బాల అదాలత్ పోస్టర్ విడుదల

Submitted by veerareddy on Tue, 20/09/2022 - 16:36
Bal Adalat poster released

 కాజీపేట, సెప్టెంబర్20 (ప్రజాజ్యోతి)../ అర్బన్ పిల్లల సంరక్షణ కమిటి (యూసీపీసీ) చైర్ పర్సన్ 46వ డివిజన్ కార్పొరేటర్ మునిగాల సరోజన అధ్యక్షతన డివిజన్లోని రాంపూర్ లో బాల అదాలత్ పోస్టర్ ను కార్పొరేటర్ చేతుల మీదుగా విడుదల చేశారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ మాట్లాడుతూ బాల అదాలత్ బాలల హక్కుల ఉల్లంఘనపై విచారణ జరపడానికి ఈ నెల 21న ఐడిఓసి సమావేశ మందిరం నందు  నిర్వహిస్తారని అన్నారు. బాలలు గృహ కార్మికులుగా బకాయింపులు చెల్లించలేదని, గృహాలు ఉల్లంఘన బాధితులుగా, వైకల్యం సంబంధించిన ఫిర్యాదులు, పిల్లల లైంగిక వేధింపులు, అక్రమ దత్తతత్వం బాధితులైన పిల్లలు అందరూ ఫిర్యాదులు చేసుకోవచ్చని తెలిపారు. అందరూ బాల అదాలత్ గురించి మీ సర్వే పరిధిలో  ప్రచారం చేయాలని తెలిపారు. ఈ కార్యక్రమానికి ఐసిడిఎస్ మడికొండ సెక్టార్ సూపర్వైజర్ డి.రాజ్యలక్ష్మి, అంగన్ వాడి టీచర్లు ఉమా, మంజుల, జ్యోతి, శారద, పద్మావతి, సంధ్య ,స్వరూప, యుసిపిసి సభ్యులు చెన్నూరి రవి, కడారి ప్రశాంత్, మునిగాల బాబు, ఏఎన్ఎం వసంత, సంగీత, ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు.