హుజూర్ నగర్

వాహన దారులు నియమ నిబంధనలు పాటించాలి

Submitted by Ramakrishna on Fri, 30/09/2022 - 10:06

హుజూర్ నగర్ సెప్టెంబర్ 29(ప్రజా జ్యోతి)./...హుజూర్ నగర్ పట్టణంలో సిఐ రామలింగారెడ్డి ఆధ్వర్యంలో నలుగురు ఎస్సైలు 40 మంది సిబ్బందితో  కలిసి నెంబర్ ప్లేట్లు లేని వాహనాలను, డ్రంక్ అండ్ డ్రైవ్, పెండింగ్ చలానాలు ఉన్న వాహనదారులను ఆపి తనిఖీలు నిర్వహించారు.

మున్సిపాలిటిలో అవినీతి, అక్రమాలపై కాంగ్రెస్ పార్టీ నిరసన ధర్నా:

Submitted by Ramakrishna on Fri, 30/09/2022 - 10:01

హుజూర్ నగర్ సెప్టెంబర్ 29(ప్రజా జ్యోతి)./... హుజూర్ నగర్ పట్టణ కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో శుక్రవారం ఉదయం 10 గంటలకు మున్సిపల్ కార్యాలయం ముందు మున్సిపాలిటిలో జరుగుతున్న అవినీతి అక్రమాలు, లే అవుట్ భూముల కబ్జాల పై నిరసన ధర్నా నిర్వహించబడుతుందని ఈ ధర్నా కార్యక్రమానికి ఎం‌పి కెప్టెన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే పద్మావతి రెడ్డి, డి‌సి‌సి అధ్యక్షులు చెవిటి వెంకన్న యాదవ్ లు పాల్గొంటారనీ.హుజూర్ నగర్ కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు తన్నీరు మల్లికార్జున్,మున్సిపల్ ఫ్లోర్ లీడర్,కస్తాల శ్రవణ్ కుమార్,  కౌన్సిలర్లు కోతి సంపత్ రెడ్డి, వేముల వరలక్ష్మి నాగరాజు, బొల్లెద్దు ధనమ్మ జైల

యువత బైటికి రావాలి ప్రపంచంతో పోటీ పడాలి:

Submitted by Ramakrishna on Thu, 29/09/2022 - 11:41

మెగా జాబ్ మేళా..జాబ్ మేళాకు విశేష స్పందన..
ఉద్యోగాలు సాధించిన 170 మంది అభ్యర్థులు.ఎమ్మెల్యే సైదిరెడ్డికి కృతజ్ఞతలు  

ముక్త్యాల బ్రాంచ్ కాల్వలో యువకుడి మృతదేహం లభ్యం: హుజూర్ నగర్ ఎస్ఐ. కట్టా వెంకట్ రెడ్డి

Submitted by Ramakrishna on Thu, 29/09/2022 - 11:39

 హుజూర్ నగర్ సెప్టెంబర్ 28 (ప్రజా జ్యోతి):  ముక్త్యాల బ్రాంచ్ కాల్వ నీటిలో వరద ప్రవాహానికి కొట్టుకొని పోయిన యువకుడి మృతదేహం లభ్యమైనట్లు హుజూర్ నగర్ ఎస్ఐ వెంకటరెడ్డి తెలిపారు.

బతుకమ్మ పండుగ తెలంగాణ సాంస్కృతిక వైభవానికి ప్రతీక

Submitted by Ramakrishna on Thu, 29/09/2022 - 11:37

హుజూర్ నగర్ సెప్టెంబర్ 28 (ప్రజా జ్యోతి): మండలంలోని శ్రీనివాసపురం గ్రామంలో సర్పంచ్ పత్తిపాటి రమ్య నాగరాజు అధ్యక్షతన జరిగిన బతుకమ్మ చీరల పంపిణీ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన హుజూర్ నగర్ ఎంపీపీ గూడెపు శ్రీనివాస్, జెడ్ పి టి సి కొప్పుల సైదిరెడ్డి లు బుధవారం  మహిళలకు బతుకమ్మ చీరలు అందజేశారు.

కొండా లక్ష్మణ్ బాపూజీ ఆశయాలు సాధించాలి - ఎంపీపీ గూడెపు శ్రీనివాస్

Submitted by Sathish Kammampati on Wed, 28/09/2022 - 09:36

హుజూర్ నగర్ సెప్టెంబర్ 27 (ప్రజా జ్యోతి):  కొండా లక్ష్మణ్ బాపూజీ ఆశయాలను సాధించాలని హుజూర్ నగర్ ఎంపీపీ గూడెపు శ్రీనివాసు కోరారు. మంగళవారం పట్టణంలోని మండల పరిషత్  కార్యాలయంలో కొండా లక్ష్మణ్ బాపూజి  జయంతి  సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్వాతంత్ర్య సమరయోధుడు కొండా లక్ష్మణ్ బాపూజీ బడుగు బలహీన వర్గాల అభివృద్ధికి ఎంతో పాటుపడ్డాడని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో టి. శాంతకుమారి, ఎంపీ ఓ షేక్ మౌలానా, సి‌హెచ్ సాయిరాం , లక్కవరం ఎంపీటీసీ రణపంగు కాశమ్మ, కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు.

హమాలీల సమస్యలను ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్తా

Submitted by Ramakrishna on Wed, 28/09/2022 - 08:57

   హుజూర్ నగర్ సెప్టెంబర్ 27 (ప్రజా జ్యోతి):  హమాలీల సమస్యలను స్థానిక ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి దృష్టికి తీసుకెళ్తానని నియోజకవర్గ కార్మిక సంఘం అధ్యక్షులు పచ్చిపాల ఉపేందర్ అన్నారు. హుజూర్ నగర్ పట్టణంలో  టీఎస్ డబ్ల్యూ వేరేస్ గౌడ్ హమాలీల సమావేశం మంగళవారం జరిగిందన్నారు. ఈ సమావేశంలో  నియోజవర్గ కార్మిక సంఘ అధ్యక్షులు పచ్చిపాల ఉపేందర్ పాల్గొని మాట్లాడుతూ కాంట్రాక్టర్ ఎస్సై  పిఎఫ్ పే చేస్తున్నారా, కాంట్రాక్ట్ తో మాట్లాడి వారి సమస్యలు ఎమ్మెల్యే దృష్టికి తీసుకు వెళ్తామని అన్నారు. ఈఎస్ఐ కార్డు ఉన్నవారు వారి ఫ్యామిలీ డీటెయిల్స్ యాడ్ చేసుకోగలరు  అన్నారు.

ఆర్థిక ఇబ్బందులతో యువకుడు ఆత్మహత్య

Submitted by Ramakrishna on Wed, 28/09/2022 - 08:18

హుజూర్ నగర్, సెప్టెంబర్ 27(ప్రజా జ్యోతి).///...ఆర్థిక ఇబ్బందులతో యువకుడు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్న సంఘటన పట్టణం లో వెలుగుచూసింది.హుజూర్ నగర్ ఏఎస్ఐ శ్రీనివాసరావు తెలిపిన వివరాల ప్రకారం హుజూర్ నగర్ పట్టణానికి చెందిన ముడొత్తుల పృధ్వీరాజ్ తండ్రి శ్రీనివాస్,వయసు.28 సం.రాలు అను అతను గత కొన్ని సంవత్సరాలుగా ఖమ్మంలోని ఇందుస్ బ్యాంక్ నందు రికవరీ ఏజెంట్ గా పని చేస్తున్నాడనీ.సోమవారం  సాయంత్రం డ్యూటీ నుండి ఇంటికి వచ్చి,ఆ రాత్రి ఇంట్లోనే పడుకొని మంగళ వారం ఉదయం 7.00 గంటల సమయంలో మృతుడు చెల్లెలు భార్గవి కి జాగ్రత్తగా ఉండమని మెసేజ్ పేట్టి ఇంట్లో ప్యాన్ కు ఉరి వేసుకొని చనిపోయాడు.