ఇంజనీరింగ్ కళాశాలలో పెంచిన ఫీజులు తగ్గించాలి"

Submitted by Kramakanthreddy on Mon, 19/09/2022 - 15:02
Increased fees in engineering colleges should be reduced"
  • "రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ఇంజనీరింగ్ కళాశాలలో ఒక్కటే ఫీజులు అమలు చేయాలి"
  • "మహబూబ్ నగర్ జిల్లా ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ కి వినతి"
  • "ఇంజనీరింగ్ కళాశాలలో యూనివర్సిటీ నిబంధనల ప్రకారం వసతులు కల్పించాలి"
  • --- ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర సహాయ కార్యదర్శి సి .రాజు

మహబూబ్ నగర్, సెప్టెంబర్ 19 (ప్రజాజ్యోతి ప్రతినిధి) :  రాష్ట్రంలో  పెంచిన ఇంజనీరింగ్ ఫీజులను వెంటనే తగ్గించాలని, రాష్ట్రంలో అన్ని ఇంజనీరింగ్ కళాశాలకు ఒకే రకమైన ఫీజుని ప్రభుత్వం నిర్ణయించాలి ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర సహాయ కార్యదర్శి సి రాజు డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ
ప్రైవేట్ ఇంజనీరింగ్ కళాశాలలకు ఫీజులపై ఉన్న శ్రద్ధ మౌలిక వసతులు కల్పించడంలో లేదని తెలంగాణ అడ్మిషన్స్ & ఫీ రెగ్యులేటరీ కమిటీ ఏలాంటి ఫీజులు పెంచలేదని నివేదిక ఇచ్చినప్పటికీ యాజమాన్యాలు కోర్టుకు వెళ్లి మరి ఫీజులు పెంచేలా తీర్పు తెచ్చుకోవడం దురదృష్టకరమని రాష్ట్రంలో ఇంజనీరింగ్ కళాశాలల్లో కొన్ని లక్షకు పైగా ఫీజులు పెంచడం దారుణమైన విషయమని AICTE, JNTU మరియు ఓయూ సైతం ప్రైవేటు ఇంజనీరింగ్ కళాశాలకు వత్తాసు పలికినట్లు ఉంది తప్ప ప్రారంభం ముందే తనిఖీలు నిర్వహించి క్లాస్ రూమ్ ల్యాబ్స్ టీచింగ్ స్టాఫ్ తో పాటు మౌలిక వసతులు ఎలా ఉన్నాయో అనేది పర్యవేక్షించకుండానే లక్షల సీట్లకు అనుమతి ఇవ్వడం సమంజసం కాదని, కొన్ని చోట్ల తనిఖీలు చేసిన అవి నామ మాత్రంగానే ఉన్నాయని రాష్ట్రంలో అన్ని ఇంజనీరింగ్ కళాశాలలో ఒకే రకమైన ఫీజులను నిర్ణయించాలని ప్రైవేట్ ఇంజనీరింగ్ కళాశాలలకు ఫీజులు తప్ప మరో ఆలోచన లేదని పాసైన విద్యార్థులకు ఫీజు రీయింబర్స్మెంట్ వచ్చాక సర్టిఫికెట్లు ఇస్తామంటూ ఇబ్బందులకు గురి చేస్తున్నారని మేనేజ్మెంట్ కోట సీట్లు సైతం యాజమాన్యాలు ఇష్టానుసారంగా లక్షల రూపాయలకు అమ్ముకుంటున్నారు తప్ప మెరిట్ కోటాలో ఇవ్వడం లేదని దీనివల్ల ఉత్తమ విద్యార్థుల జీవితాలు అంధకారం అయ్యే పరిస్థితి ఉందని కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం కఠినమైన కమిటీని వేసి ప్రైవేట్ ఇంజనీరింగ్ కళాశాలల ఆగడాలకు అడ్డుకట్ట వేయాలని రాష్ట్రంలో ఇంజనీరింగ్ కళాశాలల్లో పెంచిన ఫీజులు వెనక్కి తీసుకునే విధంగా చర్యలు తీసుకోవాలన కోరారు.

ప్రధానంగా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ఇంజనీరింగ్ కళాశాలలో ఒకటే ఫీజు ఉండే విధంగా చట్టం రూపొందించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. లేని పక్షంలో  రాష్ట్ర వ్యాప్తంగా అఖిల భారత విద్యార్థి సమాఖ్య ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడతామని ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర సహాయ కార్యదర్శి రాజు హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో ఏఐఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షుడు కే. లక్ష్మణ్, టౌన్ అధ్యక్షుడు కృష్ణ, నాయకులు సురేష్, కృష్ణ, అరుణ్ ,భాను,  మధు, భానుప్రకాష్ తదితరులు పాల్గొన్నారు.