"ప్రజావాణిలో స్వీకరించిన ఫిర్యాదులన్నీ వచ్చేవారం నాటికి పెండింగ్ లో లేకుండా పరిష్కరించాలి" --- జిల్లా కలెక్టర్ ఎస్. వెంకటరావు

Submitted by Kramakanthreddy on Tue, 20/09/2022 - 14:05
"All grievances received in public should be resolved by next week without pending" --- District Collector S. Venkatarao

మహబూబ్ నగర్, సెప్టెంబర్ 19 (ప్రజాజ్యోతి ప్రతినిధి) :  ప్రజావాని కార్యక్రమంలో భాగంగా సోమవారం రెవెన్యూ సమావేశం మందిరంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ తేజస్ నందలాల్ పవర్ ,రెవెన్యూ ఆదనపు కలెక్టర్ కె. సీతారామారావులు జిల్లా అధికారులతో పాటు ప్రజల వద్ద నుండి ఫిర్యాదులను స్వీకరించగా, వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రజావాణికి హాజరైన జిల్లా కలెక్టర్ ఎస్. వెంకటరావు మాట్లాడుతూ జిల్లా అధికారులు, మండల స్థాయి ఆధికారులు ప్రజావాణి ఫిర్యాదులు ఎప్పటికప్పుడు పరిష్కరించాలని ఆదేశించారు. వచ్చేవారం నాటికి ఫిర్యాదులేవి పెండింగ్ లో లేకుండా చూసుకోవాలని చెప్పారు. ఇటీవల వివిధ శాఖలకు కేటాయించబడిన  విలేజ్ రెవెన్యూ అధికారులకు సంబంధించిన జీతాలను వెంటనే చెల్లించాలని, ఇందుకుగాను ఆయా తాహసిల్దార్లు తక్షణమే వీఆర్వోల చివరి వేతనం దృవపత్రాన్ని తక్షణంకేటాయించబడినకార్యాలయఅధికారులకుపంపించాలనిఆదేశించారు.సోమవారంసాయంత్రంలోగాఈ ప్రక్రియను పూర్తి చేయాలని ఆయన ఆదేశించారు. తెలంగాణకు హరిత హారం కింద నిర్దేశించించిన లక్ష్యం ప్రకారం మొక్కలు నాటడం పూర్తి చేయాలని ఆదేశించారు.
 అంతకుముందు స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ ,జిల్లా స్థాయి అధికారులు, మండల అధికారులతో మాట్లాడుతూ  సంక్షేమ హాస్టళ్లలో విద్యార్థులకు నాణ్యమైన భోజనాన్ని అందించాలని, భోజనంలో ఎలాంటి ఇబ్బంది లేకుండా చూసుకోవాలని, అంతేకాక పాఠశాలలు, హాస్టళ్ళు పరిశుభ్రంగా ఉండేలా చూడాలని ఆదేశించారు . కాగా సోమవారం 102 మంది ఫిర్యాదుదారులు వారి ఫిర్యాదులను సమర్పించారు.  రెవెన్యూ అదనపు కలెక్టర్ కె. సీతారామారావు ,స్పెషల్ కలెక్టర్ పద్మశ్రీ, ఆర్డీవో అనిల్ కుమార్ ,జడ్పీసీఈవో జ్యోతి, జిల్లా అధికారులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.