బిజెపి కా పైసా, టిఆర్ఎస్ కా ధోకా

Submitted by bosusambashivaraju on Sun, 25/09/2022 - 14:07
 BJP ka Paisa, TRS ka Dhoka
  • -ప్రధాని మోదీ పథకాలను ప్రజలకు చేరనివ్వని సీఎం కెసిఆర్
  • -రైతులకు మాయమాటలు, కేంద్రం పై బురదజల్లే ప్రయత్నం చేస్తున్న సీఎం
  • - మోదీ హయాంలో కేంద్ర, రాష్ట్రాల్లో డబుల్ ఇంజన్ సర్కార్
  • .కేంద్ర ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధి శాఖ, సహకార శాఖ సహాయ మంత్రి బి ఎల్ వర్మ 

స్టేషన్ ఘనపూర్, సెప్టెంబర్ 24 ( ప్రజాజ్యోతి ) : -  లోక్ సభ ప్రవాస్ యోజన కార్యక్రమంలో భాగంగా శనివారం స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గ పరిధిలో బిజెపి పార్టీ బలోపేతానికి వివిధ, కార్యక్రమాలలో పాల్గొనడానికి విచ్చేసిన కేంద్ర ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధి శాఖ, సహకార శాఖ సహాయ మంత్రి బి ఎల్ వర్మ ను బిజెపి రాష్ట్ర నాయకులు, జిల్లా నాయకులు ఘనంగా ఆహ్వానించి పుష్ప గుచ్చం అందించి, శాలువాతో సన్మానించారు. ఈ సందర్బంగా బిజెపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గుజ్జుల ప్రేమెందర్ రెడ్డి, రాష్ట్ర ఉపాధ్యక్షులు ధర్మ రావు, విజయరామ రావు , హనుమకొండ జిల్లా అధ్యక్షురాలు రావు పద్మ, రాష్ట్ర నాయకులు చిలుక విజయ రావుని బిజెపి జనగామ జిల్లా అధ్యక్షులు ఆరుట్ల ధశమంత రెడ్డి, వరంగల్ పార్లమెంటరి కో కన్వీనర్ ఇనుగాల యుగంధర్ రెడ్డి, నియోజకవర్గ కన్వీనర్ అయిలోనీ అంజిరెడ్డి, జిల్లా ప్రధనకార్యదర్శి శివరాజ్ యాదవ్, జిల్లా అధికార ప్రతినిధులు మంద వెంకటేష్ - తోకల సంపత్ రెడ్డి, మండల అధ్యక్షులు పెండ్యాల దిలీప్, కిసాన్ మోర్చ జిల్లా అధ్యక్షులు సోమిడి వెంకట్ రెడ్డి, బి జే వై ఎం జిల్లా ఉపాధ్యక్షులు పన్నిరు అశోక్, దళిత మోర్చ జిల్లా అధ్యక్షులు ముక్క స్వామి తో కలిసి మండలానికి ఘన స్వాగతం పలికారు. బిజెపి రాష్ట్ర నాయకులు పెరుమాండ్ల వెంకటేశ్వర్లు, బొజ్జపల్లి సుభాష్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన లోక్ సభ ప్రవాస్ యోజన కార్యక్రమంలో భాగంగా స్టేషన్ ఘనపూర్ మండల కేంద్రంలోని కే ఆర్ గార్డెన్స్ నందు , చిల్పూర్ మండలం నష్కల్ గ్రామములో, సీతారామ కళ్యాణ మండపం వద్ద ఏర్పాటు చేసిన రైతు సదస్సు కార్యక్రమంలో ముఖ్య అతిథిగా కేంద్ర ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధి శాఖ, సహకార శాఖ సహాయ మంత్రి బి ఎల్ వర్మ  రైతులతో సమావేశమై వారితో మాట్లాడి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కేంద్ర సహాయ మంత్రి   బి ఎల్ వర్మ  మాట్లాడుతూ రైతులు ఎండనక వాననక కష్టపడి కాయకష్టం చేస్తే వారికి రాష్ట్ర ప్రభుత్వం నుండి తగిన సహకారం అందడం లేదు అనేది పచ్చి నిజమని అన్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలు రాష్ట్రంలోని రైతులకు అందనీయడం లేదు అని, కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలు ప్రతీ రైతుకు చేరాలని అన్నారు. యూరియా ధర పెరిగినా, రైతుల పై ఆ భారం మోపకుండా విదేశాల నుండి 2450 రూపాయలకు దిగుమతి చేసుకొని 270 రూపాయలకు రైతులకు అందిస్తున్నది మోదీ ప్రభుత్వం అని తెలిపారు

. తెలంగాణ ప్రభుత్వం మొక్కజొన్న పంటను పండించకూడదని, వరి వేస్తే ఉరి అని అనడం ద్వారా కేసీఆర్ కు రైతుల మీద ఉన్న ప్రేమ అర్థం అవుతోందని, రుణమాఫీ చేస్తామని చెప్పి ఎంత మందికి రుణమాఫీ చేసారో చెప్పాలని అన్నారు . 3406 రైతు కొనుగోలు కేంద్రాలు కేంద్రాలు ఏర్పాటు చేస్తామని చెప్పి 1400 కేంద్రాలు మాత్రమే పెట్టారు. సాయిల్ హెల్త్ కార్డు ఇవ్వడం లేదని విమర్శించారు. సీఎం కెసిఆర్ రైతులకు మాయమాటలు చెప్పి కేంద్రం పై బురదజల్లే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. నిధులు కేంద్ర ప్రభుత్వం ఇస్తుంటే తెరాస ప్రభుత్వం వారి పేరు తో పబ్బం గడుపుకుంటోందని ధ్వజమెత్తారు. త్వరలో తెలంగాణలోనూ బిజెపి ప్రభుత్వం అధికారంలోకి వస్తుందని, కేంద్ర, రాష్ట్రాల్లో బిజెపి డబల్ ఇంజన్ సర్కార్ పాలన ద్వారా అభివృద్ధిలో దూసుకుపోతుందని తెలిపారు. అనంతరం కేంద్ర సహాయ మంత్రి బి ఎల్ వర్మ రైతులను సన్మానించారు.
ఈ కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు,  జిల్లా నాయకులు,  సీనియర్ నాయకులు మండల మోర్చ నాయకులు , గ్రామ ప్రజలు పాల్గొన్నరు.