డిసెంబర్ లో మంత్రి కే‌టి‌ఆర్ చేతుల మీదుగా మినీ టెక్స్ టైల్ పార్కు శంకుస్థాపన

Submitted by narmeta srinivas on Fri, 11/11/2022 - 18:46
డిసెంబర్ లో మంత్రి కే‌టి‌ఆర్ చేతుల మీదుగా మినీ టెక్స్ టైల్ పార్కు శంకుస్థాపన

ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభం సందర్భంగా మంత్రి ఎర్రబెల్లి వెళ్లడి

రైతు పండించిన ప్రతి గింజను కొంటాం

తెలంగాణ వచ్చాకే రైతుల జీవితాలలో వెలుగులు

రైతు సంక్షేమం ,అభివృద్ధి తెలంగాణ ప్రభుత్వ ధ్యేయం 

పాలకుర్తి / కొడకండ్ల (ప్రజాజ్యోతి ) నవంబర్ 11 : కొడకండ్ల కేంద్రంగా మినీ టెక్స్ టైల్ పార్క్ ఏర్పాటు చేయబోతున్నామని డిసెంబర్ నెల మొదటి వారంలో మంత్రి కేటీఆర్ చేతుల మీదుగా పార్కు ఏర్పాటుకు శంకుస్థాపన చేస్తామని రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణ అభివృద్ధి ,గ్రామీణ మంచి నీటిసరఫరాల శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు.. శుక్రవారం కొడకండ్ల మండల కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్ ఆవరణలో , రామన్నగూడెం గ్రామంలో ధాన్యం కొనుగోలు కేంద్రాలను మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా మండల కేంద్రంలోని మార్కెట్ కమిటీ ఆవరణలో ఏర్పాటుచేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ పార్కు ఏర్పాటుతో నియోజకవర్గంతో పాటు జిల్లాలోని నేతన్న లకు ఉపాధి అవకాశాలు లభిస్తాయని అన్నారు.తెలంగాణ వచ్చి కెసిఆర్ సీఎం అయ్యాకే రైతుల జీవితాలలో వెలుగులు నిండాయని అన్నారు. రైతు పండించిన ప్రతీ గింజను మద్దతు ధరతో ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని అన్నారు. గతంలో నీటి సదుపాయం లేక, బోర్లు ఎండిపోయి ఎప్పుడు వస్తుందో తెలియని కరెంటుతో మోటార్లు, స్టార్టర్లు కాలిపోయి రైతులు అవస్థలు పడ్డారని అన్నారు. తెలంగాణ సాకారమై కెసిఆర్ సీఎం అయ్యాక రైతులకు 24 గంటల నాణ్యమైన విద్యుత్ తో పాటు కాలేశ్వరం ప్రాజెక్టు నిర్మించి కాలువల ద్వారా రిజర్వాయర్లు, .చెరువులు,కుంటలను నింపి నేడు రెండు పంటలు పండే విధంగా చేశారని అన్నారు. బీడు భూములుగా ఉన్న నేలలు నేడు పచ్చని పంటలు, పైర్లతో కళకళలాడుతున్నాయని అన్నారు. బిజెపి పాలిత రాష్ట్రాల్లో వ్యవసాయ మోటార్లకు మీటర్లు బిగిస్తున్నారని, దానివల్ల కరెంటు బిల్లులు అధికంగా వచ్చి రైతులు నష్టపోతారని ,రైతులకు నష్టం కలిగించే పనులను తెలంగాణ ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లో చేయబోదని అన్నారు. రైతుబంధు ,రైతు బీమా, ఆసరా పెన్షన్లు, కళ్యాణ లక్ష్మి , కెసిఆర్ కిట్ లాంటి ఎన్నో సంక్షేమ పథకాలతో తెలంగాణ ప్రభుత్వం పేద ప్రజలకు చేయూతనందిస్తున్నదని అన్నారు. అనంతరం మండల కేంద్రంలోని మార్కండేయ భవనంలో దళిత బంధు కార్యక్రమంపై సమీక్ష నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ ప్రపుల్ దేశాయ్, జిల్లా అధికారులు, డిసిసిబి వైస్ చైర్మన్ కుందూరు వెంకటేశ్వర రెడ్డి, టిఎస్ఈజిసి డైరెక్టర్ అందె యాకయ్య, జిల్లా రైతుబంధు సభ్యుడు సిందే రామోజీ, ఎంపీపీ ధరావత్ జ్యోతి రవీంద్ర నాయక్, మార్కెట్ కమిటీ చైర్మన్ పేరం రాము, సర్పంచ్ పసునూరి మధుసూదన్, ఎఫ్ఎస్ సి ఎస్ వైస్ చైర్మన్ మేటి సొమరాములు, ఎంపీటీసీ కుందూరు విజయలక్ష్మి అమరేందర్ రెడ్డి, కో ఆప్షన్ నజీర్, మండల రైతు బంధు సభ్యుడు దీకొండ వెంకటేశ్వరరావు, మండల నాయకులు, రైతులు పాల్గొన్నారు. కుందూరు విజయలక్ష్మి అమరేందర్ రెడ్డి, కో ఆప్షన్ నజీర్, మండల రైతు బంధు సభ్యుడు దీకొండ వెంకటేశ్వరరావు, మండల నాయకులు, రైతులు పాల్గొన్నారు.