జీవన ఎరువులతో భూసారం వృద్ధి కే. వి. కే - గడ్డిపల్లి శాస్త్రవేత్త ఏ. కిరణ్

Submitted by veerareddy on Thu, 15/09/2022 - 11:40
Enrichment of soil with living fertilizers  K. V. K - Gaddipalli Scientist A. Kiran

పెన్పహాడ్ సెప్టెంబర్ 14 (ప్రజా జ్యోతి): పెన్పహాడ్ మండల పరిధిలోని దుపాడు గ్రామ పరిధికి చెందిన రైతులకు జీవన ఎరువులు, వ్యవసాయంలో వాడుకొనే విధానంపై అవగాహణ కలిపించారు. ఈ కార్యక్రమంలో కె వి కే.వి. కే మృత్తిక శాస్త్రవేత్త పాల్గొని రైతులకు  జీవన ఎరువులైన రైజోబియం, అజటో బ్యాక్టర్ , అజో స్పిరిల్లo , భాస్వరాన్ని కరిగించే , పొటాష్ మోబిలై జింగ్ బ్యాక్టీరియా, జీవా మృతం  మొదలగు వాటి ద్వార భూసార  పరిరక్షణ జరుగుతుందని  వాటి తయారీ వాడక విధానాల గురించి  రైతులకు వివరించారు. జీవ శిలీంద్ర నాషకలు అయిన ట్రైకో డర్మా సుడో మోనాస్, జీవ పురుగు మందు లైన వెర్టి సెలియం , బి.టి, ఎన్.పి.వీ  మొదలగు వాటి వాడకం   ద్వారా  జీవ నియంత్రణ జరిగి పంట దిగుబడి పెరుగు తుందని నాణ్యమైన  పోషకాలతో కూడిన పంట ఉత్పత్తులను పొందవచ్చునని తెలిపారు. ఈ కార్యక్రమంలో రైతులు,అరవింద్,భాస్కర్, వీరయ్య,గోపగని శ్రీను,సత్యం, రామయ్య,జనకిరములు, రవీందర్,సైదులు.  ఓరియంటల్ యూనివర్సిటీ,ఇండోర్ మధ్యప్రదేశ్ చెందిన వ్యవసాయ విద్యార్థులు శివ శంకర్,శ్రీకాంత్,రితేష్ రామన్, జగదీష్,హర్షవర్ధన్,మహేందర్,అక్షిత,పావని,వినీతా,మనిచందన పాల్గొన్నారు.