విద్యుత్ వినియోగదారులకు న్యాయం చేయాలి

Submitted by Ramakrishna on Wed, 28/09/2022 - 08:54
Justice should be given to electricity consumers

- టీ.పీ.సీ.సీ రాష్ట్ర జాయింట్ సెక్రటరీ ఎండీ. అజీజ్ పాషా
హుజూర్ నగర్ సెప్టెంబర్ 27 (ప్రజా జ్యోతి):
విద్యుత్ వినియోగదారులకు న్యాయం చేయాలని టీ.పీ.సీ.సీ రాష్ట్ర జాయింట్ సెక్రటరీ ఎండీ. అజీజ్ పాషా అన్నారు. తక్షణమే కామన్ సర్వీస్ లను డొమెస్టిక్ కింద   మార్చి వినియోగదారుల బిల్లులు తగ్గించేందుకు చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్ పార్టీ ద్వారా డిమాండ్ చేస్తున్నామన్నారు. అనంతరం హుజూర్‌నగర్ విద్యుత్ శాఖ   (ఎ.ఈ) బి. రామ్ ప్రసాద్ కి వినతిపత్రం అందజేశారన్నారు. మంగళవారం ఈ కార్యక్రమాన్ని  ఉద్దేశించి టీ.పీ.సీ.సీ రాష్ట్ర జాయింట్ సెక్రటరీ ఎండీ అజీజ్ పాషా మాట్లాడుతూ  ఆదాయం పెంచుకోవడం కోసం సామాన్యులపై విద్యుత్ భారం మోపుతారా..! అని ప్రశ్నించారు. హుజూర్‌నగర్ మున్సిపాలిటీ పరిధిలోని పలు గృహ వినియోగదారుల విద్యుత్ కనెక్షన్లు సాధారణ నివాసాలకు డొమస్టిక్ గా ఉన్న విద్యుత్ కనెక్షన్లను సుమారు  2000 వేల వరకు కామన్ సర్వీస్ కింద 2019 సంవత్సరంలో   పలువురు కిందిస్థాయి విద్యుత్ శాఖ లైన్మెన్లు  మార్పిడి చేశారని ఆరోపించారు. దీనితో గృహ వినియోగదారులకు వందల్లో రావాల్సిన బిల్లు వేల రూపాయల లో వస్తుంది దీనితో వినియోగదారులు పరిశీలించగా విద్యుత్ శాఖాధికారులు మీ డొమెస్టిక్ కనెక్షన్ను కామన్ సర్వీస్ కింద మార్చామని తేల్చి చెప్పటంతో షాక్ కి గురైన వినియోగదారులు మరలా 2020 సంవత్సరంలో డొమెస్టిక్ గా  మార్చగలరని దరఖాస్తు చేసుకున్నారన్నారు.

పలువురు లైన్ మెన్ లు కేవలం అర్హత లేని ఇళ్లను కూడా డొమెస్టిక్ గా ఉన్నవారిని కామన్ సర్వీస్ కింద మార్చడం చాలా విచిత్రమైన విషయం అని ఆయన అన్నారు. దీని వలన స్లాబ్ రేట్లు పెరిగి వినియోగదారులపై అధికంగా బిల్లులొస్తున్నాయి అన్నారు. గత రెండు సంవత్సరాల క్రితం సవరణకోసం విద్యుత్ శాఖ అధికారులకు ఈ వినియోగదారులు అర్జీలు పెట్టుకున్నారు కానీ నేటి వరకు కూడా సవరణ జరగకపోవటంతో ప్రతినెలా వేల రూపాయలు విద్యుత్ బిల్లులు చెల్లించాల్సిన పరిస్థితి వినియోగదారులకు దాపురించింది అని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు జక్కుల మల్లయ్య, ముశం సత్యనారాయణ, కోల మట్టయ్య, నియోజకవర్గ కళాకారులు కంబాల శ్రీనివాస్,  దొంతగాని జగన్, నవీన్, ముత్తయ్య  తదితరులు పాల్గొన్నారు.