పెన్పహాడ్

ఉత్తమ విద్యార్థినికి ఎస్ పౌండేషన్ చేయూత

Submitted by Sathish Kammampati on Thu, 08/09/2022 - 13:11

పెన్పహాడ్ సెప్టెంబర్ 07 (ప్రజా జ్యోతి) : స్వర్గీయ గుంటకండ్ల సావిత్రమ్మ ఫౌండేషన్ సహకారంతో నిరుపేద విద్యార్థిని రణపంగ గౌతమికి ఇటీవల కాలంలో అగ్రికల్చర్ పీజీలో దేశస్థాయిలో ఉత్తమ ర్యాంకు పొందిన సందర్భంగా విద్యుత్ శాఖ మాత్యులు సూర్యాపేట స్థానిక శాసనసభ్యులు గుంటకండ్ల జగదీష్ రెడ్డి. విద్యార్థిని అభినందించారు. ఆమె విద్య నిర్వహించుటకు మంత్రి చేతులమీదుగా   ఆర్థికసాయం అందజేశారు.

వ్యవసాయ డిగ్రీ విద్యార్థులకు గ్రామీణ కృషి అనుభవం ఎంతో ముఖ్యం

Submitted by sridhar on Wed, 07/09/2022 - 17:07

పెన్పహాడ్ సెప్టెంబర్ 07 (ప్రజా జ్యోతి): గ్రామీణ కృషి అనుభవ కార్యక్రమంలో భాగంగా లయోల కళాశాలకు  చెందిన బి యస్సి వ్యవసాయ డిగ్రీ కోర్సు విద్యార్థులు  గ్రామీణ  వ్యవసాయ విధానాలు స్థితిగతులను  తెలుసుకొని గ్రామీణ భాగస్వామ్య విశ్లేషణ (PRA) కార్యక్రమం ద్వారా అధ్యయనం  చేసినట్లు ఇంచార్జ్ ప్రోగ్రాం కో ఆర్డినేటర్ శ్రీ బి లవ కుమార్ తెలిపారు. బుధవారం  సింగారెడ్డిపాలెం ప్రాథమిక పాఠశాల అవారణలో  నిర్వహించిన గ్రామీణ అవగాహన సదస్సు  కార్యక్రమంలో పాల్గొని పరిశీలించారు