ఘన్ పూర్

ఆర్థిక సహాయం అందజేసిన వైస్ ఎంపీపీ చల్ల సుధీర్ రెడ్డి

Submitted by bosusambashivaraju on Thu, 29/09/2022 - 11:36

స్టేషన్ ఘనపూర్, సెప్టెంబర్ 29 ( ప్రజాజ్యోతి ) : -  మండలంలోని తాటికొండ గ్రామంలో జీబీ తండా 5వ వార్డులోని  గుగులోతు తేజ ఇటీవల మరణించినందున గురువారం  స్టేషన్ ఘనపూర్  వైస్ ఎంపీపీ చల్ల సుధీర్ రెడ్డి వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు. అనంతరం తన ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ వారికి  5000 రూపాయలు  ఆర్థిక సహాయం అందజేశారు.

మృతుని కుటుంబ సభ్యులను పరామర్శించిన సర్పంచ్ సారంగపాణి.

Submitted by bosusambashivaraju on Thu, 29/09/2022 - 11:33

స్టేషన్ ఘనపూర్, సెప్టెంబర్ 29 ( ప్రజాజ్యోతి ) :-  ఘనపూర్ మండలంలోని చాగల్లు గ్రామంలో  ఎస్సి సెల్ అధ్యక్షుడు చేపూరి కుమార స్వామి తండ్రి చేపూరి  కొమురయ్య బుధవారం సాయంత్రం మరణించారు.

కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మను దహనం -బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ తెలంగాణ హక్కు...ఎమ్మెల్యే డా.రాజయ్య

Submitted by bosusambashivaraju on Thu, 29/09/2022 - 10:42

స్టేషన్ ఘనపూర్, సెప్టెంబర్ 28 ( ప్రజాజ్యోతి ) : -  కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి  చేసిన వ్యాఖ్యలలో భాగంగా తెలంగాణకు బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ మంజూరు సాధ్యం కాదు అని కేంద్ర ప్రభుత్వం ప్రకటించినందుకు నిరసనగా స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గ కేంద్రంలో కేంద్ర ప్రభుత్వ దిష్టి బొమ్మను దహనం చేశారు. బుధవారం గాంధీ సెంటర్ వద్ద టిఆర్ఎస్ మండల అధ్యక్షులు  ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మ  దహనం చేసిన కార్యక్రమంలో   ఎమ్మెల్యే డాక్టర్ తాటికొండ రాజయ్య  ముఖ్య అతిథిగా విచ్చేసి కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మను దహనం చేశారు.

బతుకమ్మ చీరలు, ఆసరా పింఛన్ కార్డులను పంపిణీ చేసిన-ఎమ్మెల్యే రాజయ్య

Submitted by bosusambashivaraju on Wed, 28/09/2022 - 13:18

స్టేషన్ ఘనపూర్, సెప్టెంబర్ 27 ( ప్రజాజ్యోతి ) : - స్టేషన్ ఘనపూర్  మండలం , చాగల్ గ్రామంలోని రైతు వేదిక వద్ద  సర్పంచ్ పోగుల సారంగ పాణి  అధ్యక్షతన ఏర్పాటు చేసిన సమావేశంలో చాగల్ గ్రామానికి సంబంధించిన ఓల్డ్ పింఛన్లకు సంబంధించిన ఆసరా పింఛన్ కార్డులను  తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం  రాష్ట్ర మహిళలందరికీ ఉచితంగా , పండుగ కానుకగా అందిస్తున్న బతుకమ్మ చీరలను  ఎమ్మెల్యే డాక్టర్ తాటికొండ  రాజయ్య లబ్ధిదారులకు పంపిణీ చేశారు.తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు  ప్రతి ఏడాది బతుకమ్మ పండుగ సందర్భంగా తెలంగాణ ఆడపడుచులు అందరికీ బతుకమ్మ చీరలు పంపించడం జరుగుతోందని తెలిపారు.

దొంగతనానికి పాల్పడిన వ్యక్తి అరెస్టు రెండు లక్షల విలువగల బైకులు, బ్యాటరీలు స్వాధీనం .ఏసీపీ రఘు చందర్

Submitted by bosusambashivaraju on Wed, 28/09/2022 - 12:45

స్టేషన్ ఘనపూర్, సెప్టెంబర్ 27 ( ప్రజాజ్యోతి ) : -  వివరాల్లోకి వెళితే తేదీ 03-09-2022 రోజు శివునిపల్లి గ్రామంలోని లారీ అసోసియేషన్ వద్ద నిలిపి ఉన్న నాలుగు లారీల యొక్క ఎనిమిది బ్యాటరీలు దొంగిలించినారని పోలీసులకు భాధితులు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు ఫిర్యాదు తీసుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు. దర్యాప్తులో భాగంగా మంగళవారం వాహన తనిఖీలు చేపడుతుండగా మడికొండ గ్రామం ఎం ఎన్ నగర్ కాలనీకి చెందిన నిందితుడైన మానుపాటి అంజి    అరెస్టు చేసారు.

ఆపదలో ఉన్న మిత్రునికి సహ విద్యార్థుల అండ మేమున్నామంటూ భరోసా

Submitted by bosusambashivaraju on Tue, 27/09/2022 - 12:27

కొడకండ్ల (ప్రజా జ్యోతి)  సెప్టెంబర్ 25 :  మండలంలోని నరసింగాపురం గ్రామానికి చెందిన గోపాల్ దాస్ ప్రసాద్, గురుకుల పాఠశాలలో పనిచేస్తూ జీవనం సాగిస్తున్న వ్యక్తి ఇటీవల రోడ్డు ప్రమాదానికి గురై తీవ్ర గాయాలతో చికిత్స పొందుతుండగా, విషయం తెలుసుకున్న 1990-91 వ సంవత్సరం 10వ తరగతి చదువుకున్న ప్రసాద్ సహ విద్యార్థులు ఆదివారం నరసింగాపురంలోని ప్రసాద్ ఇంటికి వెళ్లి పరామర్శించి, సహాయంగా 21 వేల రూపాయలను అందించారు. తోడుగా మేమున్నామంటూ భరోసా కల్పించారు.

బతుకమ్మ.. బతుకమ్మ ఉయ్యాలో... బంగారు గౌరమ్మ ఉయ్యాలో

Submitted by bosusambashivaraju on Tue, 27/09/2022 - 11:56

శోభాయమానం బతుకమ్మ సంబురం

రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా ప్రారంభమైన బతుకమ్మ సంబరాలు

కేంద్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేఖ విధానాల పై పోరాటం చేయాలి -సిపిఎం మండల కార్యదర్శి మునిగెల రమేష్

Submitted by bosusambashivaraju on Sun, 25/09/2022 - 14:33

స్టేషన్ ఘనపూర్, సెప్టెంబర్ 24 ( ప్రజాజ్యోతి ) : -  స్టేషన్ ఘనపూర్ మండల కేంద్రంలో  శనివారం సిపిఎం కేంద్ర కమిటీ పిలుపులో భాగంగా బిజెపి కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేఖ విధానాల పై స్టేషన్ ఘనపూర్ తహసిల్దార్ కార్యాలయం ముందు సిపిఎం మండల కార్యదర్శి మునిగెల రమేష్ ఆధ్వర్యంలో ధర్నా చేసి తహసీల్దార్ పూల్ సింగ్ చౌహన్ కు వినపత్రం అందజేశారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశిస్తూ మునిగెల రమేష్ మాట్లాడుతూ బిజెపి కేంద్రంలో అధికారంలోకి వచ్చిన దగ్గర నుండి ప్రజలను అనేక రకాలుగా ఇబ్బందులు గురి చేస్తోందని అన్నారు.

బతుకమ్మ చీరలు, ఆసరా పెన్షన్ కార్డులను పంపిణీ చేసిన ఎమ్మెల్యే ,జడ్పీ చైర్మన్

Submitted by bosusambashivaraju on Sun, 25/09/2022 - 14:18

స్టేషన్ ఘనపూర్ (చిల్పూర్)  సెప్టెంబర్ 24, ప్రజాజ్యోతి : -   తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ బడుగు బలహీన వర్గాల ప్రజలకు  అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి అన్ని విధాలుగా ఆదుకుంటున్నారని తెలంగాణ తొలి ఉప ముఖ్యమంత్రి ఎమ్మెల్యే డాక్టర్ తాటికొండ రాజయ్య, జనగాం జిల్లా టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు, జెడ్పి చైర్మన్ పాగాల సంపత్ రెడ్డి అన్నారు.

ఇసుక ట్రాక్టర్లు పట్టివేత, ఇద్దరి పై కేసు నమోదు ...సిఐ అల్లె రాఘవేంద్ర

Submitted by bosusambashivaraju on Sun, 25/09/2022 - 14:13

స్టేషన్ ఘనపూర్, సెప్టెంబర్ 24 ( ప్రజాజ్యోతి ) : -  స్టేషన్ ఘనపూర్ మండలము తాటికొండ వాగులో నుండి స్టేషన్ ఘనపూర్ కి  అక్రమంగా ఇసుక తరలిస్తున్నారని నమ్మదగిన సమాచారం మేరకు జాతీయ రహదారి ప్రక్కన శ్రీవాణి స్కూల్ నందు రెండు ఇసుక ట్రాక్టర్ లను పట్టుకోవడం జరిగిందని అన్నారు. ఈ సందర్బంగా వారిని విచారించగా ఎటువంటి అనుమతి పత్రాలు లేనందున  జిట్టేగుడెం గ్రామానికీ చెందిన ఇసుక ట్రాక్టర్ల ఓనర్ అయినటువంటి లకావత్ లక్ష్మణ్,  ట్రాక్టర్ డ్రైవరులు అయనటువంటి  భూక్య సంతోష్, భానోత్ కుమార్ లపై కేసు నమోదు చేయడం జరిగిందని తెలిపారు.