పాలకుర్తి

కొడకండ్ల మండల సర్వసభ్య సమావేశం నిర్వహణ

Submitted by narmeta srinivas on Wed, 02/11/2022 - 20:16

పలు అంశాలపై సుదీర్ఘ చర్చ

పాలకుర్తి / కొడకండ్ల (ప్రజా జ్యోతి) నవంబర్ 02 : కొడకండ్ల మండల సర్వసభ్య సమావేశం ఎంపీపీ ధరావత్ జ్యోతి రవీంద్ర గాంధీ నాయక్ అధ్యక్షతన బుధవారం ఎంపీడీవో కార్యాలయంలో జరిగింది. సమావేశంలో ముఖ్య అతిథులుగా మార్కెట్ కమిటీ చైర్మన్ పేరం రాము పాల్గొన్నారు. సమావేశంలో మండలంలోని గ్రామాలలో జరుగుతున్న పలు పనులు, సమస్యలు, పరిష్కార మార్గాలపై సుదీర్ఘంగా చర్చించి పలు తీర్మానాలు చేశారు.

అక్రమంగా తరలిస్తున్న పిడిఎస్ బియ్యం పట్టివేత, కేసు నమోదు

Submitted by narmeta srinivas on Wed, 02/11/2022 - 19:12

పాలకుర్తి / కొడకండ్ల ( ప్రజా జ్యోతి )  నవంబర్ 02 : మండల కేంద్రంలో అక్రమంగా తరలిస్తున్న 23 క్వింటాళ్ళ పిడిఎస్  బియ్యాన్ని పట్టుకుని కేసు నమోదు చేసిన ఘటన బుధవారం ఉదయం చోటుచేసుకుంది.

నరక ప్రాయంగా మొండ్రాయి పాలకుర్తి రోడ్డు

Submitted by narmeta srinivas on Mon, 24/10/2022 - 18:55
  • భారీ గుంతలతో ప్రమాదాలకు గురవుతున్న వాహనదారులు

  • పట్టించుకోని అధికారులు

పాలకుర్తి / కొడకండ్ల (ప్రజా జ్యోతి) అక్టోబర్ 24 : కొడకండ్ల మండలంలోని మొండ్రాయి ఎక్స్ రోడ్డు నుండి రామన్నగూడెం, లక్ష్మక్క పల్లి, చెన్నూరు మీదుగా పాలకుర్తి కి వెళ్లే ప్రధాన రహదారి వాహనదారులకు నరకప్రాయంగా మారింది. రోడ్డుపై భారీ గుంతలు ఏర్పడి వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు రోడ్డు కుంగిపోయి పెద్ద పెద్ద గుంతలు ఏర్పడ్డాయి.

కొడకండ్లలో పాలకుర్తి నియోజకవర్గ పద్మశాలీల ఐక్యవేదిక సమావేశం

Submitted by narmeta srinivas on Sun, 23/10/2022 - 19:13

చేనేత వస్త్రాలపై జీఎస్టీ రద్దు చేయాలంటూ ప్రధానికి పోస్టు కార్డులు రాసిన పద్మశాలీలు 

సిఎంఆర్ఎఫ్ చెక్కులు పంపిణీ చేసిన సర్పంచ్ పసునూరి మధుసూదన్

Submitted by narmeta srinivas on Sun, 23/10/2022 - 17:53

పాలకుర్తి /కొడకండ్ల (ప్రజాజ్యోతి),  అక్టోబర్ 23 : కొడకండ్ల మండల కేంద్రానికి చెందిన పలువురు ఇటీవల అనారోగ్యంతో చికిత్స పొందగా వారికి వైద్య ఖర్చుల నిమిత్తం మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు సహకారంతో విడుదలైన సీఎంఆర్ఎఫ్ చెక్కులను ఆదివారం సర్పంచ్ పసునూరి మధుసూదన్ ఆధ్వర్యంలో  బిఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షుడు సిందే రామోజీ, ఎంపీపీ ధరవత్ జ్యోతి రవీంద్ర గాంధీ నాయక్ ,చేతుల మీదుగా పంపిణీ చేశారు. నలుగురు లబ్ధిదారులు పి. యాకమ్మ 22500, సి హెచ్. సోమమ్మ 60000, బి. లక్ష్మి 60000, వి. దయానందగిరి 17,500, మొత్తం  160000 రూపాయల చెక్కులను లబ్ధిదారులకు అందజేశారు.

లబ్ధిదారులకు సిఎంఆర్ఎఫ్ చెక్కులు అందించిన సిందే రామోజీ

Submitted by narmeta srinivas on Sat, 22/10/2022 - 21:11

పాలకుర్తి / కొడకండ్ల (ప్రజా జ్యోతి) అక్టోబర్ 22 : నిరుపేదల ఆరోగ్యానికి అండగా నిలుస్తూ వారి ఆర్థిక స్వావలంభనే లక్ష్యంగా ముఖ్యమంత్రి కేసీఆర్, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తుందని బి ఆర్ ఎస్ మండల పార్టీ అధ్యక్షుడు, జిల్లా రైతుబంధు సభ్యుడు సిందె రామోజీ అన్నారు. ఇటీవల అనారోగ్యంతో చికిత్స పొందిన మండలంలోని రామన్నగూడెం గ్రామానికి చెందిన లబ్ధిదారులకు మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు సహకారంతో విడుదలైన సీఎంఆర్ఎఫ్ చెక్కులను శనివారం రామన్నగూడెం గ్రామంలోని లబ్ధిదారుల ఇంటికి వెళ్లి అందించారు.

కొడకండ్ల లో 33 క్వింటాళ్ల పిడిఎస్ బియ్యం పట్టివేత, కేసు నమోదు

Submitted by narmeta srinivas on Sat, 22/10/2022 - 19:41

పాలకుర్తి / కొడకండ్ల (ప్రజాజ్యోతి) అక్టోబర్ 22 :  కొడకండ్ల మండల కేంద్రంలో అక్రమంగా తరలిస్తున్న 33 క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని ఎస్సై కొమురెల్లి ఆధ్వర్యంలో  పట్టుకున్న ఘటన శనివారం ఉదయం చోటుచేసుకుంది.

ఈ దీపావళికి కొత్త నోములు లేవు ,ఈ నెల 24న నరకచతుర్దశి ,25 న దీపావళి పండుగ

Submitted by narmeta srinivas on Mon, 17/10/2022 - 18:47

రాష్ట్ర ధూపదీప నైవేద్య అర్చక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి : పిండిపోలు నాగ దక్షిణామూర్తి