హుజూర్ నగర్

అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించిన ఉత్తమ్ కుమార్ రెడ్డి

Submitted by Ramakrishna on Sat, 01/10/2022 - 11:54

హుజూర్ నగర్ సెప్టెంబర్ 30(ప్రజా జ్యోతి)../..హుజూర్ నగర్ పట్టణంలోని 18 వార్డు నందు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు జక్కుల మల్లయ్య యాదవ్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న దేవి నవరాత్రి ఉత్సవాలలో గురువారం ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం  జక్కుల మల్లయ్య యాదవ్ దంపతులు ఉత్తంకుమార్ రెడ్డికి శాలువాలతో ఘనంగా సన్మానించారు.ఈ సందర్భంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ అమ్మవారి దీవెనలు ప్రతి ఒక్కరిపై ఉండాలని, ప్రతి ఒక్కరూ సుఖసంతోషాలతో  ఆయురారోగ్యాలతో పండుగ దిగ్విజయంగా నిర్వహించుకోవాలని  ప్రజలందరికీ దసరా శుభాకాంక్షలు తెలియజేశారు.

ఎంపీ ఉత్తమ్ కు సవాల్ విసిరిన ఎమ్మెల్యే సైదిరెడ్డి

Submitted by Ramakrishna on Sat, 01/10/2022 - 11:48

-మున్సిపల్ లేఅవుట్లకు సంబంధించి నిజం నీగ్గు తేల్చాలి
-ఉత్తమ్ కుమార్ రెడ్డి బహిరంగ చర్చకు సిద్ధమా ?
- అబద్ధపు ప్రచారాలతో ప్రజలను మోసగిస్తున్న ఎంపీ ఉత్తమ్ 
- ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి

మహా అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే

Submitted by Ramakrishna on Sat, 01/10/2022 - 11:46

హుజూర్ నగర్ సెప్టెంబర్ 30 (ప్రజా జ్యోతి):  దుర్గామాత దయతో ప్రజలంతా సుభిక్షంగా ఉండాలని  హుజూర్ నగర్ శాసనసభ్యులు శానంపూడి సైదిరెడ్డి అన్నారు. శుక్రవారం హుజూర్ నగర్ పట్టణంలోని 3, 4 వ వార్డు పరిధిలో శ్రీదేవి దుర్గామాత నవరాత్రి ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో కుంకుమ పూజ, ఏర్పాటుచేసిన దుర్గామాత విగ్రహం వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం మహా అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గత పాలకవర్గాల హయాంలో దసరా పండుగ ప్రాచుర్యం కోల్పోయిందన్నారు.

కుల మత వర్గ బేధాలు లేకుండా అందరికీ సమాన అవకాశాలు:ఎంపీపీ గూడెపు శ్రీనివాస్

Submitted by Ramakrishna on Sat, 01/10/2022 - 11:40

హుజూర్ నగర్ సెప్టెంబర్ 39(ప్రజా జ్యోతి)./...భారత రాజ్యాంగం ప్రకారం సమాజంలో కుల మత వర్గ బేధాలు లేకుండా అందరికీ సమాన అవకాశాలు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని ఎంపీపీ గూడెపు శ్రీనివాస్ అన్నారు. మండల పరిధిలోని బూరుగడ్డ గ్రామంలో శుక్రవారం పౌర హక్కుల దినోత్సవం పురస్కరించుకొని ఎస్సీ కాలనీలో  సమావేశం ఏర్పాటు చేశారు. కాలనీవాసులు గతంలో నిరుపేదలైన ఎస్సీలకు ప్రభుత్వం ఇళ్ల స్థలాల నిర్మాణానికి ఇండ్ల పట్టాలు ఇచ్చిన నేటి వరకు స్థలం ఎందుకు ఇవ్వలేదని రెవిన్యూ అధికారులను నిలదీశారు.

మున్సిపాలిటీ అవినీతి, అక్రమాలపై విచారణ చేపట్టాలి

Submitted by Ramakrishna on Sat, 01/10/2022 - 10:14

-10%కమిషన్ కోసమే ఇంటిగ్రేడ్ మార్కెట్ మార్పు
-హుజూర్ నగర్ లో 9 నెలలుగా నిర్వహించని మునిసిపల్ జనరల్ బాడీ సమావేశం  మున్సిపల్ కార్యాలయం ఎదుట కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ధర్నా   భూ కబ్జాలకు వ్యతిరేకంగా నిరసన  - ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి      

డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ పేరు పెట్టడం హర్షించదగ్గ విషయం - చీకూరి లీలావతి

Submitted by Ramakrishna on Fri, 30/09/2022 - 11:20

హుజూర్ నగర్ సెప్టెంబర్ 29 (ప్రజా జ్యోతి):  తెలంగాణ ప్రభుత్వం నూతనంగా నిర్మిస్తున్న అసెంబ్లీ భవనానికీ రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ పేరు పెట్టడం హర్షించదగ్గ విషయం అని విన్నపం ఒక పోరాటం స్వచ్ఛంద సంస్థ రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షురాలు చీకూరి లీలావతి అన్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి కెసిఆర్ కి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. గురువారం హుజూర్ నగర్ పట్టణం లో నిర్వహించిన కార్యక్రమంలో ఆమె మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్రాలు భర్తను కోల్పోయిన స్త్రీలకి పెన్షన్ ఇస్తూ వారిని  ఒంటరి మహిళ పథకం పేరును కూడా తొలగించి మరో పేరు పెట్టాలన్నారు.

దుర్గామాత ఆశీస్సులతో నియోజకవర్గ ప్రజలందరూ సుభిక్షంగా ఉండాలి: ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి

Submitted by Ramakrishna on Fri, 30/09/2022 - 10:49

 హుజూర్ నగర్ సెప్టెంబర్ 29 (ప్రజా జ్యోతి):  హుజూర్ నగర్ పట్టణంలోని  17వ వార్డ్ నందు దేవినవరాత్రుల ఉత్సవాల్లో స్థానిక ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి గురువారం పాల్గొన్నారు. వార్డులో ఏర్పాటు చేసిన దుర్గాదేవి అమ్మవారి విగ్రహం దగ్గర ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ దుర్గామాత ఆశీస్సులతో నియోజకవర్గ ప్రజలందరూ సుభిక్షంగా ఉండాలన్నారు. ఈ కార్యక్రమంలో హుజూర్ నగర్ మున్సిపల్ వైస్ చైర్మన్ జక్కుల నాగేశ్వరరావు, పట్టణ ప్రధానకార్యదర్శి బెల్లంకొండ అమర్ గౌడ్, దొంతగాని రమేష్, యువకులు, మహిళలు, భక్తులు తదితరులు పాల్గొన్నారు.

తెలంగాణ సంస్కృతికి సంప్రదాయాలకు దుర్గా మాత ఉత్సవాలు ప్రతీకలు:

Submitted by Ramakrishna on Fri, 30/09/2022 - 10:39

మహిళలకు బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు తెలిపిన హుజూర్ నగర్ ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి

జోనల్ స్థాయి కబడ్డీ ఆటల పోటీలలో మఠంపల్లి గురుకుల బాలికల హావ

Submitted by Ramakrishna on Fri, 30/09/2022 - 10:07

హుజూర్ నగర్ సెప్టెంబర్ 29(ప్రజా జ్యోతి)./..గురుకుల సోషల్ వెల్ఫేర్ ఎనిమిదవ జోనల్ స్థాయి ఆటల పోటీల్లో మఠంపల్లి గురుకుల బాలికలలు సత్తా చాటారు. కబడ్డీ,రన్నింగ్, షార్ట్ పుట్, 200 మీటర్ల లలో ప్రథమ, ద్వితీయ స్థలాలను కైవసం చేసుకున్నారు.కబడ్డీ ప్రథమ స్థానం,200 మీటర్ల పరుగు పందెం14 సంవత్సరాల బాలిక  ఎస్.సిరి ద్వితీయ స్థానం, షార్ట్ పుట్లో 14 సంవత్సరాల బాలిక బి.నవ్య ప్రథమ బహుమతి, 800 మీటర్ల పరుగు పందెంలో భవాని , డిస్కస్ త్రో బి. నవ్య, క్యారమ్ .దీపిక, వినీల, లు మొదటి బహుమతి, చెస్ శ్రీ ప్రవలిక ద్వితీయ బహుమతు లను సాధించారు.