రెడ్ క్రాస్ సొసైటీ జిల్లా అధ్యక్షులు లయన్ నటరాజ్ కు లైఫ్ సేవ అవార్డు" - అభినందించిన జిల్లా కలెక్టర్ ఎస్ వెంకటరావు

Submitted by Kramakanthreddy on Fri, 16/09/2022 - 14:06
Life Service Award to Red Cross Society District President Lion Nataraj" -District Collector S Venkata Rao congratulated

మహబూబ్నగర్, సెప్టెంబర్ 15 (ప్రజా జ్యోతి ప్రతినిధి) :  గత సంవత్సరం మార్చ్ లో అత్యధిక రక్త యూనిట్లు సేకరించినందుకు గాను ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ జిల్లా అధ్యక్షుడు లయన్ నటరాజ్ కు లైఫ్ సేవా అవార్డ్.అభినందించిన జిల్లా కలెక్టర్ ఎస్.వెంకట రావు.  గత సంవత్సరం మార్చి 23న భగత్ సింగ్, రాజ్ గురు, సుక్ దేవ్ ల వంటి అమరవీరుల దినోవత్సవం సందర్భంగా జిల్లా  ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో అధిక మొత్తంలో రక్త యూనిట్లను సేకరించినందుకు గాను వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్  జిల్లాకు పార్టిసిపేషన్ సర్టిఫికెట్ తో పాటు రెడ్ క్రాస్ జిల్లా అధ్యక్ష్యులు లయన్ నటరాజ కు లైఫ్ సేవ అవార్డ్ ఇచ్చినట్లు   జిల్లా కలెక్టర్ ఎస్ .వెంకటరావు  తెలిపారు. ఈ మేరకు కప్ ఆఫ్ వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్  ద్వారా సర్టిఫికెట్ ను జిల్లాకు పంపించినట్లు ఆయన వెల్లడించారు. దీంతో పాటు  తో పాటు అత్యధిక బ్లడ్ డొనేషన్ చేసినందుకుగాను జిల్లా ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ  జిల్లా అధ్యక్షుడు నటరాజ్ కు లైఫ్ సేవ అవార్డు సర్టిఫికెట్ ప్రధానం చేసినట్లు కలెక్టర్ వెల్లడించారు. గురువారం కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో జిల్లా కలెక్టర్ ఈ సర్టిఫికెట్ను ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ జిల్లా అధ్యక్షులు నటరాజ్ ,ఉపాధ్యక్షులు డాక్టర్ శామ్యూల్, ట్రెజరర్ జగపతిరావులకు అందజేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ వారికి అభినందనలు తెలియజేశారు.