గ్రామీణ క్రీడా ప్రాంగణాలు వారం రోజుల్లో పూర్తి చేయాలి

Submitted by narmeta srinivas on Fri, 18/11/2022 - 20:05
గ్రామీణ క్రీడా ప్రాంగణాలు వారం రోజుల్లో పూర్తి చేయాలి

ఎంపీడీవో : సురేంద్ర నాయక్

పాలకుర్తి / కొడకండ్ల (ప్రజాజ్యోతి) నవంబర్ 18 : గ్రామీణ క్రీడా ప్రాంగణాల నిర్మాణాలలో భాగంగా నిర్మిస్తున్న క్రీడా ప్రాంగణాలు, జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు వారం రోజుల్లోగా పూర్తి చేయాలని గ్రామ కార్యదర్శులను ,సర్పంచ్ లను ఎంపీడీవో సురేంద్రనాయక్ ఆదేశించారు. శుక్రవారం మండలంలోని పెద్దబాయి తండా, లక్ష్మక్క పల్లి, రామేశ్వరం క్రీడా ప్రాంగణాల సైట్, నర్సరీ లను ఎంపీడీవో సురేంద్రనాయక్ సందర్శించారు. కొడకండ్ల మండల నర్సరీలకు సంబంధించి 2023-24 సంవత్సరానికి నాలుగు లక్షల 50 వేల మొక్కలని, చిన్న మొక్కలు పెద్ద బ్యాగులో కన్వెన్షన్ చేయుటకు 25400, కవర్లు గట్టిగా ఉన్న బ్యాగులు కంటిన్యూ 25250, గ్రామాల వారీగా ఇచ్చిన టార్గెట్ వారం రోజులలో బ్యాంగ్ ఫిల్లింగ్, మట్టిని తరలించాలని, ప్రతి నర్సరీకి ఐదు బెడ్లు ఏర్పాటు చేయాలని అన్నారు. మరుగుదొడ్ల సర్వే పూర్తిస్థాయిలో పూర్తి చేయాలని సిబ్బంది సకాలంలో సమయపాలన పాటించి విధులకు హాజరు కావాలని కోరారు. విధుల పట్ల ఎవరైనా నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు ఉంటాయని సిబ్బందిని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఏపీఓ నరిగే కుమారస్వామి గౌడ్, ఈసి మోహన్, టెక్నికల్ అసిస్టెంట్ భాస్కర్, ఫీల్డ్ అసిస్టెంట్ చందర్, మేట్ బిక్షపతి తదితరులు పాల్గొన్నారు