తెలంగాణ చరిత్రను వక్రీకరిస్తున్న టిఆర్ఎస్, బిజెపిలు - టిపిసిసి ఉపాధ్యక్షులు డాక్టర్ మల్లు రవి

Submitted by Kramakanthreddy on Fri, 16/09/2022 - 14:17
TRS and BJP are distorting the history of Telangana - TPCC Vice President Dr. Mallu Ravi

మహబూబ్నగర్, సెప్టెంబర్ 15 (ప్రజాజ్యోతి ప్రతినిధి) : సెప్టెంబర్ 17న నిర్వహించే తెలంగాణ స్వతంత్ర దినోత్సవాన్ని టిఆర్ఎస్, బిజెపి పార్టీలు చరిత్రను వక్రీకరిస్తున్నాయని మాజీ ఎంపీ , టిపిసిసి ఉపాధ్యక్షులు డాక్టర్ మల్లురవి అన్నారు. గురువారం జిల్లా కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ తెలంగాణలో 1942 నుంచి 1948 వరకు జరిగిన పోరాటాల చరిత్రను నేటి తరం వారికి వాస్తవాలు వివరించాల్సిన అవసరం ఉందన్నారు. టిఆర్ఎస్ బిజెపి పార్టీలు వారి స్వార్థ రాజకీయాల కోసం చరిత్రను వక్రీకరించే దిశకు దిగజారి పోయారని ఆరోపించారు. తెలంగాణలో హిందువులు ముస్లింలకు వ్యతిరేకంగా పోరాటం చేయలేదని, నిజాం రాజుకు వ్యతిరేకంగా పోరాటం చేశారని అన్నారు. అందులో తెలంగాణ సాయుధ రహితంగా పోరాటానికి కమ్యూనిస్టులు నాయకత్వం వహించారని గుర్తు చేశారు. చరిత్రను వక్రీకరించి రాజకీయ లబ్ధి పొందాలనుకునే ఈ పార్టీలకు ప్రజలు బుద్ధి చెప్పాలని ఆయన కోరారు. తెలంగాణలో సమైక్యత వజ్రోత్సవాలు, విమోచన వేడుకలు కాదని తెలంగాణ స్వతంత్ర దినోత్సవ వేడుకలు నిర్వహించాలని ఆయన కోరారు. సమావేశంలో డిసిసి అధ్యక్షులు ఉబేదుల్లా కొత్వాల్, జిల్లా మహిళా అధ్యక్షురాలు అనిత, మీడియా సెల్ కన్వీనర్ సీజే బెనహర్, నాయకులు లక్ష్మణ్ యాదవ్, సిరాజ్ ఖాద్రి, మల్లు నరసింహారెడ్డి తదితరులు పాల్గొన్నారు.