యువత బైటికి రావాలి ప్రపంచంతో పోటీ పడాలి:

Submitted by Ramakrishna on Thu, 29/09/2022 - 11:41
Youth should come out and compete with the world:

మెగా జాబ్ మేళా..జాబ్ మేళాకు విశేష స్పందన..
ఉద్యోగాలు సాధించిన 170 మంది అభ్యర్థులు.ఎమ్మెల్యే సైదిరెడ్డికి కృతజ్ఞతలు  

  హుజూర్ నగర్ సెప్టెంబర్ 28 (ప్రజా జ్యోతి): యువత బైటికి రావాలి ప్రపంచంతో పోటీ పడాలి, అప్పుడే జీవితం గొప్పగా ఉంటుంది అని హుజూర్ నగర్ నియోజకవర్గ ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి అన్నారు. బుధవారం హుజూర్ నగర్ పట్టణం టౌన్ హాల్ లో నిర్వహిస్తున్న మెగా జాబ్ మేళా కి ముఖ్య అతిధిగా స్థానిక ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి పాల్గొని జాబ్ మేళాని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సైదిరెడ్డి  మాట్లాడుతూ జాబ్ మేళా గురించి చెప్పగానే రెండు అతిపెద్ద సంస్థలు అయిన రైస్ సీఈవో కన్నన్ కి,టాస్క్ సంస్థ ప్రదీప్ కి ధన్యవాదాలు తేలియజేశారు. వీరి ఆధ్వర్యంలో హాజరు అయిన 17 మెగా కంపెనీల హెచ్ ఆర్ డైరెక్టర్ లకు స్వాగతం పలికారు. జాబ్ మేళాకు హాజరు అయిన అనేక మంది అభ్యర్థులను ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ వారికి జీవితం గురించి, లైఫ్ స్కిల్స్, అవకాశాల గురించి, విదేశాలలో వుండే ఈ తరం యువత ఆలోచన విధానాల గురించి చాలా క్షుణ్ణంగా వివారించారు. యువత ఇంటి నుండి బైటికి రావాలి. కాన్ఫర్ట్ జోన్ నుండి విదేశాలలో 18 ఏళ్ళు దాటితే తల్లిదండ్రుల మీద ఆధారపడకుండా జీవిస్తారని, అలాంటి ఆలోచన విధానం మనం కూడా అలవర్చుకోవాలి అని తెలియజేశారు. మెగా జాబ్ మేళాలో 800 మంది అభ్యర్థులు హాజరు కాగా ఇప్పటివరకు 170 మంది అభ్యర్థులు వివిధ కంపెనీలలో ఉద్యోగాలకు ఎంపిక కాగా, శాసనసభ్యులు శానంపూడి సైదిరెడ్డి  అభ్యర్థులకు ఆఫర్ లెటర్ అందజేయడం జరిగిందన్నారు.

ఈ సందర్భంగా సెలెక్ట్ అయిన అభ్యర్థులు మాట్లాడుతూ మెగా జాబ్ మేళాను నిర్వహించిన శాసనసభ్యులు శానంపూడి సైదిరెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం రైస్ సంస్థ సీఈవో కన్నన్ కి, టాస్క్ ప్రతినిధి ప్రదీప్ కి, వివిధ కంపెనీల హెచ్ఆర్లకు ఎమ్మెల్యే సైదిరెడ్డి శాలువాతో సన్మానించారు. అనంతరం ఎంపిక కాబడిన అభ్యర్థులందరికీ శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్ పట్టణ అధ్యక్షులు చిట్యాల అమర్నాథ్ రెడ్డి, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ కడియం వెంకట్ రెడ్డి, మున్సిపల్ వైస్ చైర్మన్ జక్కుల నాగేశ్వరరావు, నేరేడుచర్ల వైస్ చైర్మన్ చల్లా శ్రీలత రెడ్డి, గరిడేపల్లి, నేరేడుచర్ల టిఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షులు సురేష్, కృష్ణ నాయక్, చీకూరి లీలావతి, ప్రజా ప్రతినిధులు, టిఆర్ఎస్ నాయకులు, అభ్యర్థులు తదితరులు పాల్గొన్నారు.