీ ముప్పాళ్ళ రాసిన
 " విశ్వమంత కన్ను వీక్షిస్తుంది నన్ను " పుస్తకాన్ని ( అవగాహన
 గ్రంథం ) పాలకుర్తి  జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఆవిశ్కరించి ఆ పుస్తకాలను పాఠశాల గ్రంథాలయానికి అందజేశారు.
ఈ సందర్భంగా కృష్ణవేణి మాట్లాడుతూ
విద్యార్ధి దశనుండే శరీర, అవయవ దానం పై అవగాహన పెంచుకోవాలని అన్నారు.
ఈ అవగాహన గ్రంథం విద్యార్థులకు ఎంతగానో ఉపయోగపడుతుందని అన్నారు. ప్రతి ఒక్కరూ నేత్రదానం చేయాలని అన్నారు.
రచయిత్రి కరుణశ్రీ
అవయవ దానం పై పరిశోధన చేసి ప్రముఖుల అభిప్రాయాలను, శరీర, అవయవ  దాతల వివరాలను పొందుపరిచారని తెలిపారు.
ప్రతి ఒక్కరూ శరీర,అవయవ దానం పై అవగాహన కలిగి ఉండాలని సూచించారు.
ఈ పుస్తకానికి ప్రముఖ రచయిత యండమూరి వీరేంద్రనాథ్, అంపశయ్య నవీన్, లాంటి గొప్ప వ్యక్తులు ముందు మాటలు రాయడం గర్వించదగ్గ విషయం అని అన్నారు.
ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు
ఎం.శోభారాణి, జర్నలిస్టు గూడూరు లెనిన్, ఉపాధ్యాయులు భవాని,దీప,విజయకుమారి,
వకుళ,సుమత తదితరులు పాల్గొన్నారు.