తుంగతుర్తి

జాతీయ సమైక్యత వజ్రోత్సవాలను విజయవంతం చేయాలి డిసిసిబి డైరెక్టర్ గుడిపాటి సైదులు

Submitted by Yellaia kondag… on Wed, 14/09/2022 - 12:41

తుంగతుర్తి సెప్టెంబర్ 13 (ప్రజా జ్యోతి)  ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఈనెల 16 నుంచి 18వరకు చేపట్టనున్న జాతీయ సమైక్యత వజ్రోత్సవ ర్యాలీ  విజయవంతం చేయాలని ఉమ్మడి నల్లగొండ జిల్లా డిసిసిబి డిసిఎంఎస్ డైరెక్టర్ గుడిపాటి సైదులు కోరారు. తుంగతుర్తి మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో మంగళవారం వైస్ ఎంపీపీ మట్టపల్లి శ్రీశైలం యాదవ్ అధ్యక్షతన జరిగిన సన్నాహక సమావేశంలో అధికారులు, ప్రజాప్రతినిధుల సమావేశంలో మాట్లాడారు. ఈ నెల 16 నుంచి 18వరకు మూడు రోజులపాటు జాతీయ సమైఖ్యత వజ్రో త్సవాలు నిర్వహించేందుకు ప్రభుత్వం నిర్ణయించిందన్నారు.

టిఆర్ఎస్ పార్టీ బలోపేతానికి ప్రతి కార్యకర్త కృషి చేయాలి తాటికొండ సీతయ్య

Submitted by Yellaia kondag… on Wed, 14/09/2022 - 12:22

తుంగతుర్తి సెప్టెంబర్ 13 (ప్రజా జ్యోతి) టిఆర్ఎస్ పార్టీ బలోపేతానికి ప్రతీ కార్యకర్త కృషి చేయాలని మండల పార్టీ అధ్యక్షులు మాజీ ఎంపీపీ తాటికొండ సీతయ్య తుంగతుర్తి నియోజకవర్గ శాసనసభ్యులు డాక్టర్ గాదర్ కిషోర్ కుమార్ ఆదేశానుసారం మంగళవారం మండల పరిధిలోని రావులపల్లి ఎక్స్ రోడ్ తండ, కర్విరాల, సంగెం గ్రామాలలో ఆయా  గ్రామ శాఖ అధ్యక్షుల  అధ్యక్షతన జరిగిన టిఆర్ఎస్ పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశానికి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా సీతయ్య మాట్లాడుతూ..

ఉత్తమ ఉపాధ్యాయునికి ఘన సన్మానం

Submitted by Yellaia kondag… on Wed, 14/09/2022 - 11:50

తుంగతుర్తి సెప్టెంబర్ 13 (ప్రజా జ్యోతి) ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం ఉత్తమ ఉపాధ్యాయునిగా ప్రకటించిన  మండల పరిధిలోని గానుగుబండ గ్రామానికి చెందిన  ఎనగందుల ఉపేందర్ ను  మంగళవారం తుంగతుర్తి ప్రభుత్వ జూనియర్ కళాశాల సిబ్బంది శాలువాతో సత్కరించి ఘనంగా సన్మానించారు.అనంతరం వారు మాట్లాడుతూ... గతంలో తుంగతుర్తి ప్రభుత్వ జూనియర్ కళాశాల లో ఇన్చార్జి ప్రిన్సిపాల్ గా విధులు నిర్వహించి ఎంతోమంది విద్యార్థులకు మార్గదర్శిగా నిలిచారన్నారు. భవిష్యత్తులోనూ మరిన్ని సేవలు అందించి జాతీయ స్థాయిలోనూ మంచి గుర్తింపు తెచ్చుకోవాలన్నారు.

ఉపాధ్యాయుల ముందస్తు అరెస్టు సరైంది కాదు

Submitted by Yellaia kondag… on Wed, 14/09/2022 - 11:39

తుంగతుర్త సెప్టెంబరు 13 (ప్రజా జ్యోతి)   ఉపాధ్యాయ బదిలీలు, పదోన్నతులు చేపట్టాలని చలో అసెంబ్లీ పిలుపునివ్వడంతో ఉపాధ్యాయ సంఘం నాయకులను ముందస్తుగా అరెస్టు చేయడం సరైంది కాదని యు.ఎస్.పి.సి  నాయకులు పేర్కొన్నారు. విద్యారంగ సమస్యలపై  ఉపాధ్యాయ సంఘాల పోరాట కమిటీ తలపెట్టిన చలో అసెంబ్లీ ముట్టడి కార్యక్రమంలో భాగంగా మంగళవారం పలువురు ఉపాధ్యాయులను అరెస్ట్ చేసి తుంగతుర్తి పోలీస్ స్టేషన్ కు తరలించారు.

సర్దార్ వల్లభాయ్ పటేల్ కు ఘన నివాళులర్పించిన బిజెపి నాయకులు

Submitted by Ramesh Peddarapu on Tue, 13/09/2022 - 20:40

తుంగతుర్తి సెప్టెంబర్ 13 (ప్రజా జ్యోతి) నిజాం పాలన నుండి తెలంగాణ ప్రాంతానికి విముక్తికై సర్దార్ వల్లభాయ్ పటేల్ నేతృత్వంలో నిర్వహించిన ఆపరేషన్ పోలో ( పోలీస్ చర్య ) ప్రారంభించిన రోజు సందర్భంగా మంగళవారం తుంగతుర్తి నియోజకవర్గం కేంద్రంలో భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో  సర్దార్ వల్లభాయ్ పటేల్  చిత్రపటానికి పూలమాలవేసి ఘనంగా నివాళులర్పించారు.

కొత్త పార్లమెంట్ భవనానికి అంబేద్కర్ పేరు పెట్టాలని అసెంబ్లీ తీర్మానం చేయడం హర్షనీయం

Submitted by Yellaia kondag… on Tue, 13/09/2022 - 20:36

తుంగతుర్తి సెప్టెంబర్ 13 (ప్రజా జ్యోతి) కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న కొత్త పార్లమెంట్ భవనానికి  భారత రాజ్యాంగ నిర్మాత, సంఘసంస్కర్త, ప్రపంచ మేధావి భారతరత్న డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ పేరు పెట్టాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో ఏకగ్రీవ తీర్మానం చేయడం  హర్షనీయమని టిఆర్ఎస్ పార్టీ నాయకులు తడకమళ్ళ రవికుమార్ అన్నారు. మంగళవారం  తుంగతుర్తి మండల కేంద్రంలో ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ కొత్త పార్లమెంట్ భవనానికి అంబేద్కర్  పేరు పెట్టాలని తెలంగాణ ప్రభుత్వం ఏకగ్రీవ తీర్మానం చేయడం చారిత్రాత్మక నిర్ణయం అని అన్నారు.

వెళ్లి రా గణపయ్య

Submitted by Yellaia kondag… on Sat, 10/09/2022 - 16:15

తుంగతుర్తి సెస్టెంబరు 10 (ప్రజా జ్యోతి) తుంగతుర్తి మండల కేంద్రంతో పాటు మండల పరిధిలోని పలు గ్రామాలలో  శనివారం  వినాయక నిమజ్జనోత్సవం అంగరంగ వైభవంగ జరిగింది. వినాయక మండపాల వద్ద భక్తులు   ప్రత్యేకపూజలు నిర్వహించారు. మేళతాళాలు, బాజా భజంత్రీలతో గణనాదులను ప్రత్యేకంగా అలంకరించిన శకటాలపై శోభాయాత్రకు శ్రీకారం చుట్టారు. గణేష్‌ మహారాజ్‌కి జై అంటూ భక్తులు చేసిన నినాదాలు మిన్నంటాయి. మహిళలు మంగళహార తులు ఇచ్చి గణనాథుల నిమజ్జన శోభాయాత్ర ప్రారంభించారు.

గురుకుల విద్యాలయాల్లోనే మెరుగైన విద్య డిసిసిబి డైరెక్టర్ గుడిపాటి సైదులు

Submitted by Yellaia kondag… on Sat, 10/09/2022 - 15:55

తుంగతుర్తి సెప్టెంబర్ 10 (ప్రజా జ్యోతి) గురుకుల విద్యాలయాలోనే మెరుగైన విద్యతోపాటు, ఆహ్లాదకరమైన వాతావరణ ఉంటుందని ఉమ్మడి నల్లగొండ జిల్లా డిసిసిబి డైరెక్టర్ గుడిపాటి సైదులు అన్నారు. ఆరోగ్యకరమైన పరిశుభ్రమైన గురుకుల విద్యాలయంగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా తెలంగాణ ప్రభుత్వ సూచనలతో గురుకులాల సెక్రటరీ రోనాల్డ్ రోస్ ప్రవేశపెట్టిన స్వచ్ఛ గురుకుల కార్యక్రమాన్ని  మొదలుపెట్టారని అన్నారు.తుంగతుర్తి మండల కేంద్రంలోని సాంఘిక సంక్షేమ గురుకుల బాలికల పాఠశాల మరియు కళాశాలలో శనివారం ఏర్పాటు చేసిన స్వచ్ఛ గురుకులం 6వ రోజు పాఠశాల విద్యార్థులతో కలిసి మొక్కలు నాటి కార్యక్రమాన్ని ప్రారంభించారు.

చాకలి ఐలమ్మకు ఘన నివాళి

Submitted by Yellaia kondag… on Sat, 10/09/2022 - 15:52

తుంగతుర్తి సెప్టెంబర్ 10 (ప్రజా జ్యోతి)  వీరనారి ఐలమ్మ..రజాకార్లకు, భూస్మాములకు వ్యతిరేకంగా పోరాడిన వీరనారిగా చాకలి ఐలమ్మ చరిత్ర నిలిచిపోయారని గ్రామ సర్పంచ్ అబ్బగాని సత్యనారయణ గౌడ్ అన్నారు. తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు చాకలి ఐలమ్మ 37 వ వర్ధంతిని శనివారం తుంగతుర్తి మండల పరిధిలోని వెంపటి గ్రామంలో  రజక సంఘం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ అబ్బ గాని పద్మ సత్యనారాయణ గౌడ్  చాకలి ఐలమ్మ విగ్రహానికి  పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఆనంతరం ఆమె  మాట్లాడుతూ...