మహబూబ్ నగర్

"ప్రజావాణిలో స్వీకరించిన ఫిర్యాదులన్నీ వచ్చేవారం నాటికి పెండింగ్ లో లేకుండా పరిష్కరించాలి" --- జిల్లా కలెక్టర్ ఎస్. వెంకటరావు

Submitted by Kramakanthreddy on Tue, 20/09/2022 - 14:05

మహబూబ్ నగర్, సెప్టెంబర్ 19 (ప్రజాజ్యోతి ప్రతినిధి) :  ప్రజావాని కార్యక్రమంలో భాగంగా సోమవారం రెవెన్యూ సమావేశం మందిరంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ తేజస్ నందలాల్ పవర్ ,రెవెన్యూ ఆదనపు కలెక్టర్ కె. సీతారామారావులు జిల్లా అధికారులతో పాటు ప్రజల వద్ద నుండి ఫిర్యాదులను స్వీకరించగా, వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రజావాణికి హాజరైన జిల్లా కలెక్టర్ ఎస్. వెంకటరావు మాట్లాడుతూ జిల్లా అధికారులు, మండల స్థాయి ఆధికారులు ప్రజావాణి ఫిర్యాదులు ఎప్పటికప్పుడు పరిష్కరించాలని ఆదేశించారు. వచ్చేవారం నాటికి ఫిర్యాదులేవి పెండింగ్ లో లేకుండా చూసుకోవాలని చెప్పారు.

ఇంజనీరింగ్ కళాశాలలో పెంచిన ఫీజులు తగ్గించాలి"

Submitted by Kramakanthreddy on Mon, 19/09/2022 - 15:02
  • "రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ఇంజనీరింగ్ కళాశాలలో ఒక్కటే ఫీజులు అమలు చేయాలి"
  • "మహబూబ్ నగర్ జిల్లా ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ కి వినతి"
  • "ఇంజనీరింగ్ కళాశాలలో యూనివర్సిటీ నిబంధనల ప్రకారం వసతులు కల్పించాలి"
  • --- ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర సహాయ కార్యదర్శి సి .రాజు

మహబూబ్ నగర్, సెప్టెంబర్ 19 (ప్రజాజ్యోతి ప్రతినిధి) :  రాష్ట్రంలో  పెంచిన ఇంజనీరింగ్ ఫీజులను వెంటనే తగ్గించాలని, రాష్ట్రంలో అన్ని ఇంజనీరింగ్ కళాశాలకు ఒకే రకమైన ఫీజుని ప్రభుత్వం నిర్ణయించాలి ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర సహాయ

అభివృద్ధి చెందుతున్న దేశాలతో పోటీ"

Submitted by Kramakanthreddy on Mon, 19/09/2022 - 14:42
  • "సీఎం కేసీఆర్ ఆధ్వర్యంలో అద్భుతమైన తెలంగాణ"
  • "విద్వేషాలతో ఎక్కువ రోజులు రాజ్యం నడపలేరు"
  • "కుల మతాలను పక్కనపెట్టి అభివృద్ధిపై దృష్టి "
  • --- తెలంగాణ జాతీయ సమైక్యత వజ్రోత్సవాల సందర్భంగా మంత్రి డా వి శ్రీనివాస్ గౌడ్

మహబూబ్ నగర్, సెప్టెంబర్ 18 ( ప్రజాజ్యోతి ప్రతినిధి) .../ మనతోపాటు స్వాతంత్రం సాధించిన దేశాలతో పోలిస్తే మనం అభివృద్ధిలో ఏ స్థానంలో ఉన్నామో ఒకసారి పరిశీలించివేగంగా అభివృద్ధి చెందిన దేశాల మాదిరిగా మన దేశమూ ఓ లక్ష్యంతో ముందుకు సాగి పేదరికాన్ని తరిమేయాల్సిన సమ

"తెలంగాణ జాతీయ సమైక్యత వజ్రోత్సవ ర్యాలీ"

Submitted by Kramakanthreddy on Fri, 16/09/2022 - 16:03

మహబూబ్నగర్, సెప్టెంబర్ 16 (ప్రజాజ్యోతి ప్రతినిధి) : తెలంగాణ జాతీయ సమైక్యత వజ్రోత్సవాల సందర్భంగా మహబూబ్ నగర్ జడ్పీ మైదానం నుంచి ప్రారంభమైన ర్యాలీలో భారీగా హాజరైన జనంతో కలిసి అడుగులు వేస్తూ జాతీయ జెండా చేతబట్టి బోలో భారత్ మాతాజీ జై, జై తెలంగాణ అంటూ నినాదాలు చేస్తూ కదిలిన మంత్రి డాక్టర్ వి శ్రీనివాస్ గౌడ్. బస్టాండ్, అశోక్ టాకీస్ చౌరస్తా, క్లాక్ టవర్, తెలంగాణ చౌరస్తా మీదుగా జూనియర్ కళాశాల గ్రౌండ్స్ వరకు భారీ ర్యాలీ.  దారి పొడవునా ప్రజలకు అభివాదం చేస్తూ కదిలిన మంత్రి.

తెలంగాణ చరిత్రను వక్రీకరిస్తున్న టిఆర్ఎస్, బిజెపిలు - టిపిసిసి ఉపాధ్యక్షులు డాక్టర్ మల్లు రవి

Submitted by Kramakanthreddy on Fri, 16/09/2022 - 14:17

మహబూబ్నగర్, సెప్టెంబర్ 15 (ప్రజాజ్యోతి ప్రతినిధి) : సెప్టెంబర్ 17న నిర్వహించే తెలంగాణ స్వతంత్ర దినోత్సవాన్ని టిఆర్ఎస్, బిజెపి పార్టీలు చరిత్రను వక్రీకరిస్తున్నాయని మాజీ ఎంపీ , టిపిసిసి ఉపాధ్యక్షులు డాక్టర్ మల్లురవి అన్నారు. గురువారం జిల్లా కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ తెలంగాణలో 1942 నుంచి 1948 వరకు జరిగిన పోరాటాల చరిత్రను నేటి తరం వారికి వాస్తవాలు వివరించాల్సిన అవసరం ఉందన్నారు. టిఆర్ఎస్ బిజెపి పార్టీలు వారి స్వార్థ రాజకీయాల కోసం చరిత్రను వక్రీకరించే దిశకు దిగజారి పోయారని ఆరోపించారు.

ఇచ్చిన మాట తప్పినందుకే పాదయాత్ర..

Submitted by Ashok Kumar on Fri, 16/09/2022 - 14:12
  • -- ఈనెల 20 నుండి యాత్ర మొదలు
  • -- ప్రజాస్వామ్య బద్దంగానే నిర్వహిస్తున్నాం.
  • -- వాకిట అశోక్ కుమార్ తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ జిల్లా అధ్యక్షులు.

మహబూబ్ నగర్ ప్రతినిధి ప్రజా జ్యోతి న్యూస్ సెప్టెంబర్ 15: జర్నలిస్టు సమాజానికి మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఇచ్చిన మాట తప్పినందుకే పాలమూరు నుండి ప్రగతి భవన్ వరకు పాదయాత్ర నిర్వహిస్తున్నామని తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ జిల్లా అధ్యక్షులు వాకిట అశోక్ కుమార్ అన్నారు.

రెడ్ క్రాస్ సొసైటీ జిల్లా అధ్యక్షులు లయన్ నటరాజ్ కు లైఫ్ సేవ అవార్డు" - అభినందించిన జిల్లా కలెక్టర్ ఎస్ వెంకటరావు

Submitted by Kramakanthreddy on Fri, 16/09/2022 - 14:06

మహబూబ్నగర్, సెప్టెంబర్ 15 (ప్రజా జ్యోతి ప్రతినిధి) :  గత సంవత్సరం మార్చ్ లో అత్యధిక రక్త యూనిట్లు సేకరించినందుకు గాను ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ జిల్లా అధ్యక్షుడు లయన్ నటరాజ్ కు లైఫ్ సేవా అవార్డ్.అభినందించిన జిల్లా కలెక్టర్ ఎస్.వెంకట రావు.

తెలంగాణ జాతీయ సమైక్యత వజ్రోత్సవ వేడుకల కు త్వరితగతిన ఏర్పాట్లు పూర్తి చేయండి

Submitted by K.KARUNAKAR on Wed, 14/09/2022 - 17:35
  • అధికారులను ఆదేశించిన కలెక్టర్ శశాంక 

మహబూబాబాద్ బ్యూరో   సెప్టెంబర్ 14 (ప్రజా జ్యోతి): ఈ నెల 16, 17, 18 తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన తెలంగాణ జాతీయ సమైక్యత  వజ్రోత్సవ  వేడుకలకు సర్వం సిద్ధం చేయాలని జిల్లా కలెక్టర్ శశాంక అధికారులను ఆదేశించారు. బుధవారం రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్ జిల్లా కలెక్టర్ తో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్లో జిల్లాలో వజ్రోత్సవాల ఏర్పాట్లపై కలెక్టర్ వివరించారు.

" తెలంగాణ జాతీయ సమైక్యత వజ్రోత్సవాలను సెప్టెంబర్ 16 నుండి18 వరకు ఘనంగా నిర్వహించాలి"

Submitted by Kramakanthreddy on Wed, 14/09/2022 - 17:31
  •  రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్

మహబూబ్నగర్, సెప్టెంబర్ 14 (ప్రజా జ్యోతి ప్రతినిధి) : సెప్టెంబర్16 నుండి 18 వరకు నిర్వహించనున్న తెలంగాణ జాతీయ సమైక్యత వజ్రోత్సవాలను జిల్లాలలో ఘనంగా నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ ఆదేశించారు . వజ్రోత్సవాల నిర్వహనపై బుధవారం అయన హైదరాబాద్ నుండి రాష్ట్ర డిజిపి మహేందర్ రెడ్డి తో కలిసి అన్ని జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు ,జిల్లా అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.

ఆదివారం తీన్మార్ మల్లన్న7200 కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీని దూషించిన టిఆర్ఎస్ కార్యకర్తపై ఫిర్యాదు

Submitted by Kramakanthreddy on Wed, 14/09/2022 - 15:08
  • మహబూబ్నగర్ యువజన కాంగ్రెస్ అసెంబ్లీ అధ్యక్షుడు జాజెల చంద్రశేఖర్

మహబూబ్నగర్, సెప్టెంబర్ 14 (ప్రజా జ్యోతి ప్రతినిధి) : 11-09-2022 ఆదివారం పాలమూరు యూనివర్సిటీ దగ్గర గల హైటెక్ ఫంక్షన్ హాల్ మహబూబ్నగర్ నందు తీన్మార్ మల్లన్న నిర్వహించిన 7,200 కార్యక్రమంలో భాగంగా జరిగిన గొడవలో కాంగ్రెస్ పార్టీని ఉద్దేశించి అసభ్య పదజాలంతో దూషించిన వారిపై చర్యలు తీసుకోవాలని మహబూబ్నగర్ యువజన కాంగ్రెస్ అసెంబ్లీ అధ్యక్షులు జాజెల చంద్రశేఖర్, జిల్లా కాంగ్రెస్ కార్యకర్తలు మహబూబ్నగర్ రూరల్ పోలీస్ స్టేషన్ సబ్ ఇన్స్పెక్టర్ వెంకటేశ్వర్లు కి ఫిర్యాదు చేశారు.