రాష్ట్రంలో సంపద సృష్టించేది వ్యవసాయ కార్మికులే వ్యవసాయ కార్మిక సంఘం జాతీయ నాయకులు ములకలపల్లి రాములు

Submitted by veerareddy on Sat, 17/09/2022 - 12:12
 It is the agricultural laborers who create the wealth in the state   Mulakalapalli Ramulu, the national leader of the Agricultural Labor Union

 పెన్పహాడ్ సెప్టెంబర్ 16 (ప్రజా జ్యోతి):  రాష్ట్రంలోనే కాకుండా దేశంలోనూ సంపదను సూచించేది వ్యవసాయ కార్మికులని వ్యవసాయ కార్మిక సంఘం జాతీయ నాయకులు ములకలపల్లి రాములు అన్నారు. మండల పరిధిలోని అంతారం గ్రామంలో గుంజ వెంకటేశ్వర్లు అధ్యక్షతన నిర్వహించిన వ్యవసాయ కార్మిక మహాసభలో ముఖ్యఅతిథిగా పాల్గొని ఆయన మాట్లాడారు. బడుగు బలహీన వర్గాల కోసం నిత్యం పోరాడుతామని అర్హులైన వారందరికీ పెన్షన్లు పెంచి ఐదు వేల రూపాయలు  ఇవ్వాలని అన్నారు. వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర నాయకులు నెమ్మది వెంకటేశ్వర్లు మాట్లాడుతూ చీదెళ్ళ గ్రామం లో నిర్మించిన డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను అర్హులైన వారికి వెంటనే పెంచాలని అనంతరం గ్రామంలో ఉన్న ప్రభుత్వ భూమిని పేదలకు పంచాలని అన్నారు. అనంతారం గ్రామంలో నూతన వ్యవసాయ కార్మిక సంఘం కమిటీని ఎన్నుకున్నారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి మట్టపల్లి సైదులు, చిన్న పని నరసయ్య, ప్రబంధ కృష్ణ, వీరబోయిన రవి గుంజ వెంకటేశ్వర్లు మామిడి అంబేద్కర్ కిరణ్ రాములు అశోక్ యాదగిరి  లక్ష్మమ్మ తదితరులు పాల్గొన్నారు.