అభివృద్ధి చెందుతున్న దేశాలతో పోటీ"

Submitted by Kramakanthreddy on Mon, 19/09/2022 - 14:42
Competing with Developing Countries
  • "సీఎం కేసీఆర్ ఆధ్వర్యంలో అద్భుతమైన తెలంగాణ"
  • "విద్వేషాలతో ఎక్కువ రోజులు రాజ్యం నడపలేరు"
  • "కుల మతాలను పక్కనపెట్టి అభివృద్ధిపై దృష్టి "
  • --- తెలంగాణ జాతీయ సమైక్యత వజ్రోత్సవాల సందర్భంగా మంత్రి డా వి శ్రీనివాస్ గౌడ్

మహబూబ్ నగర్, సెప్టెంబర్ 18 ( ప్రజాజ్యోతి ప్రతినిధి) .../ మనతోపాటు స్వాతంత్రం సాధించిన దేశాలతో పోలిస్తే మనం అభివృద్ధిలో ఏ స్థానంలో ఉన్నామో ఒకసారి పరిశీలించివేగంగా అభివృద్ధి చెందిన దేశాల మాదిరిగా మన దేశమూ ఓ లక్ష్యంతో ముందుకు సాగి పేదరికాన్ని తరిమేయాల్సిన సమయం ఆసన్నమైందని  రాష్ట్ర ఎక్సైజ్, క్రీడలు, సాంస్కృతిక, యువజన సర్వీసులు, పర్యాటక, పురావస్తు శాఖ మంత్రి డా. వి శ్రీనివాస్ గౌడ్ పేర్కొన్నారు. తెలంగాణ జాతీయ సమైక్యత వజ్రోత్సవాల సందర్భంగా మహబూబ్ నగర్ రాయల్ ఫంక్షన్ హాల్ లో ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలను జ్యోతి ప్రజ్వలన చేసి  ప్రారంభించారు. అనంతరం కళాకారుల నృత్య ప్రదర్శనలు తిలకించారు. ప్రముఖ నృత్యకారిణి మంజుల రామస్వామి బృందం ప్రదర్శించిన కోటి రతనాల వీణ నా తెలంగాణ భరతనాట్యం అందరినీకట్టిపడేసింది.సారేజహాసేఅచ్చాగీతాన్ని25మందిసంగీతకళాకారిణులుఒకేసారితమవీణలనుమోగించడంసభికులను మంత్రముగ్ధులను చేసింది.వెంకట్ బృందం ప్రదర్శించిన పేరిణి శివతాండవం అద్భుతంగా సాగింది. తమ అద్భుతమైన ప్రదర్శనలతో ఆకట్టుకున్న కళాకారులను మంత్రి సత్కరించారు. అనంతరం కార్యక్రమానికి హాజరైన వారిని ఉద్దేశించి ప్రసంగించారు స్వాతంత్ర్యం సిద్ధించినప్పుడు మనలాంటి జిడిపి స్థాయి ఉన్న దేశాలు ఎలా ముందుకు వెళుతున్నాయో ఆ స్థాయికి వెళ్ళేందుకు మనం ఏం చేయాలనే అంశాన్ని ప్రజలకు వివరించి చెప్పాల్సిన అవసరం ఉందన్నారు. విద్వేషాలు, కుల మతాల పేరిట చిచ్చుపెట్టి రాజ్యం నడపాలంటే అది ఎన్నో రోజులు సాధ్యం కాదనే విషయాన్ని గమనించాలన్నారు. అభివృద్ధి చెందిన దేశాల  స్థాయికి చేరాలంటే ఏం చేయాలో ఆలోచించాల్సిన అవసరం ఉందన్నారు. దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన 13 నెలల తర్వాత మన ప్రాంతం ప్రజాస్వామ్య వ్యవస్థలోకి వెళ్లిందని పేర్కొన్నారు. అయినా భవిష్యత్తు తెలంగాణ సీఎం కేసీఆర్ ఆధ్వర్యంలో అత్యద్భుతంగా ఉండబోతోందని మంత్రి తెలిపారు. కుల మతాల విద్వేషాలను రూపుమాపి యువతకు గొప్ప భవిష్యత్తును అందించాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు. స్వాతంత్ర్యం సాధించిన మహనీయుల త్యాగఫలం వృధా కారాదని పేర్కొన్నారు.


ఈ కార్యక్రమంలో ఎంపీ మన్నె శ్రీనివాస్ రెడ్డి, జెడ్పీ చైర్ పర్సన్ స్వర్ణ సుధాకర్ రెడ్డి, కలెక్టర్ వెంకట్రావు, అడిషనల్ కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్, జిల్లా గ్రంథాలయాల సంస్థ చైర్మన్ రాజేశ్వర్ గౌడ్, ముడా ఛైర్మన్ గంజి వెంకన్న ముదిరాజ్, మున్సిపల్ చైర్మన్ కేసీ నర్సింహులు, జిల్లా రైతు బంధు సమితి అధ్యక్షుడు గోపాల్, అడిషనల్ ఎస్పీ రాములు, మున్సిపల్ కమిషనర్ ప్రదీప్, జిల్లా పర్యాటక శాఖ అధికారి యు. వెంకటేశ్వర్లు, పలువురు ప్రజా ప్రతినిధులు, అధికారులు, పెద్ద ఎత్తున ప్రజలు హాజరయ్యారు.