పెన్పహాడ్

మాలమహానాడు మండల కమిటీ ఎన్నిక ఏకగ్రీవం

Submitted by veerareddy on Wed, 21/09/2022 - 12:52

పెన్పహాడ్ మండలం సెప్టెంబర్ 20 (ప్రజా జ్యోతి):  మండల మాల మహానాడు మండల నూతన కమిటీని మండల కేంద్రంలో మంగళవారం మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షులు తల్ల మల్ల హసేన్  సూచనల మేరకు సూర్యాపేట జిల్లా మాల మహానాడు అధ్యక్షులు బొల్లిఎద్దు వినయ్  అధ్యక్షతన.పెన్ పహాడ్ మండల మాల మహానాడు మండల నూతన కమిటీ ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది నూతనమండల అధ్యక్షులుగా మద్దెల సతీష్ . ఉపాధ్యక్షులుగా రాయిళ్ళ శ్రీనివాస్. బోలేదు మహేష్, మండల ప్రధాన కార్యదర్శిగా రాయి అనిల్. కోశాధికారిగా రాయి ప్రభాకర్ ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. ఇట్టి కార్యక్రమానికి జిల్లా యూత్ అధ్యక్షులు కూరపాటి విజయ్. వినోద్. వెంకటేశ్వర్లు.

ముఖ్యమంత్రి కేసీఆర్ కు గిరిజనులు పాలాభిషేకం

Submitted by veerareddy on Tue, 20/09/2022 - 11:37

పెన్పహాడ్ సెప్టెంబర్ 19 (ప్రజా జ్యోతి):  ముఖ్యమంత్రి  కెసిఆర్  గిరిజనుల కొరకు 10% రిజర్వేషన్ పెంపుగిరిజన బంధు పథకంపోడు భూముల సమస్య పరిష్కారంప్రకటించినందుకు రాష్ట్ర విధ్యుత్ శాఖ మంత్రి సూర్యాపేట శాసనసభ సభ్యులు గుంటకండ్ల జగదీష్ రెడ్డి ఆదేశాల మేరకు మండలం ఎంపీపీ నెమ్మది బిక్షం, జడ్పిటిసి మామిడి అనిత అంజయ్య, టిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు దొంగరి యుగంధర్, మండల ఎస్ టి సెల్ అధ్యక్షులు చిత్తరంజన్ నాయక్ ఆధ్వర్యంలో పెన్ పహాడ్ మండల పరిధిలోని గిరిజన సోదర సోదరీమణులు ముఖ్యమంత్రి కి చిత్రపటానికి పాలాభిషేకం చేసి ధన్యవాదాలు తెలియజేయడానికి అధిక సంఖ్యలో  ర్యాలీగా వెళ్లారు.

రాష్ట్రంలో సంపద సృష్టించేది వ్యవసాయ కార్మికులే వ్యవసాయ కార్మిక సంఘం జాతీయ నాయకులు ములకలపల్లి రాములు

Submitted by veerareddy on Sat, 17/09/2022 - 12:12

 పెన్పహాడ్ సెప్టెంబర్ 16 (ప్రజా జ్యోతి):  రాష్ట్రంలోనే కాకుండా దేశంలోనూ సంపదను సూచించేది వ్యవసాయ కార్మికులని వ్యవసాయ కార్మిక సంఘం జాతీయ నాయకులు ములకలపల్లి రాములు అన్నారు. మండల పరిధిలోని అంతారం గ్రామంలో గుంజ వెంకటేశ్వర్లు అధ్యక్షతన నిర్వహించిన వ్యవసాయ కార్మిక మహాసభలో ముఖ్యఅతిథిగా పాల్గొని ఆయన మాట్లాడారు. బడుగు బలహీన వర్గాల కోసం నిత్యం పోరాడుతామని అర్హులైన వారందరికీ పెన్షన్లు పెంచి ఐదు వేల రూపాయలు  ఇవ్వాలని అన్నారు.

ఘనంగా నాయి బ్రాహ్మణ వృత్తిదారుల దినోత్సవం నిర్వహణ మండల అధ్యక్షులు పేరాల పురుషోత్తం

Submitted by veerareddy on Sat, 17/09/2022 - 12:07

 పెన్పహాడ్ మండలం సెప్టెంబర్ 16 (ప్రజా జ్యోతి):  మండల కేంద్రంలో నాయి బ్రాహ్మణ సంఘం మండల కమిటీ  ఆధ్వర్యంలో మండలఅధ్యక్షులు పేరాల పురుషోత్తం ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ మండలఅధ్యక్షుడు తూముల సురేష్ రావు కేక్ కట్ చేసి స్వీట్లు పంపిణీచేశారు.ఈ కార్యక్రమంలో నాయి బ్రాహ్మణ సంఘం నాయకులు పేరూరి లింగయ్య, సన్నాయిల వీరయ్య, సన్నాయిల సైదులు,నాగరాజు ఎస్ నగేష్ పేరూరి వెంకటేష్ పేరాల నాగేందర్ వల్ల రాజు ఎస్ వెంకన్న తదితరులు పాల్గొన్నారు.

జీవన ఎరువులతో భూసారం వృద్ధి కే. వి. కే - గడ్డిపల్లి శాస్త్రవేత్త ఏ. కిరణ్

Submitted by veerareddy on Thu, 15/09/2022 - 11:40

పెన్పహాడ్ సెప్టెంబర్ 14 (ప్రజా జ్యోతి): పెన్పహాడ్ మండల పరిధిలోని దుపాడు గ్రామ పరిధికి చెందిన రైతులకు జీవన ఎరువులు, వ్యవసాయంలో వాడుకొనే విధానంపై అవగాహణ కలిపించారు. ఈ కార్యక్రమంలో కె వి కే.వి. కే మృత్తిక శాస్త్రవేత్త పాల్గొని రైతులకు  జీవన ఎరువులైన రైజోబియం, అజటో బ్యాక్టర్ , అజో స్పిరిల్లo , భాస్వరాన్ని కరిగించే , పొటాష్ మోబిలై జింగ్ బ్యాక్టీరియా, జీవా మృతం  మొదలగు వాటి ద్వార భూసార  పరిరక్షణ జరుగుతుందని  వాటి తయారీ వాడక విధానాల గురించి  రైతులకు వివరించారు.

అనిరెడ్డిగూడెం గ్రామంలో గణేశుని శోభాయాత్ర ముఖ్య అతిథిగా పాల్గొన్న ముదిరెడ్డి రాజేష్

Submitted by Sathish Kammampati on Wed, 14/09/2022 - 12:47

పెన్పహాడ్ సెప్టెంబర్13 (ప్రజా జ్యోతి): రాజేష్ యువసేన ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన గణేశుడు 13 రోజుల పూజల అనంతరం పెన్పహాడ్ మండల పరిధిలోని అనిరెడ్డి గూడెం గ్రామంలో శోభాయాత్ర నిర్వహించి అనంతరం గణేష్ నిమజ్జనం కార్యక్రమం చేశారు .ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా పాల్గొన్న ముదిరెడ్డి రాజేష్  మాట్లాడుతూ అనిరెడ్డిగూడెం గ్రామ యువకులను అభినందించారు .

వ్యవసాయ కార్మిక సంఘం మండల మూడవ మహాసభను జయప్రదం చేయండి సిఐటియు మండల కన్వీనర్ రణపంగా కృష్ణ

Submitted by Sathish Kammampati on Wed, 14/09/2022 - 12:28

పెన్ పహాడ్ సెప్టెంబర్13 (ప్రజా జ్యోతి): ఈనెల 15న మండల పరిధిలోని అనంతారం గ్రామంలో జరిగే తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం పెన్ పహాడ్ మండల ఐదవ మహాసభను జయప్రదం చేయాలని సిఐటియు మండల కన్వీనర్ రణపంగ కృష్ణ పిలుపునిచ్చారు.  మంగళవారం అనంతారం గ్రామంలో మండల మహాసభకు సంబంధించిన కరపత్రాన్ని ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పుచ్చలపల్లి సుందరయ్య 1934వ సంవత్సరంలో తన సొంత గ్రామంలో వ్యవసాయ కార్మిక సంఘాన్ని స్థాపించాడని అన్నారు. నాటి నుండి నేటి వరకు పేదలు ,వ్యవసాయ కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారం కోసం వ్యవసాయ కార్మిక సంఘం నిరంతరం ఉద్యమిస్తుందఅన్నారు.

ఆపదలో ఉన్న వారిని కాపాడే ఆపద్బాంధవుడు విద్యుత్ శాఖ మాత్యులు గుంటకండ్ల జగదీష్ రెడ్డి

Submitted by Sathish Kammampati on Wed, 14/09/2022 - 10:27

పెన్ పహాడ్ సెప్టెంబర్13 (ప్రజా జ్యోతి): మండల పరిధిలోని దోసపహాడ్ గ్రామనివాసి, చెన్ను నాగిరెడ్డి  తండ్రి పాపిరెడ్డి కొద్దిరోజులుగా  అనారోగ్యంతో బాధపడుతూ హైదరాబాద్ నిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. వైద్యంకోసం ఆర్థికంగా ఇబ్బంది పడుతుండడంతో  స్థానిక నాయకులు కుటుంబ సభ్యులు రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రివర్యులు గుంటకండ్ల జగదీష్ రెడ్డి దృష్టికి సమస్యను తీసుకెళ్లగా వెంటనే స్పందించిన మంత్రి 2,50,000 ,(రెండులక్షలయాభై వేల రూపాయలు ) సీఎం రిలీఫ్ ఫండ్ (LOC) ద్వారా మంజూరు చేయించి వారి కుటుంబానికి అండగా నిలిచారు

జాతీయ పంచాయతీ అవార్డ్స్ కొరకు దరఖాస్తు చేసుకోవాలి

Submitted by Sathish Kammampati on Sat, 10/09/2022 - 15:33

పెన్పహాడ్ సెప్టెంబర్ 09 (ప్రజా జ్యోతి):    నేషనల్ పంచాయతీ అవార్డ్స్ గురించి ఒకరోజు ట్రైనింగ్ సెషన్ మండల పరిషత్ ఆఫీసులో మండల అధికారులతో పంచాయతీ కార్యదర్శులతో సమావేశం నిర్వహించడం జరిగింది ఇట్టి సమావేశానికి జిల్లా పంచాయతీ అధికారి యాదయ్య ముఖ్యఅతిథిగా హాజరై మండలంలోని అన్ని గ్రామ పంచాయతీలు జాతీయ పంచాయతీ అవార్డ్స్ కోసం దరఖాస్తు చేసుకోవాలని దానికి సంబంధించిన సమగ్ర అభివృద్ధి నివేదికలు సిద్ధం చేసుకోవాలని సూచించారు.