స్మశాన వాటిక భూమిని, కబ్జా చేశాడని తీన్మార్ మల్లన్నను కలిసిన గంగరబోయిన కుటుంబ సభ్యులు.

Submitted by sridhar on Wed, 14/09/2022 - 17:52
Gangaraboina's family members who met Tinmar Mallanna said that he had taken possession of the cemetery land.

బచ్చన్నపేట సెప్టెంబర్ 14 ప్రజా జ్యోతి:హైదరాబాద్ బోడ ఉప్పల్ లో ఉన్న తీన్మార్ మల్లన్న కార్యాలయానికి గంగరబోయిన కుటుంబ సభ్యలు అందరు మల్లన్నను కలిసి గంగరబోయిన కుటుంబ సభ్యులకు సంబందించిన భూమిని  గిరబోయిన అంజయ్య మా స్మశాన వాటికి భూమిని కబ్జా చేశాడని క్యూ న్యూస్, శనార్తి దినపత్రిక ఎడిటర్ మల్లన్న కి విజ్ఞాపన పత్రం అందజేశారు. అనంతరం వారు మాట్లాడుతూబచ్చన్నపేట మండలం గోపాల్ నగర్ లో నివాసం ఉంటున్న శ్రీ గిరబోయిన అంజయ్య అనే వ్యక్తి తన భార్య గిరబోయిన భాగ్యలక్ష్మీ జిల్లా ప్రజా పరిషత్ వైస్ చైర్మన్ ను అడ్డు పెట్టుకొని ప్రభుత్వ భూములను స్మశాన వాటికలను ఆక్రమించుకొని భూ భాకసురినిగా విరాజిల్లుతున్నాడు. ఈ దగా కోరు భూ కబ్జాలు అక్రమాలు ఈ క్రింది విధంగా వివరించుంచున్నాము.

గంగరబోయిన వారి కుటుంబాలకు సంబంధించిన సర్వే నెంబర్లు 140, 141, 142, 143, 144, 280 లలో మొత్తం విస్తీర్ణం 23-26 గుంటల భూమి కలదు ఇందులో 1-00 ఎకరం భూమిని గంగరబోయిన వారి స్మశాన వాటిక పేరున గత 100 సంవత్సరాల క్రిందనే తీసి గోరీలు ఏర్పాటు చేసుకోవడం జరగుతుంది. గిరబోయిన అంజయ్య అనే భూ దగాకోరు గోరీలను కూల్చీ వేసే ప్వయత్నం చేస్తూ, ఎవరైన మా గంగరబోయిన వారు చనిపోతే శవాన్ని ఆ స్థలంలో పెట్టనివ్వకుండా అడ్డు పడుతూ అందులో ఉన్నటువంటి గోరీలను కూల్చివేతకు పన్నాగం పన్నుతున్నాడు.  చిన్నరాన్ చెర్ల గ్రామ శివారులోని సర్వే నెంబర్ 174 లో విస్తీర్ణం 8-10 భూమికి రెవెన్యూ వారు ప్రభుత్వ భూమిగా గుర్తించి బోర్డు వేసినప్పటికీ అతని రాజకీయ అండదండలతో కబ్జాలోనే ఉంటు సాగు చేసుకుంటున్నాడు.
అయ్యా! గంగరబోయిన వారి కుటుంబాలు బచ్చన్నపేటగోపాల్ నగర్ గ్రామాలలో కలిపి సుమారు 50 కుటుంబాల వారం ఉంటున్నాము. ఎవరు చనిపోయిన అదే స్థలంలో పెట్టే వారం ఇంతలో గిరబోయిన అంజయ్య భార్య భాగ్యలక్ష్మీ ( జనగామ జిల్లా ప్రజా పరిషత్ వైస్ చైర్మన్) కావడం, జనగామ MLA ముత్తరెడ్డి అండదండలతో రాజకీయ ప్రొత్బలంతో మాకున్న స్మశాన వాటికి భూమిని కబ్జా చేసి గోరీలను కూల్చివేస్తున్నాడు.

చివరగా తమతో కోరుకునునది ఏమనగా క్యూ న్యూస్ మరియు శనార్తి పత్రిక ద్వారా శ్రీ గిరబోయిన అంజయ్య ZP వైస్ చైర్మన్ భర్త భూ భకాసుడుగా చలామణి అవుతూ భూములను కబ్జా చేస్తూ ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తున్నందున మీ ద్వారా తెలంగాణ ప్రజలకు తెలిసేలా చేస్తూ మాకు మా స్మశాన వాటికి స్థలం వచ్చేలా కృషి చేయగలరని కోరుకుంటున్నాము.మాన్యం భూమి మాకు ఇప్పించండి..ఈ కార్యక్రమంలో గంగరబోయిన ,దుర్గయ్య,కనకయ్య,సిద్ధులు,మల్లేష్,జానకి,పద్మ,రాజవ్వ,సుగుణమ్మ,బాలమని బిక్షపతి వచ్చావా బుచ్చమ్మ రాజవ్వ శ్రీలత లతా యాదగిరి నరసయ్య పాల్గొన్నారు.