ఆదివాసి గిరిజనుల ఆత్మగౌరవానికి ప్రతీక

Submitted by Yellaia kondag… on Sat, 17/09/2022 - 16:02
A symbol of the self-respect of the adivasi tribes
  • ఆదివాసి బంజారా భవనాల ప్రారంభోత్సవానికి  బయలుదేరిన తుంగతుర్తి గిరిజనలు
  • జెండా ఊపి ప్రారంభించిన ఎంపీపీ గుండగాని కవితా రాములు గౌడ్

తుంగతుర్తి సెప్టెంబర్ 17 (ప్రజా జ్యోతి) //.   జాతీయ సమైక్యతా వజ్రాత్సవాలలో భాగంగా శనివారం ముఖ్యమంత్రి కేసీఆర్ హైదరాబాద్ లో ఆదివాసి,బంజారా భవన్  ప్రారంభోత్సవ వేడుకలకు తుంగతుర్తి మండలం నుండి బయలుదేరిన బస్సులను తుంగతుర్తి ఎంపీపీ గుండగాని కవిత రాములు గౌడ్ జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.ఆదివాసి గిరిజనుల అభ్యున్నతికి రాష్ట్ర ప్రభుత్వం అధిక ప్రాధాన్యమిస్తుందని అన్నారు. రాష్ట్రంలో ఆదివాసి గిరిజన జీవితాలను బాగు చేయాలనే లక్ష్యంతో సీఎం కేసీఆర్ ముందుకు సాగుతున్నారని పేర్కొన్నారు. దేశంలో ఎక్కడా లేనివిధంగా గిరిజన గురుకులాలను తీర్చిదిద్ది గిరిజన బిడ్డలు ప్రపంచంతో పోటీపడేలా చేశారని ఆమె అన్నారు. గతంలో తుంగతుర్తి మండలం లో అభివృద్ధికి నోచుకొని గిరిజన తండాలు నేడు నియోజకవర్గ అభివృద్ధి ప్రదాత డాక్టర్ గాదరి కిషోర్ కుమార్ సారధ్యంలో ప్రతి గిరిజన తండా అభివృద్ధి చెందుతుందన్నారు. ఈ కార్యక్రమంలో డిసిసిబి డైరెక్టర్ గుడిపాటి సైదులు, వైస్ ఎంపీపీ మట్టపల్లి శ్రీశైలం యాదవ్, ఎంపీడీవో భీమ్ సింగ్ నాయక్, టిఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షులు తాటికొండ సీతయ్య, ప్రధాన కార్యదర్శి కటకం వెంకటేశ్వర్లు, జిల్లా నాయకులు గుండ గాని రాములు గౌడ్, గిరిజన తండా గ్రామ సర్పంచులు యాకూ నాయక్, వెంకన్న నాయక్, శారదా కాంతమ్మ, వీరోజి, పద్మనాయక్ ఎంపీటీసీ ఆంబోతు నరేష్, టిఆర్ఎస్ నాయకులు గుండె గాని దుర్గయ్య, పులుసు వెంకటనారాయణ గౌడ్,గోపగాని శ్రీను, బొంకూరు జలంధర్, తడకమల్ల రవికుమార్, గిరిజన నాయకులు, మహిళలు తదితరులు పాల్గొన్నారు.