తుంగతుర్తి

బతుకమ్మ చీరల పంపిణీ చేసిన సర్పంచ్

Submitted by Yellaia kondag… on Tue, 27/09/2022 - 14:49

తుంగతుర్తి, సెప్టెంబర్ 27 (ప్రజా జ్యోతి); తుంగతుర్తి మండల పరిధిలోని వెంపటి గ్రామంలో మంగళవారం గ్రామ సర్పంచ్ అబ్బగాని పద్మ సత్యనారాయణ గౌడ్ చేతుల మీదుగా స్థానిక గ్రామపంచాయతీ కార్యాలయం వద్ద  తెలంగాణ ప్రభుత్వం అందించే బతుకమ్మ చీరలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ... తెలంగాణ రాష్ట్రంలో ఆడపడుచులు ఎంతో ఘనంగా జరుపుకునే పండుగ బతుకమ్మ అని అన్నారు. తెలంగాణ ప్రభుత్వం మహిళలకు ఇచ్చే ప్రత్యేక గౌరవమే బతుకమ్మ చీర అన్నారు. బతుకమ్మ చీరల పంపిణీలో మహిళలకు ఇబ్బందులు కలుగకుండా పంపిణీ చేయాలని కార్యదర్శికి, గ్రామపంచాయతీ సిబ్బందికి సూచించారు.

నివాళులు అర్పించిన టిఆర్ఎస్ నాయకులు

Submitted by Yellaia kondag… on Tue, 27/09/2022 - 14:47

తుంగతుర్తి, సెప్టెంబర్ 27 (ప్రజా జ్యోతి): తుంగతుర్తి నియోజకవర్గ కేంద్రంలోని టిఆర్ఎస్ పార్టీ కార్యకర్త వీరబోయిన రాములు తండ్రి పోలరాజు  అనారోగ్యంతో మంగళవారం మరణించారు. అతని పార్థివ దేహానికి మండల టిఆర్ఎస్ మండల అధ్యక్షులు తాటికొండ సీతయ్య పూలమాల వేసి నివాళులు అర్పించారు. అనంతరం కుటుంబ సభ్యులను పరామర్శించి తమ ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.

ఘనంగా ఎంగిలిపూల బతుకమ్మ సంబరాలు

Submitted by Yellaia kondag… on Mon, 26/09/2022 - 13:25

తుంగతుర్తి, సెప్టెంబర్ 25 (ప్రజా జ్యోతి): రాష్ట్ర పండుగ బతుకమ్మ సంబరాలు మండల వ్యాప్తంగా ఘనంగా మొదలయ్యాయి. ఎంగిలిపూల తో ఆదివారం నుండి బతుకమ్మ ఆటపాటలు మొదలయ్యాయి. తుంగతుర్తి మండల కేంద్రంలో పాటు మండల పరిధిలోని వివిధ గ్రామాలలోని ఇంటింటా మహిళలు రంగురంగు పూలతో బతుకమ్మలు పేర్చుకోని ప్రత్యేక పూజలు చేసి ప్రధాన కూడళ్లలో ఆటపాటలా డారు. ఒక్కేసి పువ్వేసి చందమామ రెండు జాములాయే చందమామ అని బతుకమ్మ విశిష్టతను తెలుపుతూ ఆడపడుచులు పాటలు పాడారు. ఎంగిలిపూల బతుకమ్మను పేర్చి మహిళలు గుంపుగా చేరి ఆటలు ఆడిన అనంతరం సమీపంలోని చెరువులు, కుంటలలో బతుకమ్మను నిమజ్జనం చేశారు.

జాతీయ ఉత్తమ పంచాయతీ అవార్డులు పొందేందుకు సమిష్టిగ కృషి చేయాలి

Submitted by Yellaia kondag… on Sat, 24/09/2022 - 11:32

తుంగతుర్తి, సెప్టెంబర్ 23 ( ప్రజా జ్యోతి):  జాతీయ ఉత్తమ పంచాయతీ అవార్డులు పొందేందుకు  ఇచ్చిన ఆన్లైన్ ప్రశ్నావళికి సరైన జవాబులు నింపేందుకు పూర్తి అవగాహన  కలిగి ఉండాలని వివిధ శాఖల అధికారులను ఎంపీడీవో భీమ్ సింగ్ నాయక్ ఆదేశించారు. శుక్రవారం మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయంలో జాతీయ  పంచాయతి రాజ్ అవార్డులకు కేంద్ర ప్రభుత్వం మార్గదర్శకాలను విడుదల చేస్తూ జారీ చేసిన ఆన్లైన్ ప్రశ్నావళి పై మండల అధికారులకు, కార్యదర్శులకు  అవగాహన కల్పించారు.

పెద్దన్నగా సీఎం కేసీఆర్ బతుకమ్మ చీరలు పంపిణీ చేసిన జడ్పీ చైర్మన్

Submitted by Yellaia kondag… on Sat, 24/09/2022 - 11:25

తుంగతుర్తి, సెప్టెంబర్ 23 (ప్రజా జ్యోతి): తెలంగాణ మహిళలందరికీ సీఎం కేసీఆర్ పెద్దన్న గా వ్యవహరిస్తూ మహిళల సాధికారత కోసం అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నారని జడ్పీ చైర్మన్ గుజ్జ దీపిక యుగంధర్ రావు అన్నారు. శుక్రవారం మండల పరిధిలోని దేవుని గుట్ట తండా గ్రామంలో గ్రామ సర్పంచ్ గుగులోతు ఈరోజి అధ్యక్షతన ఏర్పాటు చేసిన గ్రామ పంచాయతీ ఆవరణలో బతుకమ్మ చీరలను జడ్పీ చైర్మన్ గుజ్జ దీపిక యుగంధర్ రావు  పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూటీఆర్ఎస్ ప్రభుత్వం ప్రతి సంవత్సరం బతుకమ్మ చీరలను, తెలుగింటి ఆడపడుచులకు పంపిణీ చేస్తుందని, ఈ అవకాశాన్ని మహిళలందరూ ఉపయోగించుకోవాలని కోరారు.

తీన్మార్ స్టెప్పులతో అదరగొట్టి,

Submitted by Yellaia kondag… on Thu, 22/09/2022 - 16:46

కర్ర సాము చేసి గులాబీ కార్యకర్తల్లో ఫుల్ జోష్ నింపిన ఎమ్మెల్యే

తుంగతుర్తి, సెప్టెంబర్ 22 (ప్రజా జ్యోతి)../..//  మునుగోడు నియోజకవర్గ పరిధిలోని సంస్థాన్ నారాయణపురం మండల కేంద్రంలో తెరాస పార్టీ కుటుంబ సభ్యుల ఆత్మీయ సమ్మేళనం కార్యక్రమంలో భాగంగా గురువారం నిర్వహించిన భారీ బతుకమ్మల ర్యాలీ లో తుంగతుర్తి ఎమ్మెల్యే డా.గాదరి కిశోర్ కుమార్ డీజే పాటలకు అనుగుణంగా తీన్మార్ స్టెప్పులతో అదరగొట్టి, కర్ర సామచేసి స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచారు. కార్యకర్తలతో కలిసి అదిరేటి స్టెప్పులు వేస్తూ.. అందర్నీ అలరించి గులాబి శ్రేణులలో  ఫుల్ జోష్ నింపారు.

 

బిజెపి వల్లనే దళిత.. గిరిజన బందు మల్లెపాక సాయిబాబా

Submitted by Yellaia kondag… on Tue, 20/09/2022 - 17:06

తుంగతుర్తి, సెప్టెంబర్ 20 (ప్రజా జ్యోతి):బిజెపి పార్టీకి ప్రజల్లో పెరుగుతున్న ఆదరణ చూసి  తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి  భయపడి దళిత, గిరిజన బందును ప్రవేశపెట్టారని బిజెపి పార్టీ సూర్యపేట జిల్లా ప్రధాన కార్యదర్శి మల్లెపాక సాయిబాబా అన్నారు. మంగళవారం నియోజకవర్గ కేంద్రంలోని తెలంగాణ తల్లి చౌరస్తా వద్ద తెలంగాణ రాష్ట్రంలో దళిత, గిరిజన బంద్ కు కారకులైన హుజురాబాద్ ఎమ్మెల్యే ఈటెల రాజేందర్, మునుగోడు మాజీ ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి  చిత్రపటాలకు తుంగతుర్తి మండల బిజెపి పార్టీ ఆధ్వర్యంలో పాలాభిషేకం నిర్వహించారు.

సీఎం కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం

Submitted by Yellaia kondag… on Tue, 20/09/2022 - 10:13

తుంగతుర్తి సెప్టెంబర్ 19 ప్రజా జ్యోతి.. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ గిరిజనులకు 10% రిజర్వేషన్ జీవో ప్రకటిచడంతో తుంగతుర్తి మండల పరిధిలోని దేవుని గుట్ట తండా, రావులపల్లి ఎక్స్ రోడ్డు తండా, రామన్నగూడెం తండా, గుడి తండా, సూర్య తండ పరిధిలోని గుట్ట కింది తండా గ్రామాలలో గ్రామ సర్పంచ్ ల ఆధ్వర్యంలో  సీఎం కేసీఆర్, శాసనసభ్యులు డాక్టర్ గాదరి కిషోర్ కుమార్  చిత్రపటాలకు గిరిజన మహిళలు యువకులు, నాయకులు,కార్యకర్తలు,  పాలాభిషేకం చేసి కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయా గ్రామాల సర్పంచులు మాట్లాడుతూ..