తుంగతుర్తి

మృతుల కుటుంబాలను పరామర్శించిన టిఆర్ఎస్ నాయకులు

Submitted by Yellaia kondag… on Mon, 19/09/2022 - 11:38

తుంగతుర్తి సెప్టెంబర్ 18 (ప్రజాజ్యోతి)//. తుంగతుర్తి మండల పరిధిలోని కొత్తగూడెం గ్రామానికి చెందిన  సాక్షి దినపత్రిక సీనియర్ పాత్రికేయులు వర్దేల్లి వీరమల్లు తల్లి మల్లమ్మ, తుంగతుర్తి మండల కేంద్రానికి చెందిన హోంగార్డు కటకం రవి తండ్రి పోతులూరయ్య గార్లు ఆదివారం ఉదయం తమ స్వగ్రామాలలో  అనారోగ్యంతో మృతిచెందారు. కాగా టిఆర్ఎస్ మండల నాయకులు మృతుల కుటుంబ సభ్యులను  పరామర్శించి తమ సంతాపం వ్యక్తం చేశారు.

గిరిజన రిజర్వేషన్ల పెంపు నిర్ణయం ఓ..చారిత్రాత్మక నిర్ణయం

Submitted by Yellaia kondag… on Mon, 19/09/2022 - 11:35

ప్రతి ఒక్క గిరిజనుడు ముఖ్యమంత్రి కేసీఆర్ కి రుణపడి  ఉంటారు 
 
తుంగతుర్తి మండల గిరిజన సర్పంచులు

ఆర్థిక సహాయం అందజేసిన సర్పంచ్

Submitted by Yellaia kondag… on Mon, 19/09/2022 - 11:21

తుంగతుర్తి సెప్టెంబర్ 18 (ప్రజా జ్యోతి)//. మండల పరిధిలోని సంగెం గ్రామపంచాయతీలో  విద్యుత్ లైన్ మెన్ కి ప్రైవేట్ హెల్పర్ గా పనిచేస్తున్న అన్నారం గ్రామానికి చెందిన వీరబోయిన శ్రవణ్ కొద్దిరోజుల క్రితం ప్రమాదవశాత్తు విద్యుతఘాదానికి గురై  కరెంట్ స్తంభం నుండి క్రింద పడి ప్రైవేటు హాస్పిటల్లో చికిత్స పొందుతున్న శ్రవణ్ కుటుంబ సభ్యులను శనివారం తన స్వగ్రామానికి వెళ్లి యోగక్షేమాలు తెలుసుకొన్న సంగెం గ్రామ సర్పంచ్ ఏశమల్ల సుశీలసామెల్  పదివేల రూపాయల ఆర్థిక సహాయాన్ని అందించారు, వారి వెంట అన్నారం సర్పంచ్ మిట్టగడుపుల అనూక్ , మండల కాంగ్రెస్ అధ్యక్షులు దొంగరి గోవర్ధన్  , మండల కాంగ్రెస్  ఉపాధ్యక్ష

ఘనంగా విరాట్ విశ్వకర్మ జయంతి వేడుకలు

Submitted by Yellaia kondag… on Sat, 17/09/2022 - 16:37

తుంగతుర్తి సెప్టెంబర్ 17 (ప్రజా జ్యోతి)//. విరాట్ విశ్వకర్మ జయంతిని పురస్కరించుకొని శనివారం తుంగతుర్తి మండల కేంద్రంలో విశ్వబ్రాహ్మణ ,విశ్వకర్మల సంఘం మండల అధ్యక్షులు కటకం వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో నిర్వహించిన జయంతి వేడుకలలో భాగంగా విరాట్ విశ్వకర్మ భగవాన్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా మండల విశ్వబ్రాహ్మణ విశ్వకర్మ సంఘం గౌరవ అధ్యక్షులు డాక్టర్ చారి  మాట్లాడుతూసకల దేవతల గురువు అయినా భగవాన్ విరాట్ విశ్వకర్మ సైన్స్ కూడా కనిపెట్టలేని ఎన్నో గొప్ప గొప్ప నిర్మాణాలు చేశారని అన్నారు.

ఆదివాసి గిరిజనుల ఆత్మగౌరవానికి ప్రతీక

Submitted by Yellaia kondag… on Sat, 17/09/2022 - 16:02
  • ఆదివాసి బంజారా భవనాల ప్రారంభోత్సవానికి  బయలుదేరిన తుంగతుర్తి గిరిజనలు
  • జెండా ఊపి ప్రారంభించిన ఎంపీపీ గుండగాని కవితా రాములు గౌడ్

తుంగతుర్తి సెప్టెంబర్ 17 (ప్రజా జ్యోతి) //.   జాతీయ సమైక్యతా వజ్రాత్సవాలలో భాగంగా శనివారం ముఖ్యమంత్రి కేసీఆర్ హైదరాబాద్ లో ఆదివాసి,బంజారా భవన్  ప్రారంభోత్సవ వేడుకలకు తుంగతుర్తి మండలం నుండి బయలుదేరిన బస్సులను తుంగతుర్తి ఎంపీపీ గుండగాని కవిత రాములు గౌడ్ జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.ఆదివాసి గిరిజనుల అభ్యున్నతికి రాష్ట్ర ప్రభుత్వం అధిక ప్రాధాన్యమిస్తుందని అన్నారు.

ఘనంగా జాతీయ సమైక్యత వజ్రోత్సవ ర్యాలీ

Submitted by Yellaia kondag… on Fri, 16/09/2022 - 16:11

తుంగతుర్తి సెప్టెంబర్ 16 (ప్రజా జ్యోతి)  , జాతీయ వజ్రోత్సవ ఉత్సవాల్లో భాగంగా తుంగతుర్తి నియోజకవర్గ  కేంద్రంలో  పిడి కిరణ్ కుమార్ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ ఈ యొక్క ర్యాలీ కార్యక్రమానికి స్థానిక శాసనసభ్యులు డాక్టర్ గాదరి కిషోర్ కుమార్ ముఖ్యఅతిథిగా ఈ యొక్క ర్యాలీలో విద్యార్థులు, యువతీ వివిధ పార్టీల నాయకులు, కార్యకర్తలు,యువకులు, మహిళలలు జాతీయజెండాల్ని చేతబూని నియోజకవర్గ కేంద్రంలోని మైనార్టీ గురుకుల పాఠశాల నుండి రామాలయం వరకు   చేపట్టిన ర్యాలీని శాసనసభ్యులు డాక్టర్ గాదరి కిషోర్ కుమార్  ప్రారంభించారు. జాతీయజెండా పట్టుకుని ర్యాలీలో విద్యార్థులు పాల్గొన్నారు.

జాతీయ సమైక్యత వజ్రోత్సవాలను ఘనంగా నిర్వహించాలి

Submitted by mahesh yadhav on Thu, 15/09/2022 - 10:38

ప్రజా జ్యోతి నాగారం 14 సెప్టెంబర్. తుంగతుర్తి నియోజకవర్గ కేంద్రంలో ఈనెల 16న జాతీయ సమైక్యత వజ్రోత్సవాల   సందర్భంగా నిర్వహించే ర్యాలీలో ప్రతి ఒక్కరు పాల్గొనాలని ఎంపీడీవో జి. శోభారాణి అన్నారు. బుధవారం నాగారం మండల పరిషత్ కార్యాలయంలో వివిధ శాఖల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూతుంగతుర్తి గురుకుల  పాఠశాల  నుంచి రామాలయం  వరకు  తెలంగాణ జాతీయ సమైక్యత ర్యాలీ నిర్వహించనునట్లు తెలిపారు.

ఘనంగా ఎమ్మెల్యే సతీమణి జన్మదిన వేడుకలు

Submitted by Yellaia kondag… on Wed, 14/09/2022 - 17:04

తుంగతుర్తి సెప్టెంబర్ 14 (ప్రజా జ్యోతి) తుంగతుర్తి శాసనసభ్యులు డాక్టర్ గాదరి కిషోర్ కుమార్ సతీమణి గాదరి కమల  జన్మదిన వేడుకలు బుధవారం తుంగతుర్తి నియోజకవర్గ కేంద్రంలో జాంబవత యూత్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. స్థానిక ఎంపిటిసి చెరుకు సృజన పరమేష్ కేక్ కట్ చేసి నాయకులు, కార్యకర్తలకు పంచి పెట్టి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్ వై ఉపాధ్యక్షులు బొంకూరి మధు  జాంబవత యూత్ సభ్యులు పాల్గొన్నారు.