బతుకమ్మ పండుగ తెలంగాణ సాంస్కృతిక వైభవానికి ప్రతీక

Submitted by Ramakrishna on Thu, 29/09/2022 - 11:37
Bathukamma festival symbolizes the cultural splendor of Telangana

హుజూర్ నగర్ సెప్టెంబర్ 28 (ప్రజా జ్యోతి): మండలంలోని శ్రీనివాసపురం గ్రామంలో సర్పంచ్ పత్తిపాటి రమ్య నాగరాజు అధ్యక్షతన జరిగిన బతుకమ్మ చీరల పంపిణీ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన హుజూర్ నగర్ ఎంపీపీ గూడెపు శ్రీనివాస్, జెడ్ పి టి సి కొప్పుల సైదిరెడ్డి లు బుధవారం  మహిళలకు బతుకమ్మ చీరలు అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ ఆడబిడ్డలు బతుకమ్మ పండుగను  ఘనంగా జరుపుకోవాలని   ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు కోట్ల రూపాయలు వెచ్చించి మహిళలకు ఇష్టమైన అనేక రంగుల్లో బతుకమ్మ చీరలు తయారు చేయించి తెలంగాణ ఆడపడుచులకు బతుకమ్మ పండుగ కానుకగా రాష్ట్రవ్యాప్తంగా 18 సంవత్సరాలు నిండి రేషన్ కార్డులో పేరు ఉన్న ప్రతి మహిళకు బతుకమ్మ చీరలు అందిస్తున్నారన్నారు. తెలంగాణలో జరుపుకుంటున్న బతుకమ్మ  పండుగకు ఎంతో చారిత్రక ప్రాధాన్యత  ఉందన్నారు. తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలు దేశానికి తలమానికమన్నారు.

బతుకమ్మ పండుగ తెలంగాణ సాంస్కృతిక వైభవానికి ప్రతీక అని తెలిపారు. హుజూర్ నగర్ నియోజకవర్గంలో శాసన సభ్యులు శానంపూడి సైదిరెడ్డి  బతుకమ్మ పండుగ కార్యక్రమాల్లో పాల్గొని మహిళల్లో ఉత్సాహాన్ని, చైతన్యాన్ని నింపుతున్నారు అన్నారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ జింకల గురవయ్య, జిల్లా రైతు సమన్వయ సమితి సభ్యులు చావా వీరభద్రరావు,  పిఎసిఎస్ చైర్మన్ కట్ట గోపాలరావు, వార్డు సభ్యులు జింకల వెంకటేశ్వర్లు,   శాఖమూరి పాపారావు జింకల పెద్ద నరసయ్య, చల్లా సైదులు, తుళ్లూరు సైదులు, నాగభూషణం, టిఆర్ఎస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షులు జింకల శ్రీనివాస్, గ్రామ పంచాయతీ కార్యదర్శి శేఖర్, గుండెబోయిన శ్రీనివాస్, అంగన్వాడి టీచర్లు, గ్రామ పంచాయతీ సిబ్బంది, లబ్ధిదారులు తదితరులు పాల్గొన్నారు.