వ్యవసాయ కార్మిక సంఘం మండల మూడవ మహాసభను జయప్రదం చేయండి సిఐటియు మండల కన్వీనర్ రణపంగా కృష్ణ

Submitted by Sathish Kammampati on Wed, 14/09/2022 - 12:28
 Jayapradam Third Mahasabha of Agricultural Labor Union Mandal   CITU Mandal Convener Ranapanga Krishna

పెన్ పహాడ్ సెప్టెంబర్13 (ప్రజా జ్యోతి): ఈనెల 15న మండల పరిధిలోని అనంతారం గ్రామంలో జరిగే తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం పెన్ పహాడ్ మండల ఐదవ మహాసభను జయప్రదం చేయాలని సిఐటియు మండల కన్వీనర్ రణపంగ కృష్ణ పిలుపునిచ్చారు.  మంగళవారం అనంతారం గ్రామంలో మండల మహాసభకు సంబంధించిన కరపత్రాన్ని ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పుచ్చలపల్లి సుందరయ్య 1934వ సంవత్సరంలో తన సొంత గ్రామంలో వ్యవసాయ కార్మిక సంఘాన్ని స్థాపించాడని అన్నారు. నాటి నుండి నేటి వరకు పేదలు ,వ్యవసాయ కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారం కోసం వ్యవసాయ కార్మిక సంఘం నిరంతరం ఉద్యమిస్తుందఅన్నారు. సంఘం పోరాట ఫలితంగా భూసంస్కరణ చట్టం ,కనీస వేతన చట్టం ,గ్రామీణ ఉపాధి హామీ చట్టం ,అటవీ హక్కుల చట్టం ,తెలంగాణ రక్షిత కవులుదారుల చట్టం, ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్, అత్యాచార నిరోధక చట్టం వంటి అనేక చట్టాలు సాధించుకోవడం జరిగిందన్నారు .వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో పేదలకు సాగుభూములు ఇవ్వాలని ,ఇండ్లు ఇళ్ల స్థలాలు కోసం, కులవ్యక్ష, అంటరానితనానికి వ్యతిరేకంగా అనేక ఉద్యమాలు నిర్వహించడం జరిగిందన్నారు. పెండింగ్ లో ఉన్న ఉపాధి కూలీల వేతనాలను వెంటనే విడుదల చేయాలని కోరారు. పెరుగుతున్న ధరలకు అనుగుణంగా గ్రామీణ ప్రాంతంలో ఉన్న వ్యవసాయ కూలీలకు రోజు కూలి 600 రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేశారు.

ఈనెల 15న జరిగే మండల మహాసభకు ముఖ్య అతిథిగా  వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్ వెంకట్ రాములు హాజరవుతున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం మండల అధ్యక్షులు గుంజ వెంకటేశ్వర్లు అనంతారం గ్రామ పోరాట కమిటీ నాయకులుమామిడి అంబేద్కర్, షేక్ మహిబెల్లీ, షేక్ సైదా, మామిడి అంబేద్కర్, మామిడి కిరణ్, మామిడి దాస్ ,మామిడి కృష్ణ , జెక్కి శ్రీనివాస్,జెక్కి నరసయ్య,రంగయ్య, నారాయణ పాల్గొన్నారు.