మున్సిపాలిటిలో అవినీతి, అక్రమాలపై కాంగ్రెస్ పార్టీ నిరసన ధర్నా:

Submitted by Ramakrishna on Fri, 30/09/2022 - 10:01
Congress party protest dharna against corruption and irregularities in the municipality:

హుజూర్ నగర్ సెప్టెంబర్ 29(ప్రజా జ్యోతి)./... హుజూర్ నగర్ పట్టణ కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో శుక్రవారం ఉదయం 10 గంటలకు మున్సిపల్ కార్యాలయం ముందు మున్సిపాలిటిలో జరుగుతున్న అవినీతి అక్రమాలు, లే అవుట్ భూముల కబ్జాల పై నిరసన ధర్నా నిర్వహించబడుతుందని ఈ ధర్నా కార్యక్రమానికి ఎం‌పి కెప్టెన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే పద్మావతి రెడ్డి, డి‌సి‌సి అధ్యక్షులు చెవిటి వెంకన్న యాదవ్ లు పాల్గొంటారనీ.హుజూర్ నగర్ కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు తన్నీరు మల్లికార్జున్,మున్సిపల్ ఫ్లోర్ లీడర్,కస్తాల శ్రవణ్ కుమార్,  కౌన్సిలర్లు కోతి సంపత్ రెడ్డి, వేముల వరలక్ష్మి నాగరాజు, బొల్లెద్దు ధనమ్మ జైలు, వెలిదండ సరితావీరా రెడ్డి, తేజావత్ రాజా నాయక్, కారింగుల విజయ వెంకటేశ్వర్లు ఒక ప్రకటనలో తెలిపారు.ప్రధాన డిమాండ్ల- మున్సిపాలిటీ చట్టంలో పేర్కొన్నట్లు గా హుజూర్ నగర్ మున్సిపాలిటీ సర్వసభ్య సమావేశం ప్రతినెల నిర్వహించాలనీ,సర్వసభ్య సమావేశం నిర్వహించకుండా అత్యవసర పనుల పేరుతో జిల్లా కలెక్టర్ చే నిధులు దుర్వినియోగం చేస్తున్నారనీహుజూర్ నగర్ గ్రామ పంచాయతీ నుండి వారసత్వంగా వచ్చిన వందల కోట్ల లే అవుట్ల భూములు, భూ కబ్జాలు నివారించాలనీ,హుజూర్ నగర్ గ్రామ పంచాయతీ నుండి నేటి వరకు లే అవుట్ స్థలాలుగా గ్రామ పంచాయితీకి, మున్సిపాలిటీకి ఇచ్చిన భూముల డాక్యుమెంట్లు దొంగలించబడడం పై క్రిమినల్ కేసులు నమోదు చేసి,  దోషులను శిక్షించాలి. (విపిఆర్ వెంచర్ లో సుమారు 2000 గజాలు, పద్మశాలి భవనం ప్రక్కన 2445 గజాలు, సాయిబాబా థియేటర్ ప్రక్కన 5510 గజాలు, శ్రీలక్ష్మి థియేటర్ ప్రక్కన 1000 గజాలు, గతంలో గ్రామ పంచాయితీ, మున్సిపాలిటీలకు ఇచ్చిన సుమార్ పదివేల గజాలు సుమారు వందకోట్ల ప్రజల ఆస్తిని అక్రమంగా అమ్ముకోవడంలో ఎవరెవ్వరి పాత్ర ఉంది. ఏ ప్రజాప్రతినిధులు, అధికారుల పాత్ర ఉన్న వారిపై క్రిమినల్ కేసు నమోదు చెయ్యాలనీ ప్రస్తుతం అనుమతులు లేకుండా ఏర్పాటు చేస్తున్న 40 ఎకరాల లే అవుట్ పై చర్యలు తీసుకోవాలనీ,లే అవుట్ వెంచర్లలో హుజూర్ నగర్ తహశీల్దార్ వ్యవసాయ భూమిగా రిజిస్ట్రేషన్ చేయడం చట్ట వ్యతిరేకం దీనిపై నిరసన తెలియజేస్తున్నాం అన్నారు.

మున్సిపాలిటీ కంప్యూటర్ ఆర్ ఐ లాగిన్ దొంగలించి, కమీషనర్ సంతకాన్ని ఫోర్జరీ చేసి తప్పుడు ఇంటి నెంబర్లు పెట్టి ప్రవేయిట్ ఆస్తులను కబ్జా చేస్తున్న వారిపై పోలీసు లు చర్య తీసుకోకపొవడంపై,మున్సిపాలిటీలో టీపీఓ,ఎఇ, డిఇ, శానటరీ ఇన్స్పెక్టర్, ఆర్ఐ, అకౌంటెంట్ పోస్టులను పూర్తి స్థాయిలో నియామకం చేయాలనీ డిమాండ్ చేస్తూ నిరసన తెలియజేస్తామని అన్నారు.