డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ పేరు పెట్టడం హర్షించదగ్గ విషయం - చీకూరి లీలావతి

Submitted by Ramakrishna on Fri, 30/09/2022 - 11:20
 Named after Dr. BR Ambedkar - Chikuri Lilavati is a matter of joy

హుజూర్ నగర్ సెప్టెంబర్ 29 (ప్రజా జ్యోతి):  తెలంగాణ ప్రభుత్వం నూతనంగా నిర్మిస్తున్న అసెంబ్లీ భవనానికీ రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ పేరు పెట్టడం హర్షించదగ్గ విషయం అని విన్నపం ఒక పోరాటం స్వచ్ఛంద సంస్థ రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షురాలు చీకూరి లీలావతి అన్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి కెసిఆర్ కి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. గురువారం హుజూర్ నగర్ పట్టణం లో నిర్వహించిన కార్యక్రమంలో ఆమె మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్రాలు భర్తను కోల్పోయిన స్త్రీలకి పెన్షన్ ఇస్తూ వారిని  ఒంటరి మహిళ పథకం పేరును కూడా తొలగించి మరో పేరు పెట్టాలన్నారు. ఆర్థిక సాయం పేరుతో సహాయం చేస్తూ ఆత్మస్థైర్యాన్ని తగ్గింఛి అవమానించే  విధంగా  ఉన్నాయని వాటిని కూడ తొలగించి వాటి స్థానంలో మరొక ఆత్మస్థైర్యాన్ని నింపే పేర్లను పెట్టాలన్నారు. స్త్రీలపై అనాదిగా వస్తున్న ఈ విధానాన్ని స్వస్తి పలకాలని అన్నారు. ఈ కార్యక్రమంలో పబ్బతి స్రవంతి,
కొమ్ము ఉషారాణి, ఏలూరి పావని, ఏం పంగి రూప, షేక్ అమీనా, షేక్హలీమా, వేరుపాల నిర్మల, జింకల అనుష, చిలకల మల్లేశ్వరి, దార పూర్ణ, పోలేబోయిన మౌనిక, మెల్ల బోయిన కృష్ణవేణి తదితరులు పాల్గొన్నారు.