ఇచ్చిన మాట తప్పినందుకే పాదయాత్ర..

Submitted by Ashok Kumar on Fri, 16/09/2022 - 14:12
Padayatra because of broken promise
  • -- ఈనెల 20 నుండి యాత్ర మొదలు
  • -- ప్రజాస్వామ్య బద్దంగానే నిర్వహిస్తున్నాం.
  • -- వాకిట అశోక్ కుమార్ తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ జిల్లా అధ్యక్షులు.

మహబూబ్ నగర్ ప్రతినిధి ప్రజా జ్యోతి న్యూస్ సెప్టెంబర్ 15: జర్నలిస్టు సమాజానికి మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఇచ్చిన మాట తప్పినందుకే పాలమూరు నుండి ప్రగతి భవన్ వరకు పాదయాత్ర నిర్వహిస్తున్నామని తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ జిల్లా అధ్యక్షులు వాకిట అశోక్ కుమార్ అన్నారు. గురువారం ఫెడరేషన్ కార్యాలయంలో జిల్లా కమిటీ సమావేశం అశోక్ కుమార్ అధ్యక్షతన జరిగింది.  తెలంగాణ రాష్ట్రం వస్తే జర్నలిస్టులకు సువర్ణ అవకాశం వస్తుందని నమ్ముకున్నామని అయితే జర్నలిస్టులే సమస్యల పరిష్కారం కోసం పాదయాత్ర చేపడుతారని ఏనాడు ఊహించలేదన్నారు. 20 నుండి మొదలయ్యే పాదయాత్ర జడ్చర్ల బాలనగర్ షాద్నగర్ కొత్తూరు శంషాబాద్ మీరగా ప్రగతి భవన్ చేరుకుంటుందని ఆయన తెలిపారు. ముఖ్యంగా జిల్లా అధికారులు పోలీసు యంత్రాంగం యాత్రకు సహకరించాలని అన్నారు. ఈనెల 19 వరకు మంత్రి నుండి జిల్లా అధికారుల నుండి సానుకూల స్పందన రావాలని కోరుకుంటున్నామని ఆయన తెలిపారు. అలా జరగకపోతే ఎట్టి పరిస్థితుల్లోనూ పాదయాత్ర జరిగి తీరుతుందని ఆయన అన్నారు. 523 సర్వే నెంబర్లు వందలాదిమందికి పట్టాలు ఇచ్చి డబల్ బెడ్ రూములు ఇస్తున్నట్లు ప్రకటన చేసి ఆ తరువాత వారికి మొండి చెయ్యి చూపారనీ ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

వీరన్న పేట ఎస్వీఎస్ గుప్తా దివీటి పెళ్లి తదితర ప్రాంతాలలో నిర్మిస్తున్న రెండు పడకల గదుల లో విలేకరులకు ప్రాధాన్యత కల్పిస్తే నష్టమేమి వచ్చిందని ఆయన ప్రశ్నించారు. జర్నలిజం లో ఉండి అనేకమంది విలేకరులు కడు పేదరికంలో జీవనం కొనసాగిస్తున్నారని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. దారిద్రంలో ఉంటూ సంక్షేమ పథకాలు సమగ్ర అభివృద్ధిని ప్రజలకు చేరవేయడంలో వీరు ముఖ్య పత్ర పోషిస్తున్నారని ఆయన అభిప్రాయపడ్డారు. ముఖ్యంగా ప్రజా చైతన్యం కోసం 24 గంటలు శ్రమిస్తూ పత్రికా రంగంలో ఉంటూ కీలక పాత్ర పోషిస్తున్న మీడియాపై ఎందుకు వివక్ష చూపుతున్నారని ఆయన అన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం అలసత్వం వీడి జర్నలిస్టులకు రెండు పడకల గదుల నిర్మాణం ఇచ్చి తీరాలని ఆయన డిమాండ్ చేశారు. సమావేశంలో జాతీయ కౌన్సిల్ సభ్యులు ఉమామహేశ్వరరావు రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు రఫీ వర్కింగ్ ప్రెసిడెంట్ నరసింహ తదితరులు పాల్గొన్నారు