అధికారులే భూఆక్రమణ దొంగలకు సహకరిస్తున్నారు:

Submitted by Ramakrishna on Fri, 30/09/2022 - 09:19
Officials are helping land grabbers:

ఆక్రమణకు గురైన మున్సిపల్ లేఅవుట్ భూములను పరిశీలిస్తున్న ఎంపీ

హుజూర్ నగర్ సెప్టెంబర్ 29(ప్రజా జ్యోతి).//..అధికారులు భూములఆక్రమణ దొంగలకు సహకరిస్తున్నారని నల్లగొండ పార్లమెంట్ సభ్యులు ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. హుజూర్ నగర్ పట్టణకేంద్రంలో ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి గురువారంఆక్రమణకు గురైన మున్సిపల్ లేఅవుట్ భూము
లను పరిశీలించడం జరిగింది. హుజూర్ నగర్ మున్సిపాలిటీలోని సాయిబాబా థియేటర్ పక్కనగల మున్సిపల్ అవుట్ ప్లాట్ సర్వేనెంబర్ 2072009 లలో 5510 గజాలనుపరిశీలించి విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్వర్ రెడ్డి08.03 2017 లో 14వ ఆర్థిక సంఘం 2015 -16 నిధులనుండి 70 లక్షల వ్యయంతో సమీకృతమార్కెట్ సముదాయానికి లే అవుట్ స్థలంలోమార్కెట్ కు కేటాయించిన భూమి లో శంకుస్థాపన చేసి ఉన్న శిలాఫలకాలను చూపి ఈభూమిని నాటి నగర పంచాయతీ పాలకవర్గంలోఉన్న కౌన్సిలర్లు నేడు మున్సిపాలిటీలో కూడా ఉన్నభూమిని అమ్మకాలను ఆక్రమణలను నిలుపుదలచేయలేకపోయారన్నారు. అనంతరం పద్మశాలిభవన్ ప్రక్కన గల సర్వేనెంబర్ 206 నందు 2350గజాలను పరిశీలించి చిన్న గది నిర్మించి దానికిఇంటి నెంబర్ ఇచ్చి మరీ లేఅవుట్ స్థలాన్ని కబ్జాచేసి అమ్మకాలకు పెట్టారని విమర్శించారు తదుపరివిపిఆర్ వెంచర్ లో సుమారు 2000 గజాలనుపరిశీలించి యథేచ్ఛగా ఆక్రమించారని దొంగలముఠాలా మున్సిపల్ లేఅవుట్ భూముల డాక్యమెంట్ల కు దొంగలు పడుతున్నారని ఎవరు దొంగలించారో కనీసం మున్సిపల్ కమిషనర్ పట్టించుకోవడంలేదని హుజూర్ నగర్ నియోజకవర్గంలోప్రభుత్వ భూములను లేఅవుట్ భూములను స్వాదీనం చేసుకుంటున్న ఆర్డిఓ పట్టించుకునేది లేదనీ,రెవిన్యూ పోలీస్ మున్సిపల్ అధికారులు భూములఆక్రమణ దొంగలకు సహకరిస్తున్నారని జిల్లాస్థాయి అధికారులు కానీ రాష్ట్ర స్థాయి అధికారులుగాని పట్టించుకోకపోవడం దుర్మార్గమని పీసీసీమాజీ ఛీఫ్, నల్గొండ ఎంపీఉత్తమ్ కుమార్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు గత 9 నెలలుగా జనరల్ బాడీమీటింగ్ ఏర్పాటు చేయకుండా కలెక్టర్ ఎమర్జెన్సీపవర్స్ పేరుతో పనులు చేయడం విడ్డూరంగాఉందని కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో హుజూర్ నగర్మున్సిపాలిటీ ఎదురుగా శుక్రవారం ధర్నా నిర్వహించడం జరుగుతుందని వాటి ధర్నాలో తానుకూడా పాల్గొనడం జరుగుతుందని తెలియ జేశారు.

ఈ కార్యక్రమంలో ఐఎన్టీయూసీ రాష్ట్ర ప్రధానకార్యదర్శి యరగాని నాగన్న గౌడ్, పట్టణ కాంగ్రెస్అధ్యక్షుడు తన్నీరుమల్లిఖార్జున్, కౌన్సిలర్లు కస్తాలశ్రవణ కుమార్, కోతి సంపత్ రెడ్డి, తేజావత్ రాజా,కారింగుల విజయ వెంకటేశ్వర్లు, వెలిదండ సరితావీరారెడ్డి, బొల్లెద్దు ధనమ్మ జైలు, నియోజకవర్గయూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు కుక్కడపు మహేష్గౌడ్, యూత్ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కందుల వినయ్, కస్తాల రవీంద్ర, రెడపంగు రాముతదితరులు పాల్గొన్నారు.