మెట్టుగుట్ట‌పై రాక్ క్లైంబింగ్‌, ట్రెక్కింగ్ ఏర్పాటు కుడా ఛైర్మెన్, పోలీస్ కమీషనర్ తో కలిసి ప్రారంభించిన ఆరూరి

Submitted by veerareddy on Wed, 21/09/2022 - 16:55
Arrangement of rock climbing and trekking on Mettugutta Aaruri started with the Chairman and Police Commissioner

కాజీపేట టౌన్, సెప్టెంబర్ 21 (ప్రజాజ్యోతి).../  తెలంగాణ ప్ర‌భుత్వం క్రీడల‌కు పెద్ద పీఠ వేస్తోందని వర్ధన్నపేట శాసనసభ్యులు అరూరి రమేష్ అన్నారు. బుధవారం బల్దియా పరిధి 46 వ డివిజన్ మెట్టుగుట్ట పై నూతనం గా కుడా అద్వర్యం లో ఏర్పాటు చేసిన రాక్ క్లైంబింగ్‌, ట్రెక్కింగ్ ను కుడా ఛైర్మెన్ సుందర్ రాజ్ యాదవ్, పోలీస్ కమీషనర్ డా.తరుణ్ జోషి జిడబ్లుఎంసి కమిషనర్ ప్రావీణ్య లతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ నగరం లో చేపట్టడానికి అవకాశాలు ఉన్న వివిధ అంశాలను, పరిసరాలను సద్వినియోగం చేసుకోవాలనే ఉద్దేశ్యంతో కుడా అద్వర్యం లో చక్కటి కార్యక్రమానికి రూపకల్పన చేయడం అభినందనీయం అని, వరంగల్ ఐ.టి.ఎడ్యుకేషన్ హబ్ గా రూపుదిద్దుకుంటున్న ప్రస్తుత తరుణంలో క్రీడలకు ప్రాధాన్యత ఇవ్వడం చాలా ముఖ్యం అని, ఎన్.సి.సి.కి అధిక ప్రాధాన్యత కల్పిస్తూ మామూనూరు ఎయిర్ పోర్ట్  లో శిక్షణ అందజేస్తున్నామని, అన్ని సౌకర్యాలు ఉన్న మెట్టుగుట్ట, పద్మాక్షి గుట్ట ప్రాంతాల్లో కూడా అవకాశాలు కల్పించినట్లయితే అలాంటి ప్రాంతాల్లో కూడా వినూత్న కార్యక్రమాలు ఏర్పాటు చేసుకోవచ్చునని, విద్యార్ధులకు, ఉద్యోగ అవకాశాలకు కూడా ఇలాంటి క్రీడలు దోహదపడతాయని, ఇలాంటి క్రీడల ప్రోత్సాహనికి తనవంతు సహకారం ఎప్పుడు ఉంటుందని, క్రీడాకారుల‌కు అన్ని విధాలా అండ‌గా ఉంటామ‌ని తెలిపారు. నగర పోలీస్ కమీషనర్ మాట్లాడుతూ  హైదరాబాద్ నగరం లో కొన్ని ప్రాంతాల్లో ఇలాంటి అడ్వెంచర్ స్పోర్ట్స్ నిర్వహిస్తున్నారని, నగరంలో వీటి నిర్వహణకు  అవకాశం ఉందని,  అడ్వెంచర్ స్పోర్ట్స్ లో పాల్గొనడం ద్వారా అందులో ఉన్న ఆనందాన్ని ఆస్వాదించవచ్చునని, మన నగరానికి ఉన్న సంభవ్యతను ను తెలుసుకొని ప్రారంభించడం, ఇక్కడి యువత క్లైంబింగ్, రాప్లింగ్ పట్ల పెద్దఎత్తున ఆసక్తి చూపడం సంతోషమని, అడ్వెంచర్ స్పోర్ట్స్ వల్ల దృఢత్వం తో పాటు విద్యార్థుల్లో ఆత్మ స్టైర్యం పెరుగుతుందని అన్నారు. కుడా ఛైర్మెన్ మాట్లాడుతూ అడ్వెంచ‌ర్ స్పోర్ట్స్‌కు వ‌రంగ‌ల్ అనుకూలం అని భావించి  నగరం లో  వినూత్నం గా తొలిసారిగా మెట్టుగుట్ట పై ప్రారంభించుకోవడం సంతోషం గా ఉందని, దేశం లో ఎక్కడ లేనివిధంగా  ముఖ్య‌మంత్రి కేసీఆర్, పట్టణాభివృద్ధి, ఐటీ శాఖ మంత్రి కే.టి.ఆర్ క్రీడాకారుల‌ను ప్రోత్స‌హిస్తున్నార‌ని అన్నారు.

జీ డబ్ల్యూ ఎం సి కమిషనర్ ప్రావీణ్య మాట్లాడుతూ నగరం లో అడ్వెంచర్ స్పోర్ట్స్ కు అవకాశం ఉన్న గుట్టలు ఎన్నో ఉన్నాయని, ఇందుకోసం తొలిసారిగా రాక్ క్లయింబింగ్, రాప్లింగ్ ను ప్రారంభించడం జరుగిందని, వీటి తో పాటు నీటి వనరుల్లో ప్యాడ్లింగ్, సెయిలింగ్ వంటి స్పోర్ట్స్ కు అవకాశం ఉందని, ఎలాంటి క్రీడల నిర్వహణకైనా వరంగల్ లో పుష్కలంగా అవకాశాలు ఉన్నాయని, ఇందుకోసం నగర పోలీస్ కమీషనర్, జనగామ, హనుమకొండ, వరంగల్ జిల్లాల కలెక్టర్లు జిల్లా స్పోర్ట్స్ అధికారులు జిల్లా విద్య శాఖ అధికారులు సభ్యులుగా అడ్వైజరీ కమిటీ ని ఏర్పాటు చేయడం జరిగిందని, ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు ఉచితంగా, ప్రైవేటు విద్యాసంస్థలు, కంపెనీ వారికి నెలవారీ రుసుము చెల్లించేలా చూడడం ద్వారా కుడా కు ఆదాయ వనరుగా ఉంటుందని, కాకతీయ యూనివర్సిటీ, ఎన్.ఐ.టి,కిట్స్ వంటి కళాశాలలు ఉన్నాయని, విద్యార్థులకు ఇలాంటి అడ్వెంచర్ స్పోర్ట్స్ ఎంతో ఉపయుక్తం అని అన్నారు. అనంతరం ఎమ్మెల్యే,పోలీస్ కమీషనర్, బల్దియా కమీషనర్ లు చేసిన రాక్ క్లయింబింగ్ ఆకట్టుకుంది. ఈ కార్య‌క్ర‌మంలో  కార్పొరేట‌ర్లు మునిగాల సరోజన, ఆవాల రాధికారెడ్డి, కుడా అధికారులు పీఓ అజిత్ రెడ్డి, ఈఈ భీంరావు, డీఎస్ డిఓ అశోక్, సానిటరీ సూపర్ వైజర్ భాస్కర్, స్థానిక నాయ‌కులు తదితరులు పాల్గొన్నారు.