హుజూర్ నగర్

కేంద్ర ప్రభుత్వం విద్యుత్ సంస్కరణల పేరిట రైతుల ప్రయోజనాలను దెబ్బతీస్తుంది

Submitted by Ramakrishna on Tue, 27/09/2022 - 13:31

హుజూర్ నగర్ సెప్టెంబర్ 26 (ప్రజా జ్యోతి):   కేంద్ర ప్రభుత్వం విద్యుత్ సంస్కరణల పేరిట రైతుల ప్రయోజనాలను దెబ్బతీసేలా ప్రయత్నిస్తుందని శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి అన్నారు. సోమవారం హుజూర్ నగర్ ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి క్యాంపు కార్యాలయంలో  విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాజకీయాలకు ప్రాధాన్యత ఇస్తూ కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం దేశ ప్రయోజనాలకు త్రిలోధకాలు ఇస్తుందని విమర్శించారు. బిజెపితేర రాష్ట్రాల ప్రయోజనాలను కేంద్రం గాలికి వదిలేసి సప్రయోజనాలకు అధిక ప్రాధాన్యత ఇస్తుందన్నారు.

ఎన్ఎస్ఎస్ విద్యార్థులు క్రమశిక్షణకు మారుపేరుగా నిలవాలి:ప్రియదర్శిని విద్యాసంస్థల చైర్మన్ పశ్యా శ్రీనివాస్ రెడ్డి

Submitted by Ramakrishna on Sun, 25/09/2022 - 12:39

హుజూర్ నగర్, సెప్టెంబర్24(ప్రజా జ్యోతి)..//.ఎన్ఎస్ఎస్ విద్యార్థులు క్రమశిక్షణకు మారుపేరుగా నిలవాలని ప్రియదర్శిని విద్యాసంస్థల చైర్మన్ పశ్యా శ్రీనివాస్ రెడ్డి అన్నారు.హుజూర్ నగర్ పట్టణ పరిధిలోని  ప్రియదర్శిని జూనియర్ & డిగ్రీ కళాశాలలో శనివారం ఎన్ఎస్ఎస్ వ్యవస్థాపక దినోత్సవన్ని ఘనంగా నిర్వహించడం  జరిగింది.ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ప్రియదర్శిని విద్యాసంస్థల చైర్మన్ పశ్యా శ్రీనివాస్ రెడ్డి పాల్గొని మహాత్మాగాంధీ చిత్రపటానికి పూలమాలవేసి నివాళులు అర్పించారు.

ఎంబిబిఎస్ ఫలితాలలో ఉత్తమర్యాంకు సాధించిన ప్రవళిక

Submitted by Ramakrishna on Sun, 25/09/2022 - 12:22

హుజూర్ నగర్, సెప్టెంబర్ 24(ప్రజా జ్యోతి)..///.. హుజూర్ నగర్ పట్టణానికి చెందిన యల్లావుల రమేష్ ఉమాల కుమార్తె యల్లావుల ప్రవళిక ఆల్ ఇండియా నీట్ రాష్ట్రస్థాయి ఎంబిబిఎస్ ఫలితాలలో550 మార్కులతో రాష్ట్రస్థాయిలో 850వ ర్యాంకు సాధించింది. ప్రవళిక ఉత్తమ ర్యాంకు సాధించడం పట్ల ఎస్టీయూ సీనియర్నాయకులు కెవిఎన్ మూర్తి, సిపిఐ రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు యల్లావుల రాములు, జిల్లా కార్యవర్గ సభ్యులు పాలకూరి బాబు, కంబాలశ్రీనివాస్, మహిళా సమాఖ్య రాష్ట్ర కౌన్సిల్ సభ్యురాలు దేవరం మల్లీశ్వరీ, సిపిఐ పట్టణ కార్యదర్శి గుండు వెంకటేశ్వర్లు, జడశ్రీనివాస్ శనివారం వారి నివాసంలో అభినందనలు తెలియచేశారు.

అంగన్వాడీ కేంద్రాలలో అందిస్తున్న పౌష్టికాహారాన్ని సద్వినియోగం చేసుకోవాలి: ఇంచార్జ్ సిడిపిఓ హేమదేవి

Submitted by Ramakrishna on Sat, 24/09/2022 - 12:48

హుజూర్ నగర్, సెప్టెంబర్ 23(ప్రజా జ్యోతి),,.///, పోషణ మాస వారోత్సవాల్లో భాగంగా శుక్రవారం హుజూర్ నగర్ పట్టణం లోని 6,11,15,1,2  అంగన్వాడి కేంద్రాల గర్భిణీ స్త్రీలకు బాలింతలకు పోషక ఆహారo పై అవగాహన సదస్సును నిర్వహించినారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఇంచార్జ్ సిడిపిఓ హేమదేవి 10వార్డు కౌన్సిలర్ గుండా ఫణి కుమారి 6 వ వార్డు కౌన్సిలర్ ములకలపల్లి రాoగోపి 8వ వార్డ్ కౌన్సిలర్ చిలకబత్తిని సౌజన్య పాల్గొన్నారు.ఈ సందర్భంగా సిడిపిఓ హేమదేవి  మాట్లాడుతూ ప్రభుత్వ అంగన్వాడీ  కేంద్రాల ద్వారా అందిస్తున్న పౌష్టికాహారాన్ని సద్వినియోగం చేసుకొని ఆరోగ్యంగా ఉండాలని కోరారు.

ఉత్తమ వ్యాయామ ఉపాధ్యాయుడికి ఘన సన్మానం:

Submitted by Ramakrishna on Sat, 24/09/2022 - 12:46

హుజూర్ నగర్ సెప్టెంబర్ 23 (ప్రజాజ్యోతి)..//. హుజూర్ నగర్ పట్టణం లో గౌట్ హైస్కూల్  వ్యాయామ ఉపాధ్యాయుడు రవీందర్ రెడ్డి ఉత్తమ ఉపాధ్యాయులుగా ఎంపికయ్యారు. శుక్రవారం పట్టణ పరిధిలోని ఎంపిడిఓ కార్యాలయంలో నందు ఎంపీపీ గూడెపు శ్రీను ఆధ్వర్యంలో  జెడ్పీటీసీ సైదిరెడ్డి ఎంపిడిఓ శాంత కుమారి ఎంఈఓ సైదా నాయక్ ఘనంగా సన్మానించారు. అనంతరం పి ఈ టీ రవిందర్ మాట్లాడుతూ ఉపాధ్యాయ వృత్తిలో ఇలాంటి సన్మానం పొందడం ఎంతో ఆనందదాయకమని, ఈ సన్మానం పాఠశాల విధుల పట్ల మరింత బాధ్యత పెంచిందని, దానికి అనుగుణంగా మరింత రెట్టింపు ఉత్సాహంతో పని చేస్తామని తెలియజేశారు.

పుట్టువెంట్రుకల మహోత్సవం లో పాల్గొన్న ఎమ్మెల్యే శాసనంపూడి సైది రెడ్డి:

Submitted by Ramakrishna on Thu, 22/09/2022 - 14:07

హుజూర్ నగర్, సెప్టెంబర్ 21(ప్రజా జ్యోతి)  హుజూర్ నగర్ మున్సిపాలిటీ పరిధిలోని  మాధవరాయిని గూడెం 28 వ వార్డు కౌన్సిలర్ అమరబోయిన గంగరాజు ఏకైక పుత్రిక అమరబోయిన రిషిక పుట్టువెంట్రుకల మహోత్సవం సందర్బంగా హుజూర్ నగర్ నియోజకవర్గ శాసన సభ్యులు శాసనంపూడి సైది రెడ్డి పాల్గొని చిన్నారిని ఆశీర్వదించారు.ఈ కార్యక్రమంలో హుజూర్ నగర్ టి ఆర్ ఎస్ పట్టణ పార్టీ అధ్యక్షుడు చిట్యాల అమర్ నాథ్ రెడ్డి, ప్రధాన కారదర్శి బెల్లంకొండ అమర్ గౌడ్,  కౌన్సిలర్ లు కొమ్ము శ్రీను, జక్కుల శంభయ్య, గుండా ఫణి రామ్ రెడ్డి, మహిళా నాయకురాలు శ్రీపాద అర్చన దేవి, ప్రజా ప్రతినిధులు, వివిధ కమిటీల నాయకులు, యువజనులు, ప్రజలు, మహి

విద్యార్థులకు కనీస సామర్ధ్యాలు వచ్చే విధంగా ఉపాధ్యాయులు కృషి చేయాలి:ఎఫ్ ఎల్ ఎన్ మండల నోడల్ అధికారి బీరెల్లి శ్రీనివాసరెడ్డి

Submitted by Ramakrishna on Thu, 22/09/2022 - 13:18

హుజూర్ నగర్ సెప్టెంబర్ 21(ప్రజా జ్యోతి)../ ప్రతి విద్యార్థికి కనీస సామర్ధ్యాలు వచ్చే విధంగా ఉపాధ్యాయులు కృషి చేయాలిఎఫ్ ఎల్ ఎన్ మండల నోడల్ అధికారి బీరెల్లి శ్రీనివాసరెడ్డి అన్నారు.హుజూర్ నగర్ మండల పరిధిలోని శ్రీనివాసపురం గ్రామంలోని యుపిఎస్  పాఠశాలను బుధవారం తొలిమెట్టు కార్యక్రమంలో భాగంగా ఎఫ్ ఎల్ ఎన్ నోడల్ అధికారి బీరెల్లి శ్రీనివాసరెడ్డి విషయ నిపుణ రిసోర్స్ పర్సన్ ముక్కా సోమశేఖర్ సిఆర్పి రమేష్ లు  సందర్శించారు. అనంతరం పాఠశాలలోని పిల్లలకు ప్రాథమిక పరీక్షలు నిర్వహించి వారి సామర్థ్యాలను పరీక్షించారు.