కాజిపేట్

ఘనంగా నవరాత్రి ఉత్సవాలు ప్రారంభం

Submitted by veerareddy on Tue, 27/09/2022 - 12:39

కాజీపేట, సెప్టెంబర్26 (ప్రజాజ్యోతి)..//శ్రీ శ్రీ దేవి నవరాత్రి ఉత్సవాలలో భాగంగా శివశక్తి యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో శ్రీ భ్రమరాంబిక మల్లికార్జున స్వామి దేవాలయం లో 24వ అమ్మవారి నవరాత్రులలో మొదటి రోజు సోమవారం ప్రారంభించారు.

ముగిసిన దర్గా ఉర్సు ఉత్సవాలు

Submitted by veerareddy on Tue, 27/09/2022 - 12:20
  • దర్గాను సందర్శించిన నగర సిపి తరుణ్ జోషి
  • వోల్లు గుభాలించిన ఫకీర్ల విన్యాసాలు
  • ప్రత్యేక ప్రార్ధనలు చేసిన భక్తులు.

కాజీపేట, సెప్టెంబర్ 26 (ప్రజాజ్యోతి) .///.  కాజీపేట దర్గా కాజీపేటలోని హజ్రత్ షా అఫ్జల్ బియబాని దర్గాలో మూడు రోజులపాటు నిర్వహించిన బియబాని ఉత్సవాలు సోమవారం సాయంత్రం నిరాడంబరంగా ముగిసాయి. దర్గా పీఠాధిపతి ఖుస్రు పాషా  సోమవారం బధవా కార్యక్రమం ను పురష్కరించుకుని భక్తులతో కలిసి ప్రత్యేక ప్రార్థకం చేసి బియబాని ఉత్సవాలు  ముగిసినట్లు తెలిపారు.

ఘనంగా బియబాని ఉర్సు ఉత్సవాలు

Submitted by veerareddy on Tue, 27/09/2022 - 11:38

కాజీపేట, సెప్టెంబర్25 (ప్రజాజ్యోతి).///.. కాజీపేట లోని హజరత్ సయ్యద్ షా బియబాని దర్గా ఉత్సవాలలో రెండవ రోజు ఆదివారం మొక్కులు చెల్లించుకునేందుకు భక్తులు భారీగా తరలి రావడంతో దర్గా ప్రాంతమంతా కిక్కిరిసిపోయింది. తెల్లవారుజామున జరిగిన సందల్ కార్యక్రమంలో దర్గా పీఠాధిపతి  ఖుస్రు పాషా యువ పీఠాధిపతి భక్తి యార్ బియబాని ప్రత్యేక ప్రార్థనలు చేసి ఉత్సవాలను ప్రారంభమైనట్లుగా తెలిపారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన పీఠాధిపతులు ప్రత్యేక పీఠాధిపతులు కులమత బేధాలు లేకుండా వేలాదిమంది భక్తులు దర్గాను దర్శించుకుని ప్రత్యేక ప్రార్థనలు చేసి ఫుల్ చాదర్ కప్పి భక్తి ప్రవర్తతను చాటుకున్నారు.

కార్మికులు ప్రమాదాల పట్ల అప్రమత్తంగా ఉండాలి. రైల్వే ఈఎల్ఎస్ సీనియర్ డీఈఈ సయ్యద్ వాసీం పాషా

Submitted by veerareddy on Sat, 24/09/2022 - 14:52

కాజీపేట టౌన్‌, సెప్టెంబర్23 (ప్రజాజ్యోతి) ..//. రైల్వే కార్మికులు ప్రతి ఒక్కరు ప్రమాదాల పట్ల అప్రమత్తంగా ఉండాలని రైల్వే ఈఎల్ఎస్ సీనియర్ డీఈఈ సయ్యద్ వాసీం పాషా సూచించారు.  శుక్రవారం కాజీపేట రైల్వే జంక్షన్ పరిధిలోని రైల్వే ఎలక్ట్రికల్ లోకోషేడ్లో డీఎల్ఎస్, ఈఎల్ఎస్ షేడ్ కార్మికులకు దక్షిణ మధ్య రైల్వే డిప్యూటీ జీఎం ఆదేశానుసారం సివిల్ డిఫెన్స్ ఆర్గనైజేషన్ సికింద్రాబాద్ ఆధ్వర్యంలో ఐదు రోజుల బెసిక్ సివిల్ డిఫెన్స్ ట్రైనింగ్ క్యాంప్ ముగింపు కార్యక్రమం శుక్రవారం నిర్వహించారు.

దళిత బంధు పథకంలో ఎమ్మెల్యేల ప్రమేయాన్ని తొలగించాలి .హనుమకొండలో రాష్ట్రస్థాయి సమావేశవంగపల్లి, మేడి పాపన్న

Submitted by veerareddy on Sat, 24/09/2022 - 14:48

కాజీపేట, సెప్టెంబర్23 (ప్రజాజ్యోతి)..///..దళిత బంధు పథకంలో ఎమ్మెల్యేల ప్రమేయాన్ని తొలగించాలని, నిరుపేదలైన దళితులను ప్రభుత్వ అధికారుల పర్యవేక్షణలో ఎంపిక చేసి అసలైన లబ్ధిదారులకు పథకం వర్తింపజేయాలని ఎంఆర్పిఎస్ రాష్ట్ర అధ్యక్షులు వంగపల్లి శ్రీనివాస్ మాదిగ, జాతీయ అధ్యక్షులు మేడి పాపన్న డిమాండ్ చేశారు. శుక్రవారం హనుమకొండ జిల్లా కేంద్రంలో హనుమకొండ జిల్లా అధ్యక్షులు ఇల్లందుల రాజేష్ కన్నా ఆధ్వర్యంలో ఎమ్మార్పీఎస్ రాష్ట్ర స్థాయి సమావేశం  ప్యారడైజ్ ఫంక్షన్ హాల్ లో నిర్వహించారు.

సర్వ మతాలకు ప్రతీక, సమైక్యతకు ప్రతిరూపం ఖాజీపేట దర్గా ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్

Submitted by veerareddy on Sat, 24/09/2022 - 14:40

కాజీపేట టౌన్, సెప్టెంబర్23 (ప్రజాజ్యోతి) ..//. సర్వ మతాలకు ప్రతీక,సమైక్యతకు ప్రతిరూపం ఖాజీపేట దర్గా అని  ప్రభుత్వ చీఫ్ దాస్యం వినయ్ భాస్కర్ అన్నారు. శుక్రవారం  కాజీపేట దర్గా, పీఠాధిపతి ఖుస్రూ పాషా, అధ్యక్షతన జరిగిన ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన చీఫ్ విప్ మాట్లాడుతూ ఉమ్మడి వరంగల్ జిల్లాలో అత్యంత ప్రాధాన్యత కల్గిన దర్గా ఉర్సు, ఉత్సవాలు ఘనంగా మూడు రోజులు పాటు 24, 25, 26, చందనోత్సవము (సందల్), ఉర్సు షరీఫ్, బదావా, కార్యక్రమలు జరుపుకుంటారని తెలిపారు.దేశంలో అనేక ప్రాంతాలు, ఇతర దేశాల నుండి భక్తులు వస్తారని అందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లు ప్రభుత్వ పరంగా పూర్తి చేసామని తెలిపారు.

పూలనే పూజించే సాంప్రదాయం మనది చీరల పంపిణీ లో చీఫ్ విప్

Submitted by veerareddy on Sat, 24/09/2022 - 14:37

కాజీపేట, సెప్టెంబర్23 (ప్రజాజ్యోతి)..//..  కాజిపేట్ మున్సిపల్ సర్కిల్ కార్యాలయంలో 47,62,63 డివిజన్లకు చెందిన మహిళలకు బతుకమ్మ కానుకగా ముఖ్యమంత్రి కేసీఆర్ సారథ్యంలోని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న చీరలను ఆయా డివిజన్ల మహిళలకు రాష్ట్ర ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్ పంపిణీ చేశారు. అనంతరం చీఫ్ విప్ మహిళలను ఉద్దేశించి మాట్లాడుతూ ప్రపంచం మొత్తం పూలను పూజకు ఉపయోగించే సంప్రదాయం ఉంటే కానీ తెలంగాణలో పూలనే పూజించే సంప్రదాయం మన తెలంగాణ సంస్కృతికి ప్రతీక అన్నారు.

గంజాయి స్మగ్లర్లు ఆరగురి పై పీడి యాక్ట్ ఉక్కుపాదంతో అణిచివేస్తాం ఏసిపి శ్రీనివాస్

Submitted by veerareddy on Fri, 23/09/2022 - 14:58

కాజీపేట టౌన్, సెప్టెంబర్23 (ప్రజాజ్యోతి)..///.. వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో మొట్ట మొదటి సారిగా గంజాయి స్మగ్లర్లు ఆరుగురిపై మడికొండ పోలీసులు ఒకే సారి పీడి యాక్ట్ నమోదు చేయడం జరిగిందని కాజీపేట ఏసిపి శ్రీనివాస్ తెలిపారు. శుక్రవారం మడికొండ పోలీస్ స్టేషన్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ఔటర్ రింగ్ రోడ్డుపై టేకులగూడెం క్లాస్ రోడ్ వద్ద జూన్ 14వ రోజున మడికొండ పోలీస్ లు, టాస్క్ ఫోర్స్ పోలీసులు సంయుక్తంగా, ఒరిస్సా నుండి. రెండు కార్లలో మహారాష్ట్ర.

రైల్వే స్టేడియాన్ని పునః ప్రారంభించిన డిఆర్ఎం

Submitted by veerareddy on Fri, 23/09/2022 - 13:19

కాజీపేట టౌన్, సెప్టెంబర్22 (ప్రజాజ్యోతి)..//..  కాజీపేట రైల్వే స్టేషన్ సమీపాన ఉన్న రైల్వే స్టేడియాన్ని గురువారం సౌత్ సెంట్రల్ రైల్వే సికింద్రాబాద్ డివిజనల్ రైల్వే మేనేజర్ పునః ప్రారంభించారు. సెప్టెంబర్ 2021 సంవత్సరంలో కాజీపేట రైల్వే స్టేడియం గ్యాలరీ, సభా ప్రాంగణం, పూర్తి స్థాయిలో దెబ్బతినడంతో పాటు ప్రాంగణం ఎదురుగా మరొక షెడ్డు నిర్మాణం మరమ్మతులు మొదలుపెట్టి 9 నెలల్లో పూర్తి చేసినప్పటికీ, గత మూడు నెలల నుండి అకాల వర్షాల కారణంగా రైల్వే స్టేడియం పునః ప్రారంభానికి నోచుకోలేదు. సికింద్రాబాద్ డిఆర్ఎం ఆకస్మిక పర్యటనతో రైల్వే స్టేడియం ప్రారంభానికి నోచుకుందన్నారు.

ప్రజా సంగ్రామ ముగింపు యాత్రకు తరలిన బిజెపి శ్రేణులు

Submitted by veerareddy on Thu, 22/09/2022 - 15:39

కాజీపేట, సెప్టెంబర్22 (ప్రజాజ్యోతి) .../../ కాజీపేట లోని 62వ డివిజన్ సోమిడి నుంచి ప్రజా సంగ్రామ యాత్ర నాలుగో విడత ముగింపు బహిరంగ సభకు కాజీపేట పట్టణ భారతీయ జనతా పార్టీ ముఖ్య నాయకులు బయలుదేరి వెళ్లారు. ఈ యాత్రను భారతీయ జనతా పార్టీ హనుమకొండ జిల్లా ఉపాధ్యక్షులు చిర్ర నర్సింగ్ గౌడ్ జెండా ఊపి ప్రారంభించారు.