కాజిపేట్

డివిజన్ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తా జిడబ్ల్యూఎంసీ కమిషనర్ ప్రావీణ్య

Submitted by veerareddy on Thu, 22/09/2022 - 12:48

కాజీపేట, సెప్టెంబర్21 (ప్రజాజ్యోతి)  ...// గ్రేటర్ 46వ డివిజన్ పరిధిలోని మెట్టుగుట్ట, మెట్టు రామన్న కాలనీలలో బుధవారం మున్సిపల్ కమిషనర్ ప్రావీణ్య పర్యటించి డివిజన్లోని ప్రతి ఒక్క సమస్యను పరిష్కరిస్తానని ప్రజలకు హామీ ఇచ్చారన్నారు. ఈ సందర్భంగా జిడబ్ల్యూఎంసీ కమిషనర్ ప్రావీణ్యతో 46వ డివిజన్ కార్పొరేటర్ మునిగాల సరోజన కరుణాకర్ కలిసి సంబంధిత శాఖల అధికారులతో క్షేత్ర స్థాయిలో పర్యటించి ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను అడిగి తెలుసుకొన్నారన్నారు.

మెట్టుగుట్ట‌పై రాక్ క్లైంబింగ్‌, ట్రెక్కింగ్ ఏర్పాటు కుడా ఛైర్మెన్, పోలీస్ కమీషనర్ తో కలిసి ప్రారంభించిన ఆరూరి

Submitted by veerareddy on Wed, 21/09/2022 - 16:55

కాజీపేట టౌన్, సెప్టెంబర్ 21 (ప్రజాజ్యోతి).../  తెలంగాణ ప్ర‌భుత్వం క్రీడల‌కు పెద్ద పీఠ వేస్తోందని వర్ధన్నపేట శాసనసభ్యులు అరూరి రమేష్ అన్నారు. బుధవారం బల్దియా పరిధి 46 వ డివిజన్ మెట్టుగుట్ట పై నూతనం గా కుడా అద్వర్యం లో ఏర్పాటు చేసిన రాక్ క్లైంబింగ్‌, ట్రెక్కింగ్ ను కుడా ఛైర్మెన్ సుందర్ రాజ్ యాదవ్, పోలీస్ కమీషనర్ డా.తరుణ్ జోషి జిడబ్లుఎంసి కమిషనర్ ప్రావీణ్య లతో కలిసి ప్రారంభించారు.

బాల అదాలత్ పోస్టర్ విడుదల

Submitted by veerareddy on Tue, 20/09/2022 - 16:36

 కాజీపేట, సెప్టెంబర్20 (ప్రజాజ్యోతి)../ అర్బన్ పిల్లల సంరక్షణ కమిటి (యూసీపీసీ) చైర్ పర్సన్ 46వ డివిజన్ కార్పొరేటర్ మునిగాల సరోజన అధ్యక్షతన డివిజన్లోని రాంపూర్ లో బాల అదాలత్ పోస్టర్ ను కార్పొరేటర్ చేతుల మీదుగా విడుదల చేశారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ మాట్లాడుతూ బాల అదాలత్ బాలల హక్కుల ఉల్లంఘనపై విచారణ జరపడానికి ఈ నెల 21న ఐడిఓసి సమావేశ మందిరం నందు  నిర్వహిస్తారని అన్నారు. బాలలు గృహ కార్మికులుగా బకాయింపులు చెల్లించలేదని, గృహాలు ఉల్లంఘన బాధితులుగా, వైకల్యం సంబంధించిన ఫిర్యాదులు, పిల్లల లైంగిక వేధింపులు, అక్రమ దత్తతత్వం బాధితులైన పిల్లలు అందరూ ఫిర్యాదులు చేసుకోవచ్చని తెలిపారు.

ఖుస్రు పాషా ను పరామర్శించిన జంగా

Submitted by veerareddy on Tue, 20/09/2022 - 15:52

కాజీపేట, సెప్టెంబర్20 (ప్రజాజ్యోతి)../ కాజీపేట దర్గా పీఠాధిపతి ఖుస్రుపాష తల్లి సోమవారం రాత్రి  అనారోగ్యంతో మృతి చెందారు. ఈ విషయం తెలుసుకున్న మాజీ డిసిసిబి చైర్మన్  జంగా రాఘవరెడ్డి మంగళవారం ఖుస్రు పాషాను వారి కుటుంబాన్ని పరామర్శించి ప్రగాఢ సానుభూతిని తెలియ చేసారు. వారి కుటుంబానికి మనో ధైర్యాన్ని కల్పించి, అంతిమ సంస్కారాలో పాల్గోన్నారు.

దర్గా పీఠాధిపతి ఖుస్రు పాషాను పరామర్శించిన నాయిని...

Submitted by veerareddy on Tue, 20/09/2022 - 13:02

కాజీపేట టౌన్, సెప్టెంబర్20 (ప్రజాజ్యోతి).. కాజీపేట దర్గా పీఠాధిపతి ఖుస్రుపాష తల్లి సోమవారం రాత్రి  అనారోగ్యంతో మృతి చెందారు. ఈ విషయం తెలుసుకున్న హన్మకొండ, వరంగల్ జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు నాయిని రాజేందర్ రెడ్డి మంగళవారం  ఖుస్రు పాషా, వారి కుటుంబాన్ని పరామర్శించి ప్రగాఢ సానుభూతిని తెలియ చేసారు. ఈ కార్యక్రమంలో టిపిసిసి కార్యదర్శి మొహమ్మద్ అయూబ్, గ్రేటర్ వరంగల్ మైనారిటీ సెల్ చైర్మన్ మీర్జా అజీజిల్లా బేగ్, స్థానిక డివిజన్ అధ్యక్షుడు సింగారపు రవిప్రసాద్, యూత్ కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు పిన్నోజు ప్రదీప్, శ్రీనివాస్ యాదవ్, స్థానిక నాయకులు తదితరులు పాల్గొన్నారు

సైబర్ నేరాలపై విద్యార్థులకు అవగాహన

Submitted by veerareddy on Tue, 20/09/2022 - 12:15

కాజీపేట, సెప్టెంబర్19 (ప్రజాజ్యోతి),.../   మడికొండ సెయింట్  మ్యాథ్యూస్ హై స్కూల్ లో సోమవారం మడికొండ పోలీస్ హెడ్ కానిస్టేబుల్ జయరాజు, కానిస్టేబుల్ నాగేశ్వరరావు ఆధ్వర్యంలో విద్యార్థులకు సైబర్ నేరాలు, వివిధ అంశాలపై అవగాహన సదస్సును నిర్వహించారు. ఈ సందర్భంగా హెడ్ కానిస్టేబుల్ జయరాజు మాట్లాడుతూ సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలని, స్కూలుకు కాలినడకన వచ్చేవారు ఎడమవైపే నడవాలని, తల్లిదండ్రులు బండిమీద తీసుకువచ్చే అప్పుడు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని, ట్రాఫిక్ రూల్స్ పై విద్యార్థులందరూ అవగాహన పెంపొందించుకోవాలని తెలిపారు.

మెట్టు రామన్న కాలనీ నూతన కమిటీ ఎన్నిక

Submitted by veerareddy on Mon, 19/09/2022 - 16:19

కాజీపేట, సెప్టెంబర్19 (ప్రజాజ్యోతి)../ మడికొండ మెట్టు రామన్న కాలనీ రోడ్ నెంబర్ 3 కాలనీ వాసులచే సోమవారం నూతనంగా కమిటీ ఎన్నుకున్నారు. అధ్యక్షుడుగా అనిల్, ఉపాధ్యక్షురాలిగా యామిని, ప్రధాన కార్యదర్శిగా రత్నాకర్, సహాయ కార్యదర్శగా రవి, కోశాధికారిగా శ్రీనివాస్ లను కాలనీ వాసులు ఎన్నుకున్నారు.

మృతుని కుటుంబాన్ని పరామర్శించిన ఎమ్మెల్యే అరూరి

Submitted by veerareddy on Mon, 19/09/2022 - 14:10

కాజీపేట, సెప్టెంబర్18 (ప్రజాజ్యోతి),. ఐనవోలు మండలం కొండపర్తి గ్రామంలో తంపుల వీరలక్ష్మి అనారోగ్యంతో మరణించడంతో వరంగల్ జిల్లా తెరాస అధ్యక్షులు, వర్ధన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేష్ ఆదివారం వారి చిత్ర పటానికి నివాళులు అర్పించి, కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఈకార్యక్రమంలో డీసీసీబ్యాంక్ చైర్మన్ మార్నేని రవీందర్ రావు, జడ్పీ వైస్ చైర్మన్ గజ్జల శ్రీరాములు, మండల పార్టీ అధ్యక్షులు పోలీపల్లి శంకర్ రెడ్డి, ప్రజాప్రతినిధులు, మండల, గ్రామ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

మహిళా గ్రూపులకు సైబర్ నేరాలపై అవగాహన

Submitted by veerareddy on Mon, 19/09/2022 - 13:21

కాజీపేట, సెప్టెంబర్18 (ప్రజాజ్యోతి),,  వరంగల్ మహా నగర పాలక సంస్థ పరిధిలోని కాజీపేట దర్గాలోని మహిళా సమాఖ్య గ్రూపులకు కాజీపేట పట్టణ  సర్కిల్ ఇన్స్పెక్టర్ మహేందర్ రెడ్డి సైబర్ నేరాలపై ఆదివారం అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈసందర్భంగా డెబిట్ కార్డ్, క్రెడిట్ కార్డ్ మోసాలు, లోన్ యాప్ మోసాలు, ఓఎల్ఎక్స్ మోసాలు, పెట్టుబడి మోసాలు మొదలైన వాటిని నిరోధించడానికి సైబర్ నేరాల గురించి వారికి వివరించారు. ఈ అవగాహన కార్యక్రమంలో మహిళ సమాఖ్య గ్రూపులకు సంబంధించిన మహిళలు, పోలీస్ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.