మున్సిపాలిటీ అవినీతి, అక్రమాలపై విచారణ చేపట్టాలి

Submitted by Ramakrishna on Sat, 01/10/2022 - 10:14
The municipality should investigate corruption and irregularities

-10%కమిషన్ కోసమే ఇంటిగ్రేడ్ మార్కెట్ మార్పు
-హుజూర్ నగర్ లో 9 నెలలుగా నిర్వహించని మునిసిపల్ జనరల్ బాడీ సమావేశం  మున్సిపల్ కార్యాలయం ఎదుట కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ధర్నా   భూ కబ్జాలకు వ్యతిరేకంగా నిరసన  - ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి      

హుజూర్ నగర్ సెప్టెంబర్ 30 (ప్రజా జ్యోతి): హుజూర్ నగర్  మున్సిపాలిటీలో జరుగుతున్న అవినీతి, అక్రమాలపై విచారణ చేపట్టాలని నల్లగొండ పార్లమెంట్ సభ్యులు ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. శుక్రవారం ఉత్తమ్ ఆధ్వర్యంలో మున్సిపాలిటీలో జరుగుతున్న అవినీతికి నిరసనగా  మున్సిపాలిటీ ఎదుట కాంగ్రెస్ పార్టీ  పెద్ద ఎత్తున ధర్నా కార్యక్రమం నిర్వహించారు. పట్టణంలో నియోజకవర్గ యూత్ అధ్యక్షుడు కుక్కలకు మహేష్ గౌడ్ ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ నిర్వహించారు. ఈ సమావేశంలో ఎంపీ ఉత్తమ్, డీసీసీ అధ్యక్షుడు చెవిటి వెంకన్న యాదవ్ లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ మున్సిపాలిటీలో 100 కోట్ల రూపాయలకు పైగా విలువైన మున్సిపల్ భూములు, భూ దస్తావేజులు చోరీకి గురైనాయని క్రిమినల్ కేసులు నమోదు చేసి దోషులను శిక్షించాలన్నారు. అనుమతులు లేకుండా అక్రమ వెంచర్లు ను ఏర్పాటు చేస్తున్న వారికి అధికారులు వత్తాసు పలుకుతున్నారన్నారు. భూకబ్జాలకు వ్యతిరేకంగా నిరసన చేపట్టారు. హుజూర్ నగర్ లో 9 నెలలుగా మున్సిపల్ జనరల్ బాడీ సమావేశాన్ని నిర్వహించడం లేదన్నారు. మున్సిపల్ సర్వ సభ్య సమావేశాలు లేకుండా పనులను చేయడంపై మున్సిపల్ కౌన్సిలర్లు నిరసన తెలిపారన్నారు.

హుజూర్నగర్ నియోజకవర్గంలో జరిగే భూకబ్జాలు అక్రమాలపై సమగ్ర విచారణ జరపాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు తన్నీరు మల్లికార్జున్,  దక్షిణ మధ్య రైల్వే బోర్డు మెంబర్ యరగాని నాగన్న గౌడ్, అధికార ప్రతినిధి అల్లం ప్రభాకర్ రెడ్డి, సీనియర్ నాయకులు సాంబశివారెడ్డి, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు అనిల్ కుమార్ దేశ్ ముక్, కౌన్సిల్ ఫ్లోర్ లీడర్ కస్తాల శ్రావణ్  కుమార్, కౌన్సిలర్స్ కోతి సంపత్ రెడ్డి, వేముల వరలక్ష్మి నాగరాజు, బుల్లెద్దు ధనమ్మ జైలు, వెలిదండ సరితా వీరారెడ్డి, తేజవత్ రాజా నాయక్, కారింగుల విజయ వెంకటేశ్వర్లు, ఐటీ సెల్ ఉపాధ్యక్షులు సుంకరి శివరామ్ యాదవ్, యూత్ కాంగ్రెస్ నియోజకవర్గ అధ్యక్షులు కుక్కడపు మహేష్, పట్టణ ప్రధాన కార్యదర్శి ఎడపల్లి వీరబాబు, పట్టణ ఉపాధ్యక్షులు జక్కుల మల్లయ్య, గొట్టుముక్కల రాములు,  నాయకులు బాచిమంచి గిరిబాబు,  బెల్లంకొండ గురవయ్య, మేళ్ళచెరువు ముక్కంటి, పాశం రామరాజు, పోతన బోయిన రామ్మూర్తి, కోడి ఉపేందర్, ముషం సత్యనారాయణ, దొంతగాని జగన్, బచ్చలకూరి కృష్ణప్రసాద్, లచ్చి మల్ల  నాగేశ్వరరావు, పోతుల జ్ఞానయ్య, జింజిరాల సైదులు, తేప్పని ఎలమంద, చింతకాయల రాము, దాసరి పున్నయ్య, కస్తాల రవీందర్, రేడ పంగు రాము, ధరావతు నవీన్ నాయక్, నంది రెడ్డి ఇంద్రారెడ్డి, షేక్ ఉద్దండుడు, రాము, తదితర నాయకులు పాల్గొన్నారు.