ఘన్ పూర్

బిజెపి కా పైసా, టిఆర్ఎస్ కా ధోకా

Submitted by bosusambashivaraju on Sun, 25/09/2022 - 14:07
  • -ప్రధాని మోదీ పథకాలను ప్రజలకు చేరనివ్వని సీఎం కెసిఆర్
  • -రైతులకు మాయమాటలు, కేంద్రం పై బురదజల్లే ప్రయత్నం చేస్తున్న సీఎం
  • - మోదీ హయాంలో కేంద్ర, రాష్ట్రాల్లో డబుల్ ఇంజన్ సర్కార్
  • .కేంద్ర ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధి శాఖ, సహకార శాఖ సహాయ మంత్రి బి ఎల్ వర్మ 

స్టేషన్ ఘనపూర్, సెప్టెంబర్ 24 ( ప్రజాజ్యోతి ) : -  లోక్ సభ ప్రవాస్ యోజన కార్యక్రమంలో భాగంగా శనివారం స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గ పరిధిలో బిజెపి పార్టీ బలోపేతానికి వివిధ, కార్యక్రమాలలో పాల్గొనడానికి విచ్చేసిన కేంద్ర ఈశాన

సీఎం కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం

Submitted by bosusambashivaraju on Sat, 24/09/2022 - 14:42
  • - స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గం ఒక ఎడ్యుకేషన్ హాబ్
  • -విద్య ఒక వజ్రాయుధం,
  • చదువు సకల సమస్యలకు పరిష్కారం-ఎమ్మెల్యే రాజయ్య

స్టేషన్ ఘనపూర్, సెప్టెంబర్ 23 ( ప్రజాజ్యోతి ) :-   స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గ కేంద్రంలోని బస్టాండ్ సెంటర్ వద్ద స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గానికి మహాత్మ జ్యోతిరావు పూలే తెలంగాణ బ్యాక్వర్డ్ క్లాసెస్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ మహిళ డిగ్రీ కళాశాలను మంజూరు చేసినందుకు కృతజ్ఞతగా    ఎమ్మెల్యే డాక్టర్ తాటికొండ రాజయ్య ముఖ్య అతిథిగా పాల్గొని సీఎం కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు.

ఆసరా పెన్షన్ కార్డులు, బతుకమ్మ చీరలు పంపిణీ చేసిన ఎమ్మెల్యే

Submitted by bosusambashivaraju on Fri, 23/09/2022 - 14:10

స్టేషన్ ఘనపూర్, సెప్టెంబర్ 22 ( ప్రజాజ్యోతి ) :-  స్టేషన్ ఘనపూర్  మండలం , శివునిపల్లి  గ్రామంలోని గ్రామా పంచాయతి కార్యాలయం వద్ద గురువారం పాత పెన్షన్లకు చెందిన ఆసరా పెన్షన్ కార్డులు అందించే కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా ఎమ్మెల్యే రాజయ్య విచ్చేశారు. ఈ సమావేశంలో శివునిపల్లి గ్రామానికి సంబంధించిన ఓల్డ్ పింఛన్లకు సంబంధించిన ఆసరా పింఛన్ కార్డులను  తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం  రాష్ట్ర మహిళలందరికీ ఉచితంగా పండుగ కానుకగా అందిస్తున్న బతుకమ్మ చీరలను  ఎమ్మెల్యే డాక్టర్ తాటికొండ  రాజయ్య  లబ్ధిదారులకు పంపిణీ చేశారు.

మృతురాలి కుటుంబ సభ్యులను పరామర్శించిన సర్పంచ్ సారంగపాణి

Submitted by bosusambashivaraju on Wed, 21/09/2022 - 13:28

స్టేషన్ ఘనపూర్, సెప్టెంబర్ 21 ( ప్రజాజ్యోతి ) :-  ఘనపూర్ మండలంలోని చాగల్ గ్రామంలో పింగిలి కిష్టారెడ్డి  భార్య విమల దేవి  బుధవారం ఉదయం మరణించారు. ఈ విషయం తెలుసుకున్న స్థానిక సర్పంచ్, మండల సర్పంచుల ఫోరమ్ అధ్యక్షుడు పోగుల సారంగపాణి వారి పార్థివ దేహాన్ని సందర్శించి,  పూలమాల వేసి నివాళులు అర్పించారు. వారి కుటుంబ సభ్యులను పరామర్శించి తన ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు.

పుట్టల్లమ్మ కుంట చెరువు అన్యాక్రాంతం

Submitted by bosusambashivaraju on Tue, 20/09/2022 - 17:48

-భూకబ్జాకు పాల్పడుతున్న తెరాస నాయకులు 
- మాజీ ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రధాన కార్యదర్శి కొలిపాక సతీష్  

మృతురాలి కుటుంబ సభ్యులను పరామర్శించిన అమృత రావు

Submitted by bosusambashivaraju on Mon, 19/09/2022 - 14:16

స్టేషన్ ఘనపూర్, సెప్టెంబర్ 18 ( ప్రజాజ్యోతి ) :-  కొత్తపల్లి గ్రామ సీనియర్ కాంగ్రేస్ నాయకులు మెరుగు రాజయ్య  అమ్మ  చనిపోయి 10 వ రోజు దశ దిన కర్మ సందర్బంగా  ఆదివారం టిపీసీసీ సభ్యులు గంగారపు అమృతరావు వారికీ నివాళులు అర్పించి వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షుడు జూలుకుంట్ల శిరీష్ రెడ్డి,  జిల్లా కార్యదర్శి చింత ఎల్లయ్య, సింగపురం నాగయ్య, పాపయ్య రాజయ్య గ్రామ అధ్యక్షులు రాజయ్య తదితరులు పాల్గొన్నారు.

ఎమ్మెల్యే రాజయ్యను మర్యాదపూర్వకంగా కలిసిన సీఐ రాఘవేంద్ర

Submitted by bosusambashivaraju on Mon, 19/09/2022 - 13:06

స్టేషన్ ఘనపూర్, సెప్టెంబర్ 18( ప్రజాజ్యోతి ) :-   స్టేషన్ ఘనపూర్ కు నూతన సర్కిల్ ఇన్స్పెక్టర్ గా బదిలీపై విచ్చేసిన అల్లె రాఘవేంద్ర ఆదివారం నియోజకవర్గంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే డాక్టర్ తాటికొండ రాజయ్యని మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చం అందించారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే రాజయ్య స్టేషన్ ఘనపూర్ సీఐ గా భాద్యతలు చేపట్టిన రాఘవేంద్ర కు శుభాకాంక్షలు తెలిపారు.

ఘనంగా త్రివర్ణ జెండా ఆవిష్కరణ .. తాటికొండ సర్పంచ్ చల్ల ఉమ

Submitted by bosusambashivaraju on Mon, 19/09/2022 - 12:55

స్టేషన్ ఘనపూర్, సెప్టెంబర్ 17 (ప్రజాజ్యోతి ):-   తాటికొండ గ్రామ పంచాయతీ పరిధిలోని గ్రామ పంచాయతీ కార్యాలయం ముందు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహించిన 75వ తెలంగాణ జాతీయ సమైక్యత వజ్రోత్సవాలలో భాగంగా శనివారం గ్రామ సర్పంచ్ చల్లా ఉమసుధీర్ రెడ్డిలు డాక్టర్ భీమ్ రావ్ రాంజీ అంబేద్కర్ కి  సర్దార్ సర్వాయి పాపన్న కి పూల మాల వేసి, జాతీయ జెండాను ఎగరవేశారు . అనంతరం గ్రామ ప్రజలకు 75వ తెలంగాణా జాతీయ సమైక్యత శుభాకాంక్షలు తెలిపారు. ముఖ్య అతిథిగా ఘనపూర్ స్టేషన్ వైస్ ఎంపీపీ చల్లా సుధీర్ రెడ్డి పాల్గొన్నారు .