సీఎం కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం

Submitted by bosusambashivaraju on Sat, 24/09/2022 - 14:42
 Palabhishekam for CM KCR's film
  • - స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గం ఒక ఎడ్యుకేషన్ హాబ్
  • -విద్య ఒక వజ్రాయుధం,
  • చదువు సకల సమస్యలకు పరిష్కారం-ఎమ్మెల్యే రాజయ్య

స్టేషన్ ఘనపూర్, సెప్టెంబర్ 23 ( ప్రజాజ్యోతి ) :-   స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గ కేంద్రంలోని బస్టాండ్ సెంటర్ వద్ద స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గానికి మహాత్మ జ్యోతిరావు పూలే తెలంగాణ బ్యాక్వర్డ్ క్లాసెస్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ మహిళ డిగ్రీ కళాశాలను మంజూరు చేసినందుకు కృతజ్ఞతగా    ఎమ్మెల్యే డాక్టర్ తాటికొండ రాజయ్య ముఖ్య అతిథిగా పాల్గొని సీఎం కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే  మాట్లాడుతూ ఆనాడు తెలంగాణ ఉద్యమ కాలంలో  ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసిపడుతున్న రోజుల్లో అధికార పార్టీ ఎమ్మెల్యేలను తెలంగాణ వాదులు , తెలంగాణ ఉద్యమకారులు తిరగనీయలేనటువంటి పరిస్థితుల్లో 7 మంది సీఐ లను, 12 మంది ఎస్ఐ లను ఎంటేసుకొని నియోజకవర్గంలో మోడల్ పాఠశాలలకు, కస్తూర్బా పాఠశాలలకు నిర్మాణాలకి భూమిపూజ కార్యక్రమాలు చేయడం వల్ల నేడు నియోజకవర్గంలోని ఏడు మండలాల్లో సోషల్ వెల్ఫేర్ , బీసీ వెల్ఫేర్ , మోడల్ స్కూల్స్ అదేవిధంగా కస్తూర్బా గురుకుల పాఠశాలలతో నేడు నియోజకవర్గం ఒక ఎడ్యుకేషన్ హబ్ గా తయారైందని తెలిపారు. రాష్ట్రంలో మంజూరైన 15 మహాత్మ జ్యోతిరావు పూలే బీసీ వెల్ఫేర్ రెసిడెన్షియల్ మహిళ డిగ్రీ కళాశాలలో అందులో ఒకటి మన స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గానికి రావడం, నేను పలుమార్లు అసెంబ్లీలో మాట్లాడడం  ముఖ్యమంత్రి కేసీఆర్ ని కోరడంతో నేడు మహిళా డిగ్రీ కళాశాల మంజూరు కావడం జరిగిందని తెలిపారు.  ముఖ్యమంత్రి కేసీఆర్  మీ నియోజకవర్గానికి ఏ డిగ్రీ కళాశాల కావాలని కోరినప్పుడు వెనుకబడిన తరగతి కులాలకు చెందిన మహిళలను ప్రోత్సహించడానికి ఒక మహిళా పక్షపాతిగా మహిళా డిగ్రీ కళాశాల కావాలని కోరడం జరిగిందని తెలిపారు. అందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ నియోజకవర్గానికి రెసిడెన్షియల్ మహిళా డిగ్రీ కళాశాల మంజూరు చేసినందుకు కృతజ్ఞతగా కేసీఆర్  చిత్రపటానికి పాలాభిషేకం చేయడం జరిగిందని తెలిపారు.

నేడు కేసీఆర్  ముఖ్య మంత్రిగా  ఈ నియోజకవర్గానికి రెసిడెన్షియల్ మహిళా డిగ్రీ కళాశాల మంజూరు అయితే ఆనాడు వైఎస్ రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రి ఉన్న కాలంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లోనే ఆరు పాలిటెక్నిక్ కళాశాలలు మంజూరు అయితే అందులో ఒకటి మన నియోజకవర్గానికి పాలిటెక్నిక్ కళాశాల మంజూరు చేయడం జరిగిందని తెలిపారు. నియోజకవర్గానికి మహాత్మ జ్యోతిరావు పూలే రెసిడెన్షియల్ బీసీ వెల్ఫేర్ మహిళా డిగ్రీ కళాశాల మంజూరు చేసినందుకు సీఎం కేసీఆర్ కి జిల్లా మంత్రిఎర్రబెల్లి దయాకర్ రావుకి,  పెద్దలు ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డికి వ్యక్తిగతంగా నా పక్షాన నియోజకవర్గ విద్యార్థుల పక్షాన కృతజ్ఞతలు తెలియజేస్తున్నానని తెలిపారు. తెలంగాణ రాష్ట్రం సిద్ధించాక ముఖ్యమంత్రి కేసీఆర్  నాయకత్వంలో అంబేద్కర్  ఆలోచన విధానానికి అనుగుణంగా జనాభా నిష్పత్తి ఆధారంగా రెసిడెన్షియల్ పాఠశాలను ఏర్పాటు చేయడంలో భాగంగా బీసీల కోసం రాష్ట్ర వ్యాప్తంగా  119 రెసిడెన్షియల్ పాఠశాలలను మంజూరు చేసి ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 960 గురుకుల పాఠశాలలు నిర్వహించడమే కాకుండా గురుకుల పాఠశాలలో చదువుతున్న విద్యార్థుల మీద ఒక్కొక్కరి మీద రూ. 1.20 లక్షలు(ఒక లక్ష ఇరవై వేలు)  ఖర్చు చేయడం జరుగుతుందని తెలిపారు. విద్యార్థిని విద్యార్థులకు సన్నబియ్యంతో నాణ్యమైన భోజనం మెనూ ప్రకారం ఇస్తూనే మంచి పౌష్టికాహారంతో కూడిన ఆహార అందించడం జరుగుతుందని తెలిపారు.

నాణ్యమైన భోజనం అందించడమే కాకుండా,  అత్యున్నత ప్రమాణాలతో కూడిన నాణ్యమైన విద్యను అందించిన అందిస్తున్న ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్ కి దక్కుతుందని తెలిపారు.ప్రభుత్వ పాఠశాలను  రెసిడెన్షియల్ పాఠశాలలను కూడా కార్పొరేట్ పాఠశాలలకు దీటుగా తయారు చేయడం కోసం ప్రభుత్వ పాఠశాలల్లో మరియు ప్రభుత్వ రెసిడెన్షియల్ పాఠశాలలో విద్యా ప్రమాణాలు పెంచాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మన ఊరు-మన బడి కార్యక్రమాన్ని తీసుకురావడం జరిగిందని తెలిపారు.కావున తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పేద విద్యార్థుల కోసం అందిస్తున్న ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని విద్యార్థులకు సూచించారు. ఈ కార్యక్రమంలో అందుబాటులో ఉన్న ప్రజాప్రతినిధులు , ముఖ్య నాయకులు  , విద్యార్థులు పార్టీ శ్రేణులు తదితరులు పాల్గొన్నారు.