పుట్టల్లమ్మ కుంట చెరువు అన్యాక్రాంతం

Submitted by bosusambashivaraju on Tue, 20/09/2022 - 17:48
Puttallamma Kunta pond is exotic

-భూకబ్జాకు పాల్పడుతున్న తెరాస నాయకులు 
- మాజీ ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రధాన కార్యదర్శి కొలిపాక సతీష్  

స్టేషన్ ఘనపూర్, సెప్టెంబర్ 20 ( ప్రజాజ్యోతి ) :- మండల కేంద్రంలోని  మినీ ట్యాంక్ బండ్ గా మార్చిన పుట్టలమ్మ కుంట చెరువు అన్యాక్రాంతం అవుతోందని, కొందరు అధికార పార్టీ తెరాస కు సంబంధించిన నాయకులు భూ కబ్జాకు పాల్పడుతున్నారని కాంగ్రెస్ పార్టీ మాజీ ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రధాన కార్యదర్శి కొలిపాక సతీష్ అన్నారు . మంగళవారం  స్టేషన్ ఘనపూర్ డివిజన్ కేంద్రంలోని ఆర్డివో కార్యాలయంలో ఆర్డివో కు కొలిపాక సతీష్ వినతి పత్రం అందజేశారు. స్థానిక ఎమ్మెల్యే రాజయ్యకు గాని , ఎమ్మెల్సీ కడియం శ్రీహరికి గాని చిత్త శుద్ధి ఉంటే పుట్టలమ్మ కుంట చెరువును సర్వే చేయించి, హద్దులు నిర్ణయించి, ఫెన్సింగ్ చేయించాలని, అలాగే కబ్జాకు పాల్పడ్డ వారిపైన కేసులు పెట్టి అరెస్టు చేయాలని కాంగ్రెస్ పార్టీ తరపున డిమాండ్ చేశారు. బహిరంగ మార్కెట్ లో ఒక గజం సుమారు 20,000/- రూపాయలు చొప్పున రేటు పలుకుతోందని, రేపు జరిగే జనరల్ ఎలక్షన్లకు పుట్టల్లమ్మ కుంటకు సంబందించిన భూమిని అమ్మగా వచ్చిన డబ్బులతో తెరాస నాయకులు పోటీ చేయాలని చూస్తున్నారని అన్నారు. తెరాస పార్టీకి చెందిన నాయకులు ఎమ్మెల్యే రాజయ్యకు, ఎమ్మెల్సీ కడియం శ్రీహరికి, వారి అనుచరులకు గాని ఈ భూ కబ్జాతో సంబంధం లేకపోతే ఇంటెలిజెన్స్ బ్యూరో, రెవెన్యూ శాఖ అధికారులు వెంటనే దర్యాప్తు చేపట్టి, భూకబ్జాకు పాల్పడిన వారిపై క్రిమినల్ కేసులు పెట్టి, అరెస్టు చేయాలని కాంగ్రెస్ పార్టీ తరపున డిమాండ్ చేస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో బీసీ సెల్ మండల అధ్యక్షులు కోల శ్రీనివాస్, చల్లా తిరుపతి, యువజన కాంగ్రెస్ జిల్లా ప్రధాన కార్యదర్శి కోరుకొప్పుల మధు, మండల కాంగ్రెస్ నాయకులు మామిండ్ల శ్రీనివాస్, జంపాల శ్రీనివాస్, భూక్య అరుణ్, రాజేష్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.