పెన్పహాడ్

మామిడి చిన్న వెంకులు కుటుంబ సభ్యులను పరామర్శించిన కొండమీద గోవిందరావు

Submitted by Upender Bukka on Thu, 29/09/2022 - 12:02

  పెన్పహాడ్ మండలం సెప్టెంబర్ 28 (ప్రజా జ్యోతి):  మండల  పరిధిలోని అనంతారం గ్రామానికి చెందిన మామిడి చిన్న వెంకులు అనారోగ్యంతో ఇటీవల మృతి చెందగా ఆయన చిత్రపటానికి దళిత ఇండియన్ చాంబర్ ఆఫ్ కామర్స్ ఇండస్ట్రీ జిల్లా అధ్యక్షులు కొండమీది గోవిందరావు చిత్రపటానికి పూలమాలవేసి కుటుంబ ప్రగాఢ సంతాపం తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..... వెంకులు లేని లోటు కుటుంబానికి తీరనిలోటని ఆయన అన్నారు. సంతాపం తెలిపిన వారిలో జడ్పిటిసి మామిడి అనిత అంజయ్య  నాయకులు కట్టెల విజయ్ కుమార్,  సింగం వెంకన్న ,మోదాల నాగేష్ ,వాస రాములు, వెంకటయ్య ,తదితరులు పాల్గొన్నారు.

ఆర్టీసీ లో ప్రయాణం సురక్షితం

Submitted by veerareddy on Wed, 28/09/2022 - 09:03

పెన్ పహాడ్ మండలం సెప్టెంబర్ 27(ప్రజా జ్యోతి):  ఆర్టీసీలో ప్రయాణం సురక్షితమని స్టేషన్ ఇన్చార్జి నిర్మల అన్నారు ఆర్టీసీ ఎండి సజ్జనార్ ఆదేశాల మేరకు చెట్ల ముకుందాపురం గ్రామంలో సర్పంచ్ రాయిరాల శోభారాణి ఆధ్వర్యంలో "ప్రజల వద్దకు ఆర్టీసీ " పేరుతో గ్రామ సభ నిర్వహించడం జరిగింది,ఈసందర్బంగా సర్పంచ్ మాట్లాడుతూ చెట్లముకుందాపురం గ్రామానికి బస్సు సౌకర్యం లేదని మోడల్ స్కూల్ విద్యార్థుల సౌకర్యార్ధం  బస్సు  నడుపుతున్నారని  ఆ బస్సు   గాజుల  మల్కాపురం  చీదెళ్ల  మీదుగా  చెట్లముకుందపురం నుండి  పెన్పహాడ్  వెళ్లేవిదంగా  చర్యలు  చేసుకోవాలన్నారు అదేవిదంగా  ప్రయాణికుల  సౌకర్యార్ధం  అదనంగా  ఉదయం,  సాయం

మృతుని కుటుంబ సభ్యులకు సానుభూతి కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు తూముల సురేష్ రావు

Submitted by veerareddy on Sun, 25/09/2022 - 11:30

పెన్ పహాడ్ మండలం సెప్టెంబర్ 24 (ప్రజా జ్యోతి): మండల పరిధిలోని దుబ్బ తండా గ్రామ ఉప-సర్పంచ్ భూక్యా భాస్కర్ తండ్రి భూక్యా చీన్యా నాయక్ మృతి చెందడంతో వారి  పార్థివ దేహానికి, కాంగ్రెస్ పార్టీ పెన్పహాడ్ మండల అధ్యక్షుడు తూముల సురేష్ రావు పూలమాల వేసి నివాళుర్పించి,వారి కుటుంబానికి ప్రగాఢ  సానుభూతిని తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చిన్యా నాయక్ పార్టీ కోసం తన గ్రామంలో పార్టీ అభివృద్ధి కోసం పని చేశారని అతని అకాల మరణం పార్టీకి తీరని లోటని అన్నారు. పరామర్శించిన వారిలో మృతుని కుటుంబ సభ్యులు గ్రామస్తులు పార్టీ కార్యకర్తలు తదితరులు ఉన్నారు.

వీఆర్ఏల సమ్మెకు వ్యవసాయ కార్మిక సంఘం మద్దతు

Submitted by veerareddy on Fri, 23/09/2022 - 10:35

పెన్పహాడ్ మండలం సెప్టెంబర్ 22 (ప్రజా జ్యోతి):  వీ ఆర్ ఏ ల సమ్మె 60వ రోజుకు చేరిన సందర్భంగా, దీక్షా శిబిరాన్ని సందర్శించిన  తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం సూర్యాపేట జిల్లా ప్రధాన కార్యదర్శి ధూళిపాళ ధనుంజయ నాయుడుమాట్లాడుతూ.సమ్మె చేస్తున్న వీఆర్ఏలకు వ్యవసాయ కార్మిక సంఘం తన సంపూర్ణ మద్దతు ఇస్తుందని, వీఆర్ఏలకు పే స్కేలు ఇస్తామని 2017లో సాక్షాత్తు రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రగతి భవన్ సాక్షిగా ప్రకటించారని, ఆ తర్వాత అసెంబ్లీలో కూడా రెండు సందర్భాలలో పే స్కేలు ఇస్తామని వాగ్దానం చేసి తీరా ఇప్పుడు వారిని సమ్మెబాట పట్టించారని, విరమించండి ఆ తర్వాత మాట్లాడకుందామని కేటీఆర్  ప్రకటించడం విడ్డూరంగా

పెన్పహాడ్ మండల ఇన్చార్జి ఎంపీడీవో గా బాణాల శ్రీనివాస్

Submitted by veerareddy on Thu, 22/09/2022 - 14:47

పెన్పహాడ్ సెప్టెంబర్ 21 (ప్రజా జ్యోతి): పెన్పహాడ్ మండలంలో గతంలో ఎంపీడీవో గా విధులు నిర్వహించిన తుంగతుర్తి వెంకటాచారి పాలకీడు మండలానికి బదిలీ అయ్యారు.ప్రస్తుతం మండల ఇన్చార్జి ఎంపీడీవో గా బాణాల శ్రీనివాసు బాధ్యతలు స్వీకరించారు.

విద్యను బోధించే గురువుకే అత్యున్నతమైన గౌరవం

Submitted by veerareddy on Thu, 22/09/2022 - 14:41

 పెన్పహాడ్ మండలం సెప్టెంబర్ 21 (ప్రజా జ్యోతి):  సమాజంలో విద్యను బోధించే గురువుకి అత్యున్నతమైన గౌరవం దక్కుతుందని మండల ఎంపిపి నెమ్మది బిక్షం అన్నారు. బుధవారం మండల విద్యాధికారి నకిరేకంటి రవి అధ్యక్షతన నిర్వహించిన ఉపాధ్యాయ సంఘాల సమన్వయంతో 24 మంది ఉత్తమ ఉపాధ్యాయులను ఘనంగా సన్మానించారు.

విధ్య తోనే జీవితాలకు వెలుగు మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి

Submitted by veerareddy on Wed, 21/09/2022 - 14:50

 పెన్పహాడ్ మండలం సెప్టెంబర్ 21 (ప్రజా జ్యోతి):    విద్యాభివృద్ధికి ప్రభుత్వం అధిక ప్రాధాన్యతతెలంగాణలో ఉన్న రెసిడెన్షియల్ స్కూల్ లు దేశంలో మరెక్కడా లేవు ముఖ్యమంత్రి కేసీఆర్  ప్రత్యేక  చొరవతో ఇది సాధ్యం అయిందివిధ్య పై కేసీఆర్ కు ఉన్న దార్శనికత కు నిదర్శనం పట్టుదల తో చదివి  ఉన్నత శిఖరాలకు చేరడమే ముఖ్యమంత్రి కి  విద్యార్ధులు ఇచ్చే గిఫ్ట్విద్యార్ధుల జీవితాలకు వెలుగు లు ప్రసాదించే   విద్యాభివృద్ధికి ముఖ్యమంత్రి కేసీఆర్ గారి సారధ్యంలో ని టీ.ఆర్.ఎస్ ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తుందని, సూర్యాపేట శాసన సభ్యులు, రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి అన్నారు.సూర్యాపేట నియ

కస్తూరిబా గాంధీ బాలికల విద్యాలయం నూతన భవనం ప్రారంభం

Submitted by veerareddy on Wed, 21/09/2022 - 12:58


పెన్పహాడ్ మండలం సెప్టెంబర్ 20 (ప్రజా జ్యోతి):  మండల కేంద్రంలో నూతనంగా  నిర్మించిన  కస్తూరిభా గాంధీ బాలికల విద్యాలయం  నేడు  మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి  చేతుల మీదుగా  ప్రారంభించడం జరుగుతుందని ఎం ఈ ఓ నకిరేకంటి రవి ప్రకటనలో తెలిపారు.  ఈ సందర్బంగా   ఆయన మాట్లాడుతూ విద్యా శాఖ నిధులతో సుమారు 4కోట్లతో విద్యార్థులకు అన్ని  సౌకర్యాలతో  నిర్మించడం జరిగిందన్నారు   జిల్లా కలెక్టర్  ఆహ్వానం మేరకు కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు.