గిరిజన రిజర్వేషన్ల పెంపు నిర్ణయం ఓ..చారిత్రాత్మక నిర్ణయం

Submitted by Yellaia kondag… on Mon, 19/09/2022 - 11:35
The decision to increase tribal reservation is a historic decision

ప్రతి ఒక్క గిరిజనుడు ముఖ్యమంత్రి కేసీఆర్ కి రుణపడి  ఉంటారు 
 
తుంగతుర్తి మండల గిరిజన సర్పంచులు

తుంగతుర్తి  సెప్టెంబర్ 18 (ప్రజా జ్యోతి)..గిరిజన రిజర్వేషన్ల పెంపు  ఓ..చారిత్రాత్మక నిర్ణయం అని తుంగతుర్తి మండల గిరిజన సర్పంచులు అన్నారు.ఆదివారం తుంగతుర్తి నియోజకవర్గ కేంద్రంలోని తెలంగాణ తల్లి విగ్రహం ఎదుట గిరిజన రిజర్వేషన్ పెంపు ప్రకటనపై హర్షం గిరిజనుల చిరకాల కోరికైన 10శాతం  రిజర్వేషన్ పెంచుతూ 10 రోజుల్లో జీఓ జారీ చేస్తానని సీఎం కేసీఆర్ ప్రకటించడం పట్ల ముఖ్యమంత్రి కేసీఆర్ , శాసనసభ్యులు డాక్టర్ గాదరి కిషోర్ కుమార్ చిత్ర పటానికి సర్పంచులు పాలభిషేకం చేశారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ2017 సంవత్సరంలో తెలంగాణ ప్రభుత్వం గిరిజనులకు 10 శాతం రిజర్వేషన్ పెంచాలని అసంబ్లీలో తీర్మానం చేసి పంపించిన కేంద్ర ప్రభుత్వం ఆమోదించలేదన్నారు..ఇప్పటినా మా గిరిజనుల 10 శాతం రిజర్వేషన్ బిల్లును కేంద్రం ఆమోదించాలని వారు డిమాండ్ చేశారు. హైదరాబాద్ నడి బొడ్డులో ఆదివాసి గిరిజనుల ఆత్మ ప్రతీక అయిన సేవాలాల్ బంజారా భవన్ నిర్మాణం చేసి ప్రాంభించుకోవడం శుభ పరిణామామన్నారు.దళితబందు తరహాలో గిరిజన బంధు అమలు చేస్తానని ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించడంతో గిరిజనుల జీవితాల్లో సరికొత్త అభివృద్ధి వెలుగులు నింపడం జరుగుతుందని వారు తెలిపారు.వచ్చే ఎన్నికల్లో మా గిరిజనులు శాసనసభ్యులు డాక్టర్ గాదర్ కిషోర్ కుమార్ తో పాటు సీఎం కేసీఆర్ కు పట్టం కట్టడం ఖాయం అని వారు తెలిపారు.ప్రతి ఒక్క గిరిజనుడు ముఖ్యమంత్రి కేసీఆర్ కి రుణపడి  ఉంటారని అన్నారు.గిరిజనుల ఆకాంక్షలను నెరవేర్చిన కేసీఆర్ మరో సేవాలాల్ మహరాజ్  అని ఆయన కొనియాడారు.గిరిజన తండాలను గ్రామ పంచాయతీలను చేసిన ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్ ది అని వారు గుర్తు చేశారు.

గిరిజనులు సాగు చేసుకుంటున్న పోడు భూములకు పట్టాలిచ్చి వాటికి రైతు బంధు వర్తించేలా చేస్తానని ప్రకటించడం గొప్ప విషయమన్నారు. ఉక్కు కర్మాగారం, ట్రైబల్ యూనివర్సిటీ ఏర్పాటు పై కేంద్రంపై ఒత్తిడి తెస్తామనడం గిరిజనులపై సీఎం కేసీఆర్ కు ఉన్న దార్శనికతకు నిదర్శనమన్నారు.సద్గురు శ్రీ సంత్ సేవాలాల్ మహరాజ్ జయంతిని ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తుందన్నారు.ఈ కార్యక్రమంలో తుంగతుర్తి మండల గిరిజన తండాల సర్పంచులు , ఎంపీటీసీలు అయినా యాకు నాయక్,శారద మాన్షింగ్ నాయక్, వీరోజి నాయక్,వెంకన్న నాయక్,భారతి పుణ్య నాయక్,కాంతమ్మ రాములు నాయక్,భద్రి వెంకన్న,విజ్జి బాలు నాయక్,నీలమ్మ సోమేశ్వర్,పద్మశంకర్,యం.పి.టి.లు దశరథ, ఏ.నరేష్ నాయక్,అన్ని తండాల ఉప సర్పంచ్ లు, టి.ఆర్.యస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షులు,వార్డ్ మెంబర్లు,గిరిజన నాయకులు భబ్బిసింఘ్,మోహన్ లాల్,బిక్షం నాయక్,ఆంగోత్ రవి. ఈరోజి,రమేష్,ధర్మ ,మోహన్ లాల్ నాయక్,కలునాయక్,భద్రు నాయక్,రవి నాయక్ తదితరులు పాల్గొన్నారు.